Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషులకు అవసరం అయ్యే 12 జింక్ ఫుడ్స్...!
సాధారణంగా మన శరీరం పెరుగుతున్న వయస్సుతో పాటు దానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యపరంగా జింక్ లోపం అనేది సాధారణ సమస్య. మరీ ముఖ్యంగా వెజిటేరియన్ ఎక్కువగా తీసుకొనే వారికి. మనం రోజూ తీసుకొనే ఆహారంతో జింక్ అందదు. ముఖ్యంగా జింక్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. చుండ్రు దారితీస్తుంది. చర్మ సంబంద వ్యాధులు సోకేలా చేస్తుంది అయితే రీసెంట్ గా జింక్ కు, డయాబెటిస్ కు దగ్గర సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. జింక్ లోపం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నాయి కొన్ని పరిశోధనలు. డయాబెటీస్ అనేది జీవన విధానంలో మార్పుల వల్ల ఏర్పడుతుంది . కాబట్టి జింక్ కంట్రోల్ చేసుకొన్నట్లైతే డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు అంటున్నారు. వైద్య నిపుణులు.
జింక్ శరీరం కోల్పోయిన యాంటీబాడీ కణాలు తిరిగి పునఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, బీన్స్, సీఫుడ్‌లలో జింక్ లభిస్తుంది. ముఖ్యంగా జింక్ ఫుడ్స్ మగవారికి జింక్ ఆవశ్యకత చాలా అవసరం ఎందుకంటే మగవారిలో టెస్టోస్టిరాన్(మేల్ హార్మోన్స్)ను క్రమబద్దం చేయడానికి జింక్ చాలా సహాయకారిగా ఉంటుంది.
జింక్ లోపం ఎక్కువగా వేజిటేరియన్ తీసుకొనే వారిలోనే చూస్తుంటాం. అయితే మాంసాహారంలో జింక్ అత్యధిక శాతంలో ఉంటుంది. రెడ్ మీట్ లో మరీ అదికంగా ఉంటుంది కాబట్టి వెజిటేరియన్ తినేవారిలో జింక్ కొరవడదనుకుంటే కొన్ని రకాల జింక్ ఫుడ్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. జింక్ అధికంగా ఆకుకూరలు, ఫ్లాక్ సీడ్స్, గుమ్మడిలో అధికంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం, జింక్ లోపం అధికంగా ఉంగే శరీరం దుర్వాసనలు వెలువరించవచ్చు. అలాకాకుండా మధుమేహం కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మలబద్దకం వంటివి కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. మెగ్నీషియం, జింక్ ఉన్నపదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. దీనికి తోడు మంచి నీటిని కనీసం ఎనిమిది గ్లాసులు రోజులో తీసుకుంటే చాలా ఈ సమస్య అంతగా వేధించదు. హెల్తీ లైఫ్ స్టైల్ కోరుకొనే వారు డిఫరెంట్ జింక్ ఫుడ్స్ తీసుకుంటుండాలి. ముఖ్యంగా మగవారి డైయట్ లిస్ట్ లో చేర్చుకోవల్సిన జింక్ ఎందులో లభిస్తుందో చూద్దాం...

గుడ్డులోని పచ్చసొన: ముందు డాక్టర్లు గుడ్డులోని పచ్చసొనను తినకూడదనేవారు. ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ శాతం అధికమని. అయితే పచ్చసొనలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా జింక్ ఉంటుంది.

నువ్వులు(సీసమ్ సీడ్స్): చాలా ధాన్యాల్లో జింక్ అధికంగా ఉంటుంది . కానీ నువ్వుల్లో మాత్రం మరింత ఎక్కువ శాతంలో జింక్ లభ్యం అవుతుంది. అంతే కాదు ఇంకా కొన్ని మినిరల్స్, క్యాల్షియం కూడా అధికమే.

ఓస్ట్రెస్: సీఫుడ్ లో అధిక శాతంలో జింక్ లభ్యమవుతుంది. అయితే సీఫుడ్ లో ఒకటైన ఓస్ట్రైయిస్ లో అత్యధిక శాతం జింక్ ఉంటుంది. కాబట్టి కావల్సినన్ని మినిరల్స్ ను ఉత్పత్తి చేస్తుంది.

వేరుశెనక్కాయలు: కొంత మందికి వేరుశెనక్కాయలు పడువు. అయితే ఇందులో మంచి కొలెస్ట్రాల్ తో పాటు జింక్ కంటెంట్ అధికంగా ఉండి ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

బీఫ్ లివర్: మాంసాహారంలో ఏ లివర్ అయినా సరి అధిక శాతంలో జింక్ లభ్యం అవుతుంది. న్యూట్రీషియన్స్, ఐరన్, కూడా పుష్కలంగా దొరుకుతుంది. ముఖ్యంగా బీఫ్ లివర్ లో ఎక్కువగా లభిస్తుంది.

వెల్లుల్లి: ఘాటైన వాసన గల వెల్లల్లిలో సల్ఫర్ తో పాటు జింక్ ఏర్పడ్డానికి తోడ్పడే యాంటీ ఫంగల్ ప్రొపర్టీస్ ఉంటాయి.

రెడ్ మీట్: రెడ్ మీట్, ముఖ్యంగా గెర్రె, బీఫ్ మాంసంలో జింక్ అధికంగా ఉంటుంది. పురుషుల్లో ఎక్స్ ట్రా డోస్ ప్రోటీన్స్ పొందాలంటే రెడ్ మీట్ ను తినాల్సిందే.

పుట్టగొడుగులు: పుట్టగొడుగులను సూపర్ ఫుడ్స్ అంటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా, ఇందులోని చాలా రకాల మినిరల్స్ జింక్ ఏర్పడటానికి సహాయపడుతాయి.

ఫ్లాక్స్ సీడ్స్: జింక్ అధికంగా ఉండే మరో ధాన్యం ఫ్లాక్స్ సీడ్. ప్లాక్స్ సీడ్స్ ను ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ అంధించే వెజ్ సీడ్ అంటుంటారు.

కిడ్నీ బీన్స్: లెగ్యూమ్ జాతికి చెందిన డ్రైయిడ్ బీన్స్ లో హెల్తీ బెనిఫిట్స్ అధికం. ఇందులో ప్రోటీన్స్ మరియు జింక్ అధికంగా ఉంటుంది. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. లేదంటే ఫ్యాట్ గా మారే ప్రమాదం ఉంది.

గుమ్మడి: గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉండటం వల్ల దీన్ని హెల్తీ స్నాక్ గా తీసుకోవచ్చు. ఇది జింక్ ను మాత్రమే అధించడం కాకుండా లోక్యాలరీస్ ను కలిగి ఉంటుంది. కాబట్టి జీరో ఫ్యాట్.

ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమిన్ కె తో పాటు క్యాల్షియం, మరియు ఐరన్ అధికంగా ఉండి శరీరానికి కావల్సినంత జింక్ ను అందిస్తుంది.



Click it and Unblock the Notifications