Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పేరుకు మాత్రమే పని...వాస్తవంలో తినేది తిండే...!
సాధారణంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. ఇంటిలో ఆహారం దగ్గరనుండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. అయితే, కొన్నిమార్లు, కార్యాలయాలలో పని చేసే వారు పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యపుటలవాట్లు మరచి, కొన్ని చెడు అలవాట్లకు లోనవుతారు. అవి తినటంలో లేదా ఇతర కారణాలుగా కూడా మనకు తెలియకుండానే మనం ఆచరిస్తూ ఉంటాం. మరోవైపు బరువుతగ్గేందుకు ఎన్నో విధానాలు ఇంటి వద్ద ఆచరిస్తూ ఉంటాం. కాని వాటి కొరకు చేసే ప్రయత్నమంతా వ్యర్ధం అయిపోతూ ఉంటుంది. మరి అటువంటి అలవాట్లు ఏమిటి? వాటిని ఎలా వదలాలి? అనేది పరిశీలించండి.

ఆఫీసులలో ఆచరించే చెడు విధానాలు -
1. బ్రేక్ ఫాస్ట్ మానేయటం - ఉదయంవేళ ఆఫీస్ కు సమయం అయిపోతోంది అంటూ బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఆఫీసుకు బయలుదేరుతారు. ఇది ఇంటి వద్ద చేసే అలవాటే అయినప్పటికి ఆఫీస్ కారణంగా ఈ పని చేస్తారు కనుక ఇది ఆఫీస్ కు సంబంధించిన చెడు అలవాటుగా చెప్పచ్చు. ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాని దానిని చేయరు. కనుక ఇక లంచ్ సమయంలో అధిక ఆకలి కలిగి, ఆహారాన్ని అధికంగా భుజించేస్తారు.
2. ఆఫీస్ లో తినే అనారోగ్య చిరుతిండ్లు - ఆఫీస్ లో మనం తినేవి సాధారణంగా వేపుడు పదార్ధాలుగాను లేదా అధిక సాల్ట్ లేదా కారం, కలిపిన ఆహారాలుగాను ఉంటాయి. పని చేసే సమయంలో మనకు తెలియకుండానే వాటిని తినేస్తాం. పరిమాణం కూడా కాస్త అధికంగానే ఉంటుంది. మరి బరువు పెరగటానికి ఇది ప్రధాన కారణమే. ఈ అలవాటు మానాలంటే, ఒక బాక్స్ లో తాజా పండ్లు, కూరగాయాలు తీసుకు వెళ్ళి పని చేసే సమయంలో వాటిని తింటూ ఉండండి. మరి బరువు తగ్గాలంటే, ఆరోగ్యకర ఆహారాలు తినాల్సిందే.
3. కాఫీ - కాఫీ బ్రేక్ లు అధికంగా ఉంటే, కేఫైన్ మీలోకి అధికంగా చేరినట్లే. ఫలితంగా మీ నిద్ర చెడుతుంది. లేట్ గా లేస్తే, మరల ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తారున. మరి మీరు మంచి కాఫీ ఇష్టంగా తాగినపుడల్లా ప్రతి కప్పుకు 100 కేలరీల చొప్పున జమ చేసుకుంటారు.
4. లంచ్ లేట్ - ప్రతి భోజనానికి సమయం ఉండాలి. కాని ఆఫీస్ పనిలో పడి మన తిండి అలవాట్లు మార్పు చేసుకుంటాం. ప్రధాన మీటింగ్ అంటూ వాటిని లంచ్ టైం లో కూడా కొనసాగిస్తాం. ఇక తర్వాతి రోనజంతా మీకు భారంగా, పొట్ట గ్యాస్ తో నిండి ఉంటుంది. పైగా, సరైన సమయానికి తినకపోతే, శరీరం తాను ఉపవాసం ఉన్నట్లే భావిస్తుంది. అంటే మీ శరీర జీవక్రియ నెమ్మదిస్తుంది. ఇది కూడా బరువు పెరిగేటందుకు దోహదం చేస్తుంది.
5. బయట తినటం - చాలామంది సాధారణంగా ఇంటినుండి ఆఫీస్ కు లంచ్ తీసుకెళ్ళటం చిన్న పిల్లలు చేసే పని అనుకుంటారు. ప్రధానంగా కొత్తగా ఆఫీసుల్లో చేరేవారు ఇలా భావిస్తూనే ఉంటారు.మరి రెగ్యులర్ గా బయట తింటూ ఉంటే అది అనారోగ్య అలవాటే. బయట తినే ఆహారం అనారోగ్యం అంతే కాక కేలరీలు అధికంగా ఉంటాయి. ఈ ఆహారం ప్రతిరోజూ తింటే, బరువు గ్యారంటీగా పెరుగుతుంది.
మీరు బరువెక్కుతున్నారనేందుకు ఆఫీసులలో సాధారణంగా ఇ కారణాలు ఉంటాయి. మరి మీకు తెలిసిన మరిన్ని కారణాలు మాకు తప్పక వ్రాయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications