Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోగులు త్వరగా కోలుకోవాలంటే?
పచ్చటి గడ్డిపై రోజూ నడిస్తే?గతంలో మీరు పచ్చటి లాన్ పై ఎపుడు నడిచారు? ఎల్లపుడూ వ్యాయామాలు చేయడం లేదా ఆరోగ్యకర ఆహారం తీసుకుంటూ ఉండటం మాత్రమేకాదు.

కంటిచూపును మెరుగు పరుస్తుంది - చెప్పలు లేకుండా పచ్చటి గడ్డిపై నడిస్తే, అది మీ శరీరంలోని కండరాలను బలపరుస్తుంది. మీ కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజులో ఉదయంవేళ గడ్డిపై నడిస్తే మనకు ఎంతో తాజా అనుభూతులు కలుగుతాయి. చెప్పులు మనలోని ఎనర్జీని లాగేస్తాయి. సాయంత్రం అయ్యే సరికి అలసిపోతూంటాము. కాళ్ళకు చెప్పులు లేకుండా నడవటం శరీరంలో ఎనర్జీని కలిగిస్తుంది. కనుక మీ షూస్ లేదా చెప్పుల వంటివి తీసేయండి, పచ్చటి లాన్ పై కొంతసేపు నడక సాగించండి.
బి.పి. డిప్రెషన్ దూరం - నడక మీకు శారీరకంగానే కాదు మానసికంగా కూడా మంచి వ్యాయామాన్ని ఇస్తుంది అంటారు రీసెర్చర్లు. అడవులలో లేదా గార్డెన్లలో కొంతసేపు ప్రతిరోజూ నడిచేవారికి మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని స్టడీలు చెపుతున్నాయి. మీ బిజీ లైఫ్ వేగాన్ని తగ్గించి మీలోని ఒత్తిడి ఆందోళనలను అది అరికడుతుంది. బి.పి. ఇతర వ్యాధులు ఎలా తగ్గుతాయి? మొక్కలు తమను తాము చెడు బాక్టీరియా, ఫంగస్, పురుగులు నుండి రక్షించుకోటానికిగాను ఫైటోన్ సైడ్స్ అనే పదార్ధాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనం మనుషులు పీల్చుకుంటే ఎంతో మేలు చేస్తుంది. వారిలో ఒత్తిడి తగ్గిస్తుంది, గుండె కొట్టుకునే తీరు నిదానిస్తుంది. ప్రతిరోజూ లాన్ పై నడిస్తే అది మీకు అలసటను పోగొట్టి చక్కని ఆరోగ్యం చేకూరుస్తుంది. మీ శరీరంలో అధిక కొవ్వును కరిగిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది - పచ్చటి గడ్డిపై నడిస్తే అది ఒత్తిడి కారణంగా మీలో నష్టపోయిన రోగనిరోధక వ్యవస్ధను బలపరుస్తుంది. సహజంగా శరీరంలో చంపేసే కణాలను అరికడుతుంది. రోగులు పచ్చటి ప్రదేశాలలో త్వరగా కోలుకోవడం చూస్తూనే ఉంటాము. అందుకనే వైద్యులు సర్జరీ వంటి చికిత్సలు చేసిన తర్వాత రోగులకు పచ్చటి ప్రదేశాలలో నడక సూచిస్తారు. నడక అనేది ఒక అద్భుత వ్యాయామంగా భావించాలి. దాని ప్రయోజనాలు లెక్కపెట్టలేనివిగా ఉంటాయి. కనుక ప్రతిరోజూ కొద్ది సేపు తప్పక పార్కులలో, గార్డెన్లలో, పచ్చటి లాన్ లలో నడిచి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications