Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మూత్రంలో మంట...?నివారణ చిట్కాలు.!
ప్రస్తుత కాలంలో అనేక మంది మూత్రంలో మంట సమస్యతో బాధపడుతున్నారు. వేసవికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత పెరిగి కిడ్నిల్లో రాళ్లు మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ (యు.టి.ఐ) ఏర్పడే అవకాశం ఉండటమే.
మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీర ద్రవాల్లోని లవణాల సమతుల్యత కాపాడి శరీరంలోని నీటి పరి మాణాన్ని తగ్గకుండా చూస్తూ జీవకార్య నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని విసర్జిస్తాయి. ఇలాంటి విధులు నిర్వర్తించే కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు మూత్రంలో మంట వస్తుంది.
కారణాలు: చాలా కారణాల ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ముత్రా వయవాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్ యురినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (యు. టి.ఐ), మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, మూత్రకోశంలో ఇన్ ఫెక్షన్, నీరు తగినంతగా తాగకపోవడం, ఆహారపు అలవాట్లు, కొన్ని జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్ల వలన మూత్రంలో మంట వస్తుంది.
లక్షణాలు: మూత్ర విసర్జన మంటతో కూడి ఉండుట. పొత్తి కడుపులో నొప్పి రావడం, మూత్రం ఎక్కువ సార్లు చేయడం. మూత్రం రంగు మారడం, వేడిగా, ఎరుపుగా రావటం. పిల్లల్లో ఈ సమస్యను ఎదుర్కునే వారు మూత్రం పోయాలంటేనే భయపడిపోయి, ఏడుస్తుంటారు. నీరసం, జ్వరం లాంటి లక్షణాలుంటాయి.

జాగ్రత్తలు:
1. మద్యం ఇతర మత్తుపానీయాలు సేవించకూడదు టీ, కాఫీలు మానేయాలి.
2. మాంసాహారం తగ్గించాలి.
3. పొగాకు ఉత్పత్తుల వినియోగం ధూమపానం త్యాజించాలి.
4. ఫాస్ట్‌ఫుడ్స్, మసాలాలు, నూనె పదార్థాలు, ఉప్పు ఎక్కువగా వాడటం వంటివి తగ్గించాలి.
5. వీటిని వీలైతే పూర్తిగా మానుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.
6. సాత్వికాహారం తీసుకోవాలి.
7. తగినంత నీరు తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి.
8. ద్రవపదార్థాలు పండ్లు తాజా కూరగాయాలు ఎక్కువగా తీసుకోవాలి.
చికిత్స: ఇన్ఫెక్షన్లు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని నిర్లక్ష్యం చేయకుండా తగు చికిత్స తీసుకోవాలి. యూరిన్ ఇన్‌కాంటినెన్స్ నివారణకు పెల్విక్ కండరాలు స్ట్రాంగ్ అవడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. వీటిని యూరాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్ చేత తెలుసుకొని వాటిని పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications