Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గ్యాస్ సమస్యా? జంక్ ఫుడ్ కు బై....చెప్పండి!

జంక్ ఫుడ్ వలన వచ్చే సమస్యలు!
గుండె మంట - బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో గుండె మంట ఒకటి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. దీనినే గుండెమంట అంటారు. గుండె మంట తరచుగా వస్తూంటే, సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు ఆహారాలు తగ్గించి, ఉడికించిన ఆహారం తినండి.
గ్యాస్ సమస్యలు - పొట్ట లైనింగ్ లో మంట వస్తే గ్యాస్ సమస్యలు వస్తాయి. దీని లక్షణాలు అజీర్ణం, వాంతులు, వికారం, బరువు తగ్గటం, కడుపు ఉబ్బరించటం, ఆకలి లేకపోవుట, త్రేన్పులు గా వుంటాయి. అధిక వేపుడు ఆహారం తింటే పొట్ట గ్యాస్ ఏర్పడి త్వరగా నిండిపోయిందనుకుంటాం. కనుక వేపుడులు లేదా జంక్ ఫుడ్ బాగా తగ్గించండి.
కడుపులో పుండ్లు - పొట్ట లోపలి భాగంలో లేదా పెద్ద పేగు పైన పుండ్లు వస్తాయి. వీటిని పెప్టిక్ అల్సర్ అంటారు. పైలోరి అనే బాక్టీరియా ఈ సమస్య కలిగిస్తుంది. దీనికి కారణం వేపుడు ఆహారాలు పొట్టలో ఎసిడిటీ, పుండ్లు కలిగించడమే. కనుక జంక్ ఫుడ్ మాని పొట్ట సమస్యలు తగ్గించుకోండి. వేపుడులు తింటే పొట్ట యాసిడ్లు కూడా పెరుగుతాయి. ఇవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది.
అజీర్ణం - పొట్టలో అసౌకర్యం మొదలై అది అజీర్ణానికి దోవతీస్తుంది. ఇది తీవ్ర సమస్య కానప్పటికి సాధారణ సమస్య. ఇది ఫ్యాటీ ఫుడ్ అంటే యాసిడ్ కలిగి పొట్టకు బరువుగా వుంటుంది. ఈ పొట్ట సమస్య ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా మెల్లగా తింటూ తగ్గించుకోవచ్చు. మీ ఆహారం మీరు బాగా నమిలితే, అది తేలికగా జీర్ణం అవుతుంది మీ పొట్ట సమస్యలు తగ్గిస్తుంది.
జంక్ ఫుడ్ బదులుగా వండిన ఆహారాలు - జంక్ ఫుడ్ అధికమైతే గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకుగాను బాగా వేయించిన ఆహారాలు వదలండి. బదులుగా వండిన లేదా ఉడికించిన పదార్ధాలు తినండి. నొప్పి కొనసాగితే, డాక్టర్ ను సంప్రదించి రోగ నిర్ధారణ చేయించుకొని చక్కని ఆహార ప్రణాళిక రూపొందించండి.
మీరు ఏ రకం ఆహారాలు తినాలి? శాకాహారాలైన, తోటకూర, బచ్చలికూర, బ్రక్కోలి, బీన్స్, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెరుగు వంటివి అధికంగా తినాలి.
వివరించిన ఈ సమస్యలు గ్యాస్, అధిక యాసిడ్ల ఉత్పత్తి తగ్గించే వేపుడు ఆహారాలు ఎందుకు తినరాదో తెలుపుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications