Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మీరు పొగతాగటం ఆపేస్తే ఏం జరుగుతుంది?
పొగతాగటం అనేది ప్రతి అయిదుగురిలోను నలుగురికి వుండే అతి సాధారణమైన చెడు అలవాటు. పొగతాగటమనే ఈ చెడు అలవాటు పురుషులకే పరిమితం కాలేదు. ఈ అలవాటు మహిళలలో సైతం పాకిపోయింది. ఫ్యాషన్ ట్రెండ్ అంటూ మహిళలు కూడా పొగ తాగుతున్నారు. పొగతాగటం వలన వచ్చే చెడు ఫలితాల గురించి బహుశ మీరు అనేకసార్లు వినటం లేదా పుస్తకాలవంటి వాటిల్లో చదవటం చేస్తూనే వుంటారు. అయితే, మీ శరీరం ఒక సారి మీ శరీరం ఈ పొగతాగుడుకు చెడుగా స్పందించేటప్పటికి మీరు ఇక ఈ అలవాటును వదిలేయాలని చూస్తారు. పొగతాగే అలవాటు మానుకోవడం చాలా కష్టం, బాధాకరం కూడాను. కాని గట్టి నిర్ణయం తీసుకొని దానిని అమలుచేస్తే, దానికి మీరు నిలబడాలి. పొగతాగటం నిలిపివేస్తే, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు వెంటనే మొదలవుతాయి. అవేమిటో పరిశీలించండి.

మీ అధిక రక్తపోటు సాధారణ స్ధాయికి వస్తుంది. పొగతాగే వారికి అధిక రక్తపోటు ఉంటుంది. ఎపుడైతే నికోటిన్ తీసుకోవటం వదిలేస్తారో మీ రక్తపోటు స్ధాయి సాధారణ స్ధితికి వచ్చేస్తుంది.
మీరు పొగతాగటం వదిలేయగానే శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఒక వారం పొగతాగకుండా ఉంటే రక్తంలో హాని కలిగించే కార్బన్ మొనాక్సైడ్ తగ్గుతుంది. ఆక్సిజన్ స్ధాయి పెరుగుతుంది. పొగతాగితే, శరీరంలో మలినాలు ఏర్పడతాయి అవి చర్మాన్ని చెడుగా ప్రభావిస్తాయి. బ్లడ్ సర్కులేషన్ అధికమైతే మీ శరీరం మలినాలనను విసర్జించి మీ చర్మం మరోమారు కాంతి పొందేలా చేస్తుంది.
రెండు లేదా మూడు రోజులు పొగతాగకుంటే, మీ శరీరంలో నికోటిన్ స్ధాయి తగ్గి బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది. శరీర జీవక్రియ పెరిగి, ఎనర్జీ స్ధాయి పెరుగుతుంది. మీరు మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. పొగతాగకపోవడం ఆరోగ్య కరమే, కాని దానిని నిలిపివేసే సమయంలో మీకు కొన్ని చెడు అనుభవాలు కూడా ఎదురవ్వచ్చు. పొగ తాగాలనే కోరిక బాగా పెరిగి మీరు తాగకుంటే, తలనొప్పి కలుగవచ్చు. మీరు పొగ తాగినపుడు నికోటిన్ మీ బ్రెయిన్ కు చేరి మైండ్ రిలాక్స్ అవుతుంది. బద్ధకం, అలసట కూడా కలుగుతాయి. పొగతాగినపుడు మీ గుండె కొట్టుకోవడం అధికమవుతుంది. కాని తాగటం మానిన వెంటనే, గుండె కొట్టుకునే రేటు తగ్గి మీరు కొంత అలసట భావిస్తారు.
పొగ తాగటం మానిన వెంటనే, మీకు జీర్ణక్రియ సమస్యలు కూడా వుంటాయి. మలబద్ధకం, లేదా డయోరియా, వికారం, గ్యాస్ సమస్యలు సాధారణంగా ఉంటాయి. గొంతు దురదపపెడుతుంది. దగ్గు, జలుబు వంటివి కూడా వెంటనే రావచ్చు. స్వరధ్వని మారవచ్చు. నిద్ర తగ్గటం లేదా నిద్రలో పీడకలలు రావడం జరుగుతుంది. మీ మానసిక స్ధితి అస్ధిరంగా ఉంటుంది. నిద్ర సరిగా పట్టకపోవటం వలన ప్రశాంతత ఉండదు.
ఇవి పొగ తాగటం వలన, మరియు మానటం వలన వచ్చే శారీరక మార్పులు. అయినప్పటికి, మీరు గట్టి నిర్ణయం తీసుకొని దానిని మానివేస్తే, మీ జీవితాన్ని కాపాడుకున్నవారవుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications