Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి!
మహిళల అనారోగ్యపు అలవాట్లు!
ఒక ఇంటికి కుటుంబపరంగా జాగ్రత్తలు తీసుకోవలసినవారు మహిళలు. ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే, వీరి జాగ్రత్తలే కారణమవుతాయి. ఏది జరిగినా ఇంటి ఇల్లాలిదే భాధ్యత అని కూడా అంటారను. అయితే, మహిళలలో కొన్ని చెడు అలవాట్లు గమనిస్తూ వుంటాం. ఈ అలవాట్లను ఆమె రెగ్యులర్ గా కలిగి వుంటుంది. కాని ఎవరూ గమనించరు.

మరి మహిళలో అనారోగ్యకరమైన చెడు అలవాట్లు ఏమిటి? అవి ఎలా ఉంటాయి?
క్రాష్ డైట్ - తీవ్రమైన డైటింగ్ చేస్తారు. పాత దుస్తులు కొద్దిగా టైట్ అయ్యాయంటే చాలు, మహిళ నేను లావెక్కిపోతున్నాను అంటూ, ఆహారం తినటం మానేస్తుంది. ఇక వారి లక్ష్యం వ్యాయామాలు చేయడం, ఆహారం సరిగా తినకపోవడంగా వుంటుంది. ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు. కాఫీలు, టీలు తాగి సరిపెట్టుకుంటారు. ఇది చాలా చెడు అలవాటు. ఆరోగ్యానికి హానికరం. శరీరానికి తగినంత పోషకాలు, ఖనిజాలు అందకపోతే, శరీరంలోని అవయవాలు నిస్సత్తువ అవుతాయి. రుతుక్రమంలో తమకు ప్రతి నెలా కొంత రక్తం తగ్గిపోతుందనే వాస్తవాన్ని మహిళలు గ్రహించాలి. ఆరోగ్యంగా వుండాలంటే, తగినంత బ్లడ్ కౌంటు వీరు మెయిన్టెయిన్ చేయాలి. ఆరోగ్యంగా వుండటానికి, అందంగా వుండేందుకు మీరు తగినంత రక్తస్ధాయిలు శరీరంలో కలిగివుండాలి. సరైన సలహాలు లేకుండా డైటింగ్ చేస్తే మహిళ తన అందాన్ని కోల్పోతుంది.
బ్రాసరీలు - తన స్తనాల సైజులను కాపాడుకోవటానికి వాటిని మంచి షేప్ లో వుంచుకోవాలని మహిళ ఎంతో బిగువుగా వుండే బ్రాసరీలు ధరిస్తుంది. అంతేకాదు, బ్రాసరీ విప్పకుండా రాత్రి పడకకు కూడా వెళుతుంది. ఇది ఒక అనారోగ్య అలవాటు. మొదటగా బ్రా వేస్తే ఆమె స్తనాలలో రక్త ప్రసరణ సరిగా లేక బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. మరి అటువంటి బ్రా వేసుకుని రాత్రుళ్ళు పడుకుంటే మరింత రిస్కు వుంటుంది. సరైన బ్రా వేయండి మీ స్తనాల ఆకారం బాగుండేలా చూసుకోండి. బిగువైన బ్రాలు మీ రొమ్ములను రూపం లేకుండా చేస్తాయి. స్తనాలలో నొప్పి కలిగిస్తాయి. వెన్ను, లేదా మెడ నొప్పి కూడా వచ్చేలా చేస్తాయి.
బరువైన చెవుల రింగులు - మహిళలు ఆభరణాలు ఇష్టపడతారు. బరువుగా వేలాడే చెవి రింగులు బయటకు చూచేందుకు బాగానే వుంటాయి. కాని, ఇంటికివచ్చినప్పటికి వారు వాటిని తీయరు. వాటితోనే నిద్రిస్తారు. అవి చెవులు బాగా సాగేలా చేస్తాయి. మీ చెవి రంధ్రం పెద్దది అయ్యేలా చేస్తాయి.
హై హీల్స్ - మహిళలు హై హీల్స్ వేసేందుకు బాగా ఇష్టపడతారు. అవి వారిలో ఆత్మవిశ్వాసం అధికం చేస్తాయని, వారి శరీర రూపాన్ని అందంగా ఉంచుతాయని భావిస్తారు. హై హీల్స్ తో శరీర రూపం బాగానే వుంటుంది. కాని దానివలన కొన్ని నష్టాలున్నాయి. మడమల నొప్పి, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వాటిని వేసుకున్న తర్వాత మహిళ ఎదుర్కొనవలసి వస్తుంది.
లో దుస్తులు - జననాంగాల పరిశుభ్రత చాలా ప్రధానం. మహిళలు ఈ అంశంలో జాగ్రత్తగా వుండాలి. మార్కెట్ కు వెళ్ళినపుడు, లో దుస్తులు కొనేయాలని అనుకోవటమే కాదు. అవి సౌకర్యవంతమైనవా కాదా అనేది పరిశీలించాలి.గుడ్డ నాణ్యత పరిశీలించాలి. సింధటిక్ లో దుస్తులు త్వరగా ఎండవు. మీ జననాంగాలకు దురద, చెడు వాసన వచ్చేస్తాయి. సింధటిక్ లో దుస్తులు వేసుకునే మహిళలు దురద తప్పక భావిస్తారు. కాటన్ లో దుస్తులు త్వరగా ఎండిపోతాయి, తేలికగాను వుంటాయి. కనుక మహిళ వీటిని యధేచ్ఛగా వాడవచ్చు.
ఈ చెడు అలవాట్లు మహిళలకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. కనుక వారు వీటిపట్ల అప్రమత్తంగా వుండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications