టాప్ టెన్ వ్యాధులను నివారించడానికి ఉపయోగపడే యోగాసనాలు...!

యోగా వల్ల చాలా వరకూ ఆనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగాసనాలు వేయడం వల్ల ఎటువంటి అనారోగ్యం లేకండా సంతోషంగా జీవించగలుగుతారు. మరియు మీరు ఏదైన ప్రత్యేకంగా ఒక వ్యాధితో బాధపడుతున్నప్పుడు లేదా ఇబ్బంది పడుతున్నప్పుడు సహజ పద్దతిలో నివారణ పొందడానికి యోగా బాగా సహాయపడుతుంది. అంతే కాదు వయస్సును బట్టి యోగా మీద సామూహిక జ్ఞానం కలిగి ఉండి, ఆధునిక మందులు ఉపయోగించకుండానే కొన్ని రకాల వ్యాధులను నయం చేసే గుణంను కలిగి ఉంటుంది.

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉబ్బసం మరియు కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులను నయం చేయవచ్చు. యోగ వల్ల డయాబెటిస్ నయం కాదు. అయితే మధుమేహగ్రస్తులో ఇన్సిలిన్ (రక్తంలోని చక్కర స్థాయిలను)నియంత్రించడానికి సహాయం చేస్తాయి. అలాగే కొన్ని రకాల యోగాసనాల వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ మరియు అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు. తరచూ తలనొప్పికి గురిఅవుతుంటే అది మైగ్రేయిన్ లక్షణాలు కలిగి ఉన్నట్లైతే యోగాసనాల చేయడం వల్ల నయం చేసుకోవచ్చు.

కాబట్టి యోగాసనాలు చేయడం అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు నయం చేయవచ్చు. అందుకోసం ప్రతి రోజూ మాత్రలకోసమని మెడికల్ షాపుల చుట్టూ తిరగక్కరలేదు. ఈ నేచురల్ పద్దతులను ఉపయోగించి కొన్ని వ్యాధులను నివారించుకోవచ్చు. మరి కొన్ని తీవ్రమైన అనారోగ్యాలు తగ్గించుకోవడానికి మీకు ఉపయోగపడే కొన్నియోగాసనాలు చూడండి...

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

ఆస్తమా: ఆస్తమా నివారణకోసం యోగ బాగా సహాయపడుుతంది. ఆస్తమా అన్ని వయస్సుల వారిలో వస్తుంది. ఊపరి ఆడకుండా, ఉండి శ్వాస తీయుట కష్టంగా మారడాన్ని ఆస్తమా అంటారు. దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం వల్ల నేడు అధిక శాతం మంది ఆస్తమాబారిన పడుతున్నారు. ఈ సమస్యను తక్షణ ఉపశమనం పొందడానికి ఇన్ హెలర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే దీర్ఘకాలకి చికిత్స కోసం మీరు ప్రాణాయం మరియు అనులోమ్ -వులోమ్ అనే యోగాసనాలను ప్రాక్టీస్ చేయడం వల్ల దీర్ఘకాలిక ఉపశమనం పొందవచ్చు.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

డయాబెటిస్: ప్రపంచంలో నిరించలేని వ్యాధులలో ప్రధానమైనది మధుమేహం. ఒక్క సారి షుగర్ వ్యాధి వచ్చిందంటే(రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని) దాన్ని తగ్గించుకోవడానికి సాధ్యం కాదు, అయితే త్రిభుజం భంగిమ వంటి కొన్ని యోగాసనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించటానికి బాగా సహాయపడుతుంది.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

హైపర్ టెన్షన్: హైబ్లడ్ ప్రెజర్ వల్ల అలసట, ఆందోళన, ఒత్తిడి, తీవ్ర ఒత్తిడి (హైపర్‌ టెన్షన్‌), ప్రతి దానికి ఒత్తిడికి గురవటం..... మాటలేమో ఎదుటివారితో, ఆలోచనేమో మరెక్కడో, ప్రతిదానికి విసుగు, కోపం.. వీటితో లెక్కకు మించిన అనారోగ్యాలు.. అలాంటి టెన్షన్‌‌సను తగ్గించుకుని శరీరాన్ని, మనసును ఓ దగ్గర ఉంచుకోలేకపోవటం, మనసు మీద పట్టులేకపోవటం. ఇలాంటి వాటిని అధిగమించడానికి మెడిటేషన్ వంటి ఆసనం లేదా ప్రాణాయం చేయడం ఉత్తమం.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

