ఆల్కహాల్ తీసుకోవడం వల్ల 15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఇవే....

మద్యం ఎక్కువగా త్రాగే వారిని ప్రశ్నించినట్లైతే.. వారు మద్యం సేవిస్తున్నాం అన్న విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అది కూడా వారు మోడ్రన్ డింకర్స్ గానో, సోషియల్ డ్రింకర్స్ గాను చెప్పుకోవడానికి ఇష్టంపడుతారు. ఒక్కో సందర్భంలో ఈ మోడ్రన్ డ్రింకర్స్ కూడా తాము తాగుతామని చెప్పడానికి మెహమాటపడుతారు. వారు రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడూ త్రాగేవారైన కూడా వారిలో ఆరోగ్యం సమస్యలు ఉంటాయి.

ఈ ఆరోగ్య సమస్యలు వెంటనే ప్రభావం చూపించకపోయినా, వినియోగం పెరిగే కొద్ది దాని దుష్ర్పభావాలు భవిష్యత్తులో ఎక్కువగా ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి ఆల్కహాల్ త్రాగేవారు వయస్సును బట్టి తగుమోతాదులో తీసుకోవాలి. లేదంటే మద్యం వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడాల్సి వస్తుంది. ఆల్కహాల్ తీసుకొనే అలవాటు మార్చుకోకపోతే అది క్రమక్రమంగా వ్యసనంగా మారే అలవాటు ఏర్పడుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల బ్లడ్ ప్రెజర్, గుండె సంబంధిత వ్యాధులు మొదలైనవి పెరుగుతాయి. ఇవన్నీ కూడా మద్యవయ్యస్సు నుండే మొదలవుతున్నాయి. మీరు కనుక ఆల్కహాలిక్ డ్రింకర్ అయితే ఈ సమస్యలంటిన్నీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మద్యపానంవల్ల ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కడుపులో పుండు (అల్సర్) రావచ్చు. కొందరికి ఈ అల్సర్ నుండి రక్తస్రావం కూడా జరుగవచ్చు. ఈ అల్సర్ తీవ్ర స్థాయికి చేరితే కడుపులో రంధ్రాలు పడి ప్రాణాపాయం సంభవించవచ్చు. మద్యపానంవల్ల నోటి కేన్సర్, అన్నవాహిక కేన్సర్, గొంతు కేన్సర్, నాలుక కేన్సర్, పాంక్రియాస్ కేన్సర్, లివర్ కేన్సర్ రావచ్చు. మద్యసేవించడం వల్ల కాలేయానికి సంబంధించి అనే వ్యాధి రావచ్చు. తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగు డుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది. వారు పనికి తరచు గెైరు హాజరవుతారు. అనారోగ్యానికి గురవుతా రు. ఈ కారణాల వల్ల ఉత్పత్తి పడిపోతుం ది. తాగుడు నిరుద్యోగానికి దారి తీస్తుంది. అకాల మరణం కూడా సంభవించవచ్చు. మద్యపానం అలవాటుగా మారకముందే దాని వల్ల కలిగే ముప్పును గ్రహించాలి. లేని పక్షంలో రకరకాల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ సేవించే వారికి మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఏముంటాయో ఒక సారి చూడండి.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

సిర్రోసిస్ ఆఫ్ లివర్: ఈ వ్యాధి సోకిన వారికి శరీరమంతా నీరు చేరుతుంది. ముఖంలో, కాళ్ళలో వాపు వస్తుంది. కడుపులో నీరు చేరుతుంది. కడుపులో నుంచి నీటిని తీసివేసినప్పటికీ మళ్ళీ చేరుతుంది. ఇది ఒక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

హై బ్లడ్ ప్రెజర్: ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీ, లోబీపికి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక ప్రెషర్‌ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక బ్లడ్‌ ప్రెషర్‌ 60 నుండి 80 మి.మీగాను నమోదు కావచ్చు.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

అధిక పొట్ట-జీర్ణకోశ వ్యాధులు: జీర్ణకోశం వ్యాధులు: ఆల్కహాల్‌లో ఉండే హానికర గుణం వల్ల, అది సంక్రమించే లోప పోషణ వల్ల కాలేయం దెబ్బ తింటుంది. పోషకాహారం దృష్ట్యా తగిన ఆహారం తీసుకుంటు న్నప్పటికీ, మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయం పెరుగుతుంది. ఉదయం పూట వికారంగా ఉండి వాంతి వస్తున్నట్టు ఉంటుంది. నీళ్ళ విరోచనాలు అవుతాయి. పొత్తి కడుపు కుడి వెైపు పెైభాగాన నొప్పిగా ఉంటుంది. కాలేయం వాపు వస్తుంది. ఇది ముదిరే కొద్ది కామెర్లు వస్తాయి.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

గుండె జబ్బులు: బి1 (థెైయమిను) లోపసం వల్ల గుండెలోని కండరాలకు హాని కలగడం చేత గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. గుండె పని చేయుటలో తేడాలు రావచ్చు.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

రక్తహీనత: మద్యపానీయాలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణంలో లోపం ఏర్పడుతుంది.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

ఒత్తిడి: తాగుడు వల్ల మెదడు మందగిస్తుంది. నరాలలో శక్తి తగ్గుతుంది. దాంతో ఒత్తిడి పెరుగుతుంది విటమిన్లు, ముఖ్యంగా ‘బి' విటమిన్ల లోపం వల్ల మద్యపానం మెదడుపెై పొరలపెై చూపే చెడు ప్రభావం వల్ల ఇలా అవుతుంది. నడక తిన్నగా ఉండదు. మాట తడబడు తుంది. కళ్ళ కదలికలో లోపం ఉంటుంది. మానసికంగా కృంగిపోతారు. పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యపానం చేసే వ్యక్తి ఒకసారి ఇలాంటి లోపానికి గురయితే చికిత్స చేయడం కష్టమవుతుంది.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

గౌట్ పెయిన్: మోకాళ్ళ నొప్పులు. ఆల్కహాలు కసేవించడం వల్ల శరీరంలోని యూరిక్ ఆమ్లం తగ్గి జాయింట్ పెయిన్స్ కు దారితీస్తుంది.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

ప్యాన్‌క్రియాస్‌: కాలేయం మరియు ప్యాన్‌క్రియాస్‌ దెబ్బతినడం. మద్యసేవనంవల్ల కాలేయానికి సంబంధించి సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనే వ్యాధి రావచ్చు.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

నరాల బలహీనత: మద్యపానంవల్ల మనిషికి ‘స్కెలిటల్ మయోపతి' అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి నరాలు క్షీణించి విపరీతమైన బలహీనత కలుగుతుంది. శారీరక శ్రమ చేయలేకపోతారు.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

క్యాన్సర్: క్యాన్సర్‌:ఆల్కహాలిసమ్‌ వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబం ధం ఉంది.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

లెైంగిక వాంఛ: పరుషుల్లో మద్యపానం వల్ల లెైంగిక వాంఛ తగ్గిపోతుంది. నపుంసత్వం ఏర్ప డుతుంది. ముఖం మీద వెంట్రుకలు తగ్గి ఆడంగి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలున్నపుడు తాగుడు మరింత పెరిగి, వారి పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. తాగుడు పూర్తిగా మానడమే దీనికి విరుగుడు.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

నిద్రలోపం: మద్యపానంవల్ల ‘డెలీరియం ట్రెమన్స్'అనే వ్యాధి కూడా రావచ్చు. ఈ వ్యాధివచ్చినవారికి నిద్రలేమి ఉంటుంది. వీరికి విపరీతమైన భయం, దృష్టిలోపం, వినికిడి సమస్య ఎక్కువగా ఉంటాయి. చేతులు వణకడం, చెమట పట్టడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

గర్భిణీ స్త్రీ పై ప్రభావాలు: గర్భవతులు మద్యం తీసుకుంటే పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, పెరుగుదల లోపాలు, అంగవైకల్యం రావచ్చు. కొందరిలో ‘‘పీటల్ ఆల్కహాలిక్ సిండ్రోమ్' అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో చిన్న తల, చిన్న కళ్ళు, పొట్టి ముక్కు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మద్యం సేవించే స్ర్తిలలో గర్భస్రావాలు ఎక్కువగా జరుగుతాయి.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

థైరాయిడ్ సమస్యలు: మద్యం సేవించేవారిలో థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయదు. దీనివల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి తగ్గుతుంది. ఇందువల్ల మనుషుల్లో శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది. తద్వారా నిరుత్సాహం, అలసట కలుగుతాయి.

15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురిచేసే ఆల్కహాల్

అందానికి చేటు: మద్యం తాగే వారి స్వరూప స్వభావాలలోనూ చాలా మార్పులు వస్తాయి. బాగా అలిసిపోయినట్లుండటం, ముఖం మీద మచ్చల వంటివి వస్తాయి. మద్యం ఒంట్లో ఉన్న నీటిని బయటకు పంపించేస్తుంది, కొన్ని విటమిన్లు, ఖనిజాలు చర్మానికి అందకుండా అడ్డుకుంటుంది. దీంతో చర్మం పాలిపోయినట్లు, నిర్జీవంగా తయారవుతుంది. చర్మం తేలికగా ఎర్రబారిపోయేలా చేసే 'రొసాసియా' వంటి సమస్యలకూ మద్యంతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు.

Story first published: Thursday, January 31, 2013, 17:40 [IST]
Desktop Bottom Promotion