Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ బ్రెయిన్ కూ వ్యాయామం కావాలి?

మీ మెదడుకు 5 ప్రధాన వ్యాయామాలు
1. మెమొరీ గేమ్ - చాలామంది వ్యక్తులు పెద్ద వయసు వచ్చిందంటే అల్జీమర్స్ అంటే మతి మరపు వ్యాధితో బాధపడుతూంటారు. వయసుతోపాటు మెమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తూండాలి. మీ స్కూలు తోటి విద్యార్ధుల పేర్లను మరోమారు జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా వున్నపుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నపుడు, కాఫీ బ్రేక్ లలో చేయవచ్చు.
2. విచక్షణ - మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్ కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియకుండానే విచక్షణ చూపుతాం. కనుక ప్రతిపని మీరు కొంత లాజిక్ తో చేయండి. అందుకుగాను, కొంత రాజకీయాలవంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. నిర్ణయాలకు రావాలి. అపుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.
3. శ్రధ్ధ పెట్టటం - గతంలో మీరు మీ స్కూల్ టీచర్ కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూపలేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా వుంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికిగాను కొంచెం బాధాకర వ్యాయామం చేయాలి. వట వట వాగే ఆఫీస్ కొలీగ్ ను ఎంచుకోండి. అతను ఏ చెత్త విషయాలు మాట్లాడినా శ్రద్ధగా వినండి. అది మీ లోని శ్రద్ధను మెరుగుపరుస్తుంది.
4. పజిల్స్ చేయటం - ఈ పని పిల్లలదనుకుంటాం. కాని పిక్చర్ పజిల్స్, సూడోకు వంటివి మెదడుకు మంచి వ్యాయామం. లేదంటే, బజారులో తిరిగేటపుడు దుకాణాల బోర్డులు చదవండి వాటిని మరల అదే వరుసలో గుర్తుచేసుకోండి.
5. భాషా పర నైపుణ్యం - మెదడు వ్యాయామాలలో బ్రెయిన్ కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటివరకు మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గదర్శకంగా అది బాగా వచ్చిన వారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగవుతుంది. బ్రెయిన్ కు మంచి వ్యాయామంగా వుంటుంది.
ఈ మెదడు వ్యాయామాలు మిమ్మల్ని రోజువారీ జీవితంలో ఎంతో చురుకుగా వుండేలా చేస్తాయి. కనుక నేటినుండే మీ మెదడుకు పని కల్పించండి. తెలివైన వారుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications