Latest Updates
-
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి..
మూత్రపిండాల్లో రాళ్లును నయం చేసి 10 ఉత్తమ మూలికలు
ప్రస్తుత రోజుల్లో కిడ్నీ స్టోన్ (మూత్రపిండాల్లో రాళ్ళు)ఏర్పడటం అనేది చాలా సాధారణ అరోగ్యం సమస్యగా భావిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు సమస్యతో బాధపడుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్ళు కొన్ని రసాయనాల వల్ల ఉత్పన్నం అవుతాయిన నిపుణులు చెబుతున్నారు. ఆ రసాయనాలు అంటే యూరిక్ యాసిడ్, ఫాస్పరస్, క్యాల్షియం, మరియు ఆక్సాలిక్ యాసిడ్ వంటివి యూరిన్ లో కనుగొన్నప్పుడు ఇలా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతాయని కనుగొన్నారు. కిడ్నీ స్టోన్ కు మరో సాధారణ కారణం, అత్యధికంగా విటమిన్ డి, పోషకాల లేమితో బాధపడే వారిలో, డీహైడ్రేషన్, గౌట్ పెయిన్ మరియు సరైన సమయంకు ఆహారం తీసుకోని వారిలో ఈ సమస్య ఏర్పడుతుందని నిపుణుల చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయనడానికి మరో ప్రధాన లక్షణం తరచూ మూత్ర విసర్జన మరియు నొప్పితో కూడిన యూరినేషన్, అలసట, వాంతులు, మరియు అధిక చెమట ఇవన్నీ కూడా మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయని తెలిపే లక్షణాలు.
మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్ళ సైజును బట్టి, కడుపు ఉదరభాగంలో (ఆబ్డామినల్)నొప్పి తీవ్రంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల భరించలేనంత నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, మూలికా చికిత్స చాలా అవసరం.
అలోపతి కాకుండా, నేచురల్ గా లభించే మూలికలతోనే చాలా కేసులు సక్సెస్ ఫుల్ గా చికిత్స అందించగలుగుతున్నారు. సహజ సిద్దంగా లభించే ఈ మూలికలు చాలా సులభంగా మనకు దొరుకుతాయి. వీటిని కిడ్నీ స్టోన్ చికిత్సకోసం ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మూలికల చికిత్సతో మూత్రపిండాల్లో చాలా త్వరగా రాళ్ళు కరిగించవచ్చు అని చెబుతున్నారు.
మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి మరియు కిడ్నీస్టోన్స్ కరిగించడానికి సహాయపడే కొన్ని మూలికలు క్రింది స్లైడ్ లో ఉన్నవి, వాటిని పరిశీలించండి.

తులసి:
తులసి వల్ల మూత్రపిండాలకు ఒక పటిష్టమైన ప్రభావం కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నట్లైతే ఒక టీస్పూన్ తులసి రసం మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. ఈ మూలిక వైద్యం వల్ల రెగ్యులర్ గా ఆరునెలలపాటు క్రమం తప్పకుండా చేసుకోవడం వల్ల కిడ్నీలోని రాళ్ళునివారించిబడుతాయి. మరియు కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోయేందుకు సహాయపడుతుంది.

సెలరీ:
కిడ్నీ స్టోన్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ హెర్బ్. ఖాళీ కడుపుతో ప్రతి రోజూ ఉదయం సెలరీను తీసుకోవడం మంచిది. ఈ సెలరీను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

డాండెలైన్:
మూత్రపిండాల్లో రాళ్ళు మరియు మూత్రపిండ సమస్యలను నివారించడానికి డాండెలైన్ మూలిక అద్భుతంగా సహాయపడుతుంది. డాండెలైన్ రూట్ లో మూత్రవిసర్జన ప్రేరక లక్షణాలు కలిగి ఉన్నాయి మరియు ఎక్కువ పొటాషియం కూడా కలిగి ఉంది. అందువల్ల ఇది మూత్రం ఉత్పత్తిని ప్రోత్సహించడానికి తగినంత సామర్థ్యం కలిగి ఉంటుంది.

హార్స్ టైల్:
కిడ్నీ స్టోన్ నయం చేయడానికి లేదా చికిత్స చేయడానికి ఉత్తమ మూలికల్లో ఒకటి హార్స్ టైల్ మూలిక. అలాగే దీన్ని కడుపు ఉబ్బరం కూడా ఉపయోగిస్తుంటారు. ఈ హెర్బ్ చాలా తక్కువ సమయంలోనే ఒక ఆయుర్వేదిక్ దృష్టికోణంలో మూత్రపిండాల్లో రాళ్ళు నివారిణులు గా ఒక చల్లని ప్రభావాన్నికలిగి ఉంటుంది.

అలోవెర:
కిడ్నీ స్టోన్స్ ను క్లియర్ చేయడానికి కలబంద రసం చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ ను త్రాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది.

కిడ్నీ బీన్స్:
కిడ్నీ స్టోన్ నివారించడానికి ఇది కిడ్నీ బీన్స్ వందశాతం హెర్బల్ ట్రీట్మెంట్ కాకపోవచ్చు. కానీ కిడ్నీ స్టోన్ కరిగించడంలో ఒక బెస్ట్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. కిడ్నీ స్టోన్ కు ఒక ప్రభావవంతమైన యూరినరీ హోం రెమడీగా తీసుకోవచ్చు. వీటిని ట్రెడిషనల్ గా మెడిసినల్ టానిక్స్ లో ఉపయోగిస్తుంటారు.

దానిమ్మ:
మూత్రపిండాళ్లో రాళ్లును నివారణకు ఒక ఉత్తమ హెర్బల్ ట్రీట్మెంట్ కొరకు దానిమ్మ గింజలు సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు, లేదా దానిమ్మ గింజల జ్యూస్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ జ్యూస్ ను వారంలో ఒక రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం చాలా మంచిది.

గ్రావెల్ రూట్:
కిడ్నీ స్టోన్ నయం చేయడానికి ఒక ఉత్తమ మూలికా చికిత్స గ్రావెల్ రూట్. గ్రావెల్ రూట్ ను రోజుకొకసారి తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లును రద్దు చేయడానికి సహాయపడుతుంది.

రూమెక్స్ రూట్:
కిడ్నీ స్టోన్ వదిలించుకోవటంకోసం ఉపయోగించే ఒక శక్తివంతమైన మూలికా ఇది. రూమెక్స్ రూట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, 28 రోజుల్లో మూత్రపిండాళ్లో రాళ్లును నయం చేస్తుంది.

యువిఎ ఉర్సి/బీర్బెర్రీస్:
ఇవి సాధారణంగా గ్రామ ప్రాంతాల్లో కనిపించే అడవి పండ్లు. ఈ బీర్బెర్రీస్ గోరువెచ్చని పాలతో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు రద్దు చేయడానికి సహాయపడుతుంది. ఈ బీర్బెర్రీస్ మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే నొప్పిని రూపుమాపడానికి కూడా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











