Latest Updates
-
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు
వెల్ నెస్ ఇండియా ఎక్స్ పో 2012

ఈ ప్రదర్శన పేరొందిన తయారీదారులు, దిగుమతుల కంపెనీలు, అనేకమంది నిపుణులు, ప్రభుత్వ అధికార్లు, టోకు, చిల్లర, వ్యాపారులు, పంపిణీదార్లు, అధీకృత డీలర్లు అందరిని ఒక చోటకు చేరుస్తోంది. దక్షిణ భారతదేశంలోని విభిన్న ప్రజలను వివిధ మార్కెట్లను సుమారు 200 ప్రపంచ శ్రేణి బ్రాండ్లతో సమగ్ర ఉత్పత్తుల, పరికరాల, సేవల పరిధితో సుమారు 80,000 మంది సందర్శకుల కొరకుగాను భారీ ప్రదర్శన ఏర్పాటుకానుంది. వివిధ ఆరోగ్య, సంక్షేమ ఉత్పాదనల కంపెనీలు తరలి వచ్చి సుమారు 80,000 మందికి పైగా సందర్శకులతో తమ వ్యాపారం , ఆరోగ్యం, ఫిట్ నెస్, బ్యూటీ, పోషకాహార, జీవన శైలి రంగాలలోని ఉత్పత్తులను ఒకే చోట ప్రదర్శించే అవకాశం ఈ ప్రదర్శన కలిగిస్తోంది.
ఈ ప్రదర్శన దేశంలోనే అతిపెద్దదిగా పరిగణించవచ్చు. వ్యాపారస్తులకు, మార్కెటింగ్ కంపెనీలకు తమ ఉత్పత్తులు ప్రదర్శించటానికి, అమ్మకానికి, వినియోగదారుల అవసరాలను పరిశీలించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి ఒక మంచి అవకాశం. పరిశ్రమలోని, ఆధునిక ఉత్పత్తులు, సేవలను వెల్ నెస్ ఇండియా ఎక్స్ పో 2012 ద్వారా వివిధ రంగాల నిపుణులకు, సామాన్య ప్రజానీకానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా బెంగుళూరు నగరంలోని పౌరుల ఆరోగ్య సంక్షేమాలకు ప్రదర్శకులు' 3 మైళ్ళ పరుగు " నిర్వహిస్తున్నారు. ఫిట్ నెస్ అభిలాషులు షుమారు 10,000 మంది బెంగుళూరు వాసులు, కంపెనీ సిబ్బంది, మేధావులు, పేరొందిన క్రీడాకారులు, సినీ నటులు, మొదలగు వారు ఈ పరుగులో పాల్గొంటారని అంచనా వేశారు. అంతేకాక ఆరోగ్య సాధకులైన సాధారణ ప్రజానీకం మరో 500,000మంది కూడా పాల్గోనే అవకాశం కలదు.
అదనంగా, నిర్వాహకులు కొన్ని వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తున్నారు. వాటిలో ' మీలోని మహిళ" అనేది మహిళల ఆరోగ్యం, అందాలకు సంబంధించినది. దీనిలో అంతర్జాతీయ స్ధాయి, చర్మ, కేశ, మేకప్, ఫిట్ నెస్, పోషకాహార నిపుణుల సలహాలు సంప్రదింపులుంటాయి. ప్రశ్నలు, సమాధానాల అంశం కూడా వుంటుంది. అదనపు సమాచారం కొరకు వెబ్ సైట్ www.wellnessindiaexpo.com.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications