Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ సెక్స్ డ్రైవ్ పెంచడానికి 8 ముఖ్యమైన నూనెలు
లైంగిక భావనల గురించి తరచుగా కామసూత్రలో చెప్పబడింది. దాని సాహిత్యంలో సుగంధ నూనెలు యొక్క గాఢమైన ఉపయోగం గురించి ప్రస్తావించారు. పురాతనకాలం నుండి ఈ నూనెలను కోరికలు మరియు ఇంద్రియాల భావనలను మేలుకోల్పుతాయని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
సుగంధ నూనెల యొక్క వాసన హార్మోన్లను నియంత్రించే పిట్యుటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. పరోక్షంగా లైంగిక కోరికలు పెరగటానికి దోహదం చేస్తుంది. సుగంధ నూనెల యొక్క ప్రభావం వాటి ఉపయోగం మరియు ప్రయోజనాల గురించి హెరాల్డ్ వాజికరణ తంత్ర(వంధ్యత్వం మరియు విరిలిటి శాస్త్రం)లో చెప్పబడింది. కామోద్దీపన చేయగల లక్షణాలు కలిగిన కొన్ని ముఖ్యమైన నూనెల జాబితాను తెలుసుకుందాము.

రోజ్ ఆయిల్
మీకు ప్రేమ మరియు శృంగార దేవత ఆఫ్రొడైట్ తెలుసా ? ఆమె ప్రేమ డెన్ ను గులాబీ రేకులతో అలంకరించబడి ఉంటుంది. ఈజిప్షియన్ బ్యూటీ క్లియోపాత్రా కూడా గులాబీ రేకులను స్నానానికి ఉపయోగించేది. రోజ్ సుగంధ తైలం ఆందోళన తగ్గించడం ద్వారా ఇంద్రియాల స్వాంతన కలిగించి సెక్స్ కు కనెక్ట్ చేస్తుంది. గుండె చక్రం ద్వారా పనిచేసి ఆధ్యాత్మిక మరియు భౌతికమైన ప్రేమను ఏకం చేయటానికి సహాయపడుతుంది.

జాస్మిన్ ఆయిల్
జాస్మిన్ ను కామవాంఛ నూనె అని పిలుస్తారు. మానవ సెన్సెస్ మీద దాని శక్తివంతమైన ప్రభావం ఉంటుంది. పువ్వు ను సుదీర్ఘ సమ్మోహన కళకు ఉపయోగిస్తున్నారు. ఇది మానసికంగా తాపాన్ని సమృద్ధిగా పెంచుతుంది. ఈ అద్భుతమైన నూనె ఒక సరికొత్త స్థాయికి మీ లైంగిక అవగాహనకు సౌలభ్యాన్ని మరియు నమ్మకాన్ని పెంచుతుంది.

యలంగ్- యలంగ్ ఆయిల్
ఈ సుగంధ తైలం మల్లె మాదిరి లక్షణాలను కలిగి ఉంటుంది. అద్భుతమైన తీపి పూల వాసన కలిగి మీకు ఆనందాన్ని నింపుతుంది. ఈ నూనె ఉత్తేజపరిచేందుకు మరియు భాగస్వాముల మధ్య ఆకర్షణ పెరుగటానికి ఉపయోగపడుతుంది. మీ బెడ్ సమీపంలో ఒక కాటన్ బడ్ లో యలంగ్- యలంగ్ నూనె ఒక డ్రాప్ వేసి ఉంచితే దాని పనితనం మీకు మేజిక్ వలె ఉంటుంది.

జీలకర్ర ఆయిల్
జీలకర్ర నూనె ఇప్పటివరకు దాని కామవాంఛ లక్షణాలకు చాలా ప్రసిద్ది కాదు. కానీ దాని వల్ల మహిళలకు , పురుషులకు ఇద్దరికీ గొప్ప లాభాలున్నాయి. జీలకర్ర నూనె మహిళల్లో సంతానోత్పత్తి మెరుగు పరుస్తుందని చెబుతారు. పురుషుల్లో జీలకర్ర నూనె ఆకర్షణ మరియు తీవ్రమైన భావనలను బయటకు తెస్తుంది. అంతేకాక సున్నితమైన మానసిక స్థితిని ప్రేరేపిస్తుంది.

క్లారి సేజ్ ఆయిల్
క్లారి సేజ్ మిగిలిన నూనెల కన్నా వగరు సువాసనతో చాలా భిన్నంగా ఉంటుంది. క్లారి సేజ్ నూనె ఇంద్రియాలకు రిలాక్సింగ్ మరియు ఉత్సాహభరితమైన అనుభూతిని కలిగిస్తుంది. మీరు గర్భవతి పొందుటకు ప్రయత్నిస్తూ ఉంటే ఈ ముఖ్యమైన నూనెను వాడరాదు.

లవంగం బడ్ నూనె
నిరాశ తొలగించడానికి ఈ నూనె ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా లవంగం బడ్ నూనె ఒక ఉద్దీపన వలె పనిచేస్తుంది. మీకు మరింత ఉద్రేకంతో కూడిన అనుభవాన్ని ఆస్వాదించడానికి సహాయపడుతుంది.

పట్చౌలి ఆయిల్
పట్చౌలి నూనె మసాలా మరియు ముస్కీ వాసన యొక్క ఒక బలమైన సమ్మేళనంగా ఉండి మంచి సువాసనను అందిస్తుంది. ఇది స్త్రీ మరియు పురుషులు ఇద్దరి కొరకు క్లారీ సేజ్,గేరనియం మరియు లావెండర్ వంటి నూనెలతో మిళితం చేయవచ్చు. పట్చౌలి నూనె సహజంగా అద్భుతమైన మీ మానసిక స్థితి,ఒత్తిడి మరియు వ్యాకులం నుండి ఉపశమనం నకు సహాయపడుతుంది.

జాగ్రత్తలు
మీరు అధిక రక్తపోటు లేదా శ్వాసకోశ సమస్యల వంటి వైద్యసంబంధ సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించకుండా ఈ సుగంద నూనెలను ఉపయోగించడానికి వీలు లేదని గమనించండి. అంతే కాకుండా ఈ నూనెలను అంతర్గతంగా తీసుకోకూడదు. వాటిని ఎల్లప్పుడూ వేడికి దూరంగా నిల్వ ఉంచాలి.



Click it and Unblock the Notifications