మీ బ్లడ్ గ్రూప్ మీ గురించి ఏమి తెలియజేస్తుంది?

By B N Sharma

What Your Blood Group Says About You?
తరచుగా మనం వ్యక్తులను వారి రాసి గుర్తుల ఆధారంగా వర్గీకరణ చేస్తాం. అయితే, వారిని బ్లడ్ గ్రూప్ ఆధారంగా వర్గీకరణ చేస్తే మరింత సైంటిఫిక్ గా వుంటుంది. ఈ మేరకు జపాన్ దేశస్ధులు కొంత రీసెర్చి కూడా చేశారు. ఫలితాలు గణనీయంగా వున్నాయి. బ్లడ్ గ్రూప్ తెలిస్తే చాలు, ఆ వ్యక్తికి గల వ్యక్తిగత చరిత్ర చేప్పేయవచ్చు. వెలువడిన పరిశోధనా ఫలితాలు అందరికి సరిపోకపోయినప్పటికి కొంతమందికి ఖచ్చితంగా సరిపోతున్నాయి. మరి దిగువ ఇచ్చిన బ్లడ్ గ్రూప్ ఫలితాలు మీ మీ అనుభవాలకు సరిపడతాయేమో పరిశీలించుకోండి.

బ్లడ్ గ్రూప్ బట్టి మీ గుణగణాలు ఎలా వుంటాయి?
1. బ్లడ్ టైప్ - ఎ .....ఈ గ్రూప్ లో జపానీయులు బాగా తీవ్రంగా పరిశోధన చేశారు. కారణం...జపనీయులు తమ జనాభాలో 70 శాతం ఎ గ్రూప్ కు చెందిన వారే. కనుక, మీ బ్లడ్ గ్రూప్ కనుక ఎ అయినట్లయితే, మీరు ఎలాంటివారో చూడండి. మీ రోగ నిరోధకత తక్కువ. రీసెర్చి కూడా ఇదే సూచిస్తోంది. ఈ గ్రూప్ రక్తం కలవారు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. వీరు జంతు సంబంధిత ప్రొటీన్లు అంటే మాంసం వంటివి అధికంగా తీసుకోరాదు. దీనికి కారణం వీరిలో మాంసాన్ని జీర్ణం చేయగల ఎంజైములు తక్కువగా వుంటాయి. వీరు ఒత్తిడిలో సరిగా వ్యవహరించలేరు. కనుక ఒత్తిడి పరిస్ధితులకు దూరంగా వుండాలి. ఈ గ్రూప్ బ్లడ్ కలవారు ప్రతిది ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తారు. ప్రతి చిన్న వివరం తెలుసుకోవాలనుకుంటారు. కనుక మంచి రీసెర్చర్లు కాగలరు.

2. బ్లడ్ గ్రూప్ బి - ఈ గ్రూప్ బ్లడ్ కలవారు ఎపుడూ సందిగ్ధంగా వుండే స్వభావం. ఎ గ్రూప్ తో పోలిస్తే వీరికి రోగ నిరోధకత ఎక్కువ. కాని వైరల్ వ్యాధులు అధికం. ఎ గ్రూప్ వారి కంటే కూడా ఒత్తిడి బాగా డీల్ చేస్తారు. కాని ఎపుడూ కూల్ గా వుండరు. ఈ గ్రూప్ రక్తం కలవారు త్వరగా డయాబెటీస్ పొందుతారు. అంతేకాదు, షుగర్ స్ధాయిలు వీరిలో అధికం. వీరు స్వీట్లు, ఐస్ క్రీమ్ ల వంటివాటికి దూరంగా వుండాలి.

3. బ్లడ్ గ్రూప్ ఓ - వీరు సర్దుకుపోయే రకం. కాని జనాలకు దూరంగా వుండాలని కోరతారు. ఈ రకం వ్యక్తుల బ్లడ్ ఎవరికైనా సరే సరిపోతుంది. అదేవిధంగా వీరి స్వభావం కూడా ఎవరితోనైనా సరే కలిసిపోయేలా వుంటుంది. అందరితోనూ కలసి పోతారు.ఓ గ్రూప్ రక్తం కలవారు చాలా కూల్ గా వుండి ఒత్తిడి కలిగితే చాలు వారి శక్తి సామర్ధ్యాలు చూపుతారు. రోగనిరోధకత ఎక్కువ. శారీరకంగా బలంగా వుంటారు. వీరికి మానసిక స్ధిరత్వం కూడా అధికమే. అయితే, చురుకుగా వుంటే తప్ప వీరు తమ రక్త ఫలితాలను అనుభవించలేరు. వారి రక్తంలోని బద్ధకాన్ని వదిలించుకోవాలంటే వీరు ప్రతిరోజూ వ్యాయామాలు చేయాల్సిందే.

4. బ్లడ్ టైప్ ఎబి - ఈ గ్రూప్ రక్తం కలవారు ఎంతో ఆహ్లాదంగా వారుండటమే కాక, ఇతరులను కూడా సంతోషింపజేస్తారు. చాలా చురుకు, అధికపాలు ఉత్సాహం. ఎప్పటికపుడు స్నేహితులను తయారు చేసుకుంటారు. కొత్తవారితో తేలికగా జత కట్టేస్తారు. ఈ బ్లడ్ గ్రూప్ అరుదు అనే చెప్పాలి. ఎవరితోనైనా సరే సర్దుకుపోతారు. తేలికగా వీరికి రక్తం దొరకుతుంది. వీరి స్వభావం ఏ మాత్రం క్లిష్టంగా వుండదు. సంతోషాతిశయాలతో అదృష్టవంతులుగా కొనసాగుతూంటారు. వీరి స్వభావంలో ఎ లేదా బి గ్రూప్ లక్షణాలుంటాయి. ఉదాహరణగా చెప్పాలంటే, ఎ లేదా బి గ్రూప్ రక్త వ్యక్తులకు వర్తించే ఆహార నియమాలు వీరికి బాగా వుంటాయి. రోగ నిరోధకతలో అధికభాగం బి గ్రూప్ వారి వలే వుండి బలంగా వుంటారు. అయితే, ఎ గ్రూప్ రక్తం వారివలే ఒత్తిడిలో తమ శక్తి సామర్ధ్యాలను చాటుకోలేరు.

ఈ వ్యక్తిగత గుణాలు వారి ఆరోగ్య పరిస్ధితిపై ఆసక్తిగా పరిశోధించబడి తెలియజేయబడ్డాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, April 17, 2012, 12:30 [IST]
Desktop Bottom Promotion