Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
నీరు అధికంగా తాగేందుకు మార్గాలు!

రోజులో అధికంగా నీరు తాగాలంటే కొన్ని అంశాలు గర్తుపెట్టుకొని తప్పక పాటించాలి. అవేమిటో పరిశీలించండి.
అధికంగా నీరు తాగేటందుకు కొన్ని మార్గాలు!
1. శరీరానికి ఎంత నీరు కావాలి? అది ముందు తెలుసుకోండి. అది తెలుసుకుంటే ఎంత తక్కువతాగుతున్నామనేది గ్రహించవచ్చు. సాధారణంగా 8 ఔన్సు గ్లాసుల నీరు తాగాలి అంటే 2 లీటర్లుగా భావించండి. కాని అది శారీరక శ్రమచేయనివారికి. వేడి ప్రదేశంలో వుండే వారు కనీసం ప్రతిరోజూ 3 లీటర్లయినా తాగాలి.
2. మీరు ఎంత నీరు తాగుతున్నారు? ఇపుడు రోజుకు ఎంత నీరు తాగుతున్నారనేది లెక్కవేయండి. అవసరమనుకుంటే ఒక కొలత గ్లాసు కూడా పెట్టుకోండి.
3. నీరు బాటిళ్ళతో తాగవద్దు. గ్లాసులతో తాగండి. దాహం వేస్తే సాధారణంగా బాటిల్ ఎత్తి తాగటమే మనం చేస్తాం. రెండు గుటకలు వేసి ఆపేస్తాం. కాని గ్లాసుతో తీసుకుంటే అందులోది అంతా తాగేస్తాం. లెక్క తెలుస్తుంది. తగినంతనీరు లోపలికి పోతుంది.
4. చల్లని నీరు తాగవద్దు. సాధారణంగా అందరూ చల్లని నీటికోసం చూస్తారు. ప్రత్యేకించి వేసవిలో. కాని చల్లని నీరు మీ దాహాన్ని త్వరగా తీర్చి మరల తాగకుండా చేస్తుంది. నీరు అధికంగా తాగాలంటే, గది ఉష్ణోగ్రత వద్ద తాగాలి.
5. పనులు చేసుకునే వారు పని ప్రదేశంలో కూడా తాగాలి. పనిలో చాలా సమయం గడుపుతాము. సరిగ్గా అపుడే శరీరం కూడా నీరు కోరుతూంటుంది. బిజీగా వుండి మరచిపోతాము కూడాను. కనుక పని చేసే చోట ఒక బాటిల్ లేదా గ్లాసు నీరు తప్పక వుంచండి. ఆ రోజుకు పెట్టుకున్న మొత్తం నీరు తాగేయాలని లక్ష్యంగా పెట్టండి.
6. అనేక మార్లుగా నీరు తాగండి. మీరు తాగాల్సిన రెండు లేదా మూడు లీటర్లనీరు ఒకేసారి తాగవద్దు. అపుడే నీటి ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. దానిని చిన్న భాగాలుగా విడకొట్టండి. నీరు రోజంతా తాగుతూ, శరీరం తేమను కలిగి వుండేట్లు చూడండి.
7. అధిక నీరు తాగటానికి కుదరకపోతే నీటికి బదులుగా ప్రత్యామ్నాయంగా కొబ్బరి నీరు లేదా పండ్ల రసాలు తాగటం మంచిదే. అవి శరీరానికి అవసరమైన ద్రవాలు చేకూరుస్తాయి. అయినప్పటికి నీటి విలువ దానిదే. మీరు ఏది తాగినప్పటికి అవి ప్రత్యామ్నాయ పానీయాలుగానే పరిగణించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications