Latest Updates
-
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!
ఈ వంటనూనెలు ప్రమాదకరం సుమా!
మనలో చాలామంది వంట నూనెలు ఉపయోగించకుండా వంటలు చేయలేరు. కాని ఈ వంట నూనెలను మీరు కనుక అతి తక్కువగా వాడేవారైతే, మీకు మంచి ఆరోగ్యకర జీవన విధానం ఉంటుంది. మార్కెట్ లో నేడు లభ్యమవుతున్న వంటనూనెలు చాలా వరకు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. వాటిలో హానికరమైన శాట్యురేటెడ్ కొవ్వులు ఉంటున్నాయి. చాలామంది గృహిణులు నూనెలపై కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. దీనితో అవి కూడా కొన్ని అనారోగ్య వంట నూనెలుగానే ఉంటాయి. మరి మీరు ఈ వంటనూనెల కొనుగోలుకు టి.వి. లేదా ప్రకటనలలో చూపే వాటికి ఆకర్షణ కాకండి. అనారోగ్య వంటనూనెలు ఏవో తెలుసుకోండి. వాటిని ఇక ఎప్పుడూ వాడకండి.

అనారోగ్య వంట నూనెలు వాడకూడనివి .....
1. పామ్ ఆయిల్ - సాధారణంగా ఈ వంటనూనెను ఆప్రికాలో ఎక్కువగా వాడతారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా, ఈజిప్టు, కాంగో మొదలైన దేశాలలోని ప్రజలు అనారోగ్యమైన ఈ వంటనూనె వాడతారు. ఈ దేశాలలో పామ్ ఆయిల్ స్ధానికి ప్రదేశాలలో తయారు చేస్తారు. ఇక్కడి ప్రజలకు ఇది మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో 30 శాతం వరకు శాట్యురేటెడ్ కొవ్వులు ఉండి గుండె ఆరోగ్యానికి చేటు తెస్తాయి.
2. పామ్ కెర్నెల్ ఆయిల్ - చాలామంది పామ్ ఆయిల్ మరియు పామ్ కెర్నెల్ ఆయిల్ రెండూ ఒకటేనని భావిస్తారు. మొదటిది పామ్ పండునుండి తీస్తారు. రెండవది పామ్ ఫ్రూట్ లోని గింజలనుండి తీస్తారు. పామ్ చెట్లు పెరిగే కోస్తా తీరాల వెంబడి ఈ నూనెలు బాగా వాడతారు. అన్ని వంటనూనెలకంటే కూడా పామ్ ఆయిల్ బాగా అనారోగ్యం. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్ లు తయారీ విధానంపై ఆధారపడి 80 నుండి 85 శాతం వరకు ఉంటాయి.
3. కొబ్బరి నూనె - కొబ్బరి లో కొల్లెస్టరాల్ మరియు కొవ్వులు అధికం. కనుక కొబ్బరి నూనెలో కూడా సాధారణంగా శాట్యురేటెడ్ కొవ్వులు అధికంగానే ఉంటాయి. ఇవి షుమారుగా 17 శాతం పైగా ఉంటాయి. కొబ్బరి నూనె తల వెంట్రుకలకు మంచి పోషణ నిస్తుంది. కాని మీ రక్తనాళాలకు అధికంగా వినియోగిస్తే మంచిది కాదు. కొబ్బరినూనెను అధికంగా మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలవారు వాడతారు. దీనిని సాంప్రదాయంగా ఎన్నో వంటలలో వాడుతున్నప్పటికి వీలైనంతవరకు దీని వాడకాన్ని తగ్గించుకోవటం మంచిది.
4. జొన్న నూనె - షుమారుగా కొంతకాలం క్రిందట జొన్నవిత్తుల నూనె ఆరోగ్యకరమైన వంటనూనెగా చెప్పబడుతూ మార్కెట్ లోకి వచ్చింది. కాని తర్వాతి రోజులలో అది అనారోగ్యమని దానిలో ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండి, కడుపులో మంట ఏర్పడుతుందని తెలియటంతో ఈ నూనె వాడకం వెనుకబడింది.
5. హైడ్రోజనేటెడ్ ఆయిల్ - పాక్షికంగా హైడ్రోజన్ కల ఆయిల్ అని ఉంటే దానిని వాడకండి. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉండి మీ రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి. తయారీ దారులు పాక్షికం అంటే కొంతమేరకే అని వ్రాసినప్పటికి దానికి తగ్గ హాని జరిగి తీరుతుంది. కనుక మీ వంటలలో హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉపయోగించవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