అజీర్ణం: యోగ సాధన జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. పద్మాసనం లేదా వజ్రాసనం వంటివి వేసి ప్రాణాయామం చేస్తే, మీ జీర్ణ వ్యవస్ధకు ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

మైగ్రెయిన్ తలనొప్పి: తరచుగా తలనొప్పి వచ్చే వారు జేబులో మాత్రలు పెట్టుకొని తిరిగే అవసరం లేకుండా చేస్తుంది యోగ. ఉద్రేకంతో వచ్చే తలనొప్పు లు, మైగ్రేన్ల బారి నుంచి కూడా బయటపడవ చ్చు. ఎందుకంటే ప్రాణాయామం, సిరసాసనం వంటి యోగాసనాలు మన మెదడుకు రక్తం, ప్రాణవాయువు సరిగా సరఫరా అయ్యేందుకు దోహదం చేసే తలనొప్పి ప్రారంభం కాకుండానే నివారిస్తుంది.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

లోయర్ బ్యాక్ పెయిన్: మన వయసు పెరుగుతున్న కొలది వెన్నెముకలో ఫ్లెక్సిబిలిటీ తగ్గుతూ వస్తుంది. దీనివలన మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. యోగా సాధన వలన మాత్రమే వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఏజింగ్ ప్రాసెస్ స్లో చేయబడుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ వల్ల క్రోనిక్ వ్యాదులు మొదలవుతాయి వీటికి సర్జరీల వరకూ దారితీస్తుంది.అందుకు తదాసనా లేదా ట్రీ ఫోజ్ యోగా చేస్తే నివారించవచ్చు.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

కీళ్ళ నొప్పులు: ఆర్థరైటిస్ కు కారణం శరీరంలో ని జాయింట్ పెయిన్స్ మరియు వాటిని నివారించుకోలేనటువంటి వ్యాధులు. ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ళ నొప్పులను నివారించడానికి సూర్యనమస్కారం ప్రయత్నించండి.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

లివర్ సమస్యలు: లివర్ సమస్యలు ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ కు దారితీస్తుంది. మీ కాలేయం ఆరోగ్యవంతంగా ఉంచడానికి కొన్ని ప్రాధమిక యోగాసనాలు చేయడం వల్ల ఉదర బాగంలో రక్త ప్రసరణ పెంచుతుంది. అందుకు బ్రిడ్జ్ భంగిమ మరియు క్యాట్ భంగిమ మంచి ఉదాహరణలు.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

డిప్రెషన్: యోగ ఎవరి మానసిక ఆరోగ్యానికైనా మేలే చేస్తుంది. ఎందుకంటే యోగ వ్యక్తి విశ్రాంత స్థితికి వచ్చేందుకు తోడ్పడుతుంది. ఇది ఒక రకమైన మానసిక చికిత్సగా చెప్పవచ్చు. నిరంతర యోగ సాధన ఆందోళన, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం, మానసిక ఉద్వేగాలను నియంత్రితం చేసి, రోజంతా ఏకాగ్రతతో ఉండేందుకు సాయపడుతుంది. తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్‌, మూడ్‌ స్వింగ్స్‌ వంటి వాటిని ఉత్తనాసన యోగ సాధన వల్ల తగ్గించిన దాఖలాలున్నాయి.

టాప్ టెన్ వ్యాధుల నివారణ ఇలా...!

ఫోలిసిస్టిక్ ఓవెరీస్: ప్రస్తుత రోజుల్లో ఫోలిసిస్టిక్ ఓవెరి వంటి వ్యాధులు మహిళల సమస్యలకు చాలా ప్రభావవంతం చేస్తున్నాయి. దాంతో స్త్రీలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఫెర్టిలిటి సమస్యలు ఎదురౌతున్నాయి. వీటిని అధిగమించడానికి శవాసనం వేయడం అండాశయంలో కణతులు, మరియు ఓవెరీ, వంటి వాటికి మందులతో పనిలేకుండా నివారించుకోవచ్చు.

Story first published: Wednesday, March 6, 2013, 13:06 [IST]
Desktop Bottom Promotion