మీరు ఖచ్చితంగా పాటించాల్సి మార్నింగ్ హెల్తీ హ్యాబీట్స్...!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. భోగభాగ్యాలకన్నా.. అష్ట ఐశ్వరాల కన్నా.. సిరిసంపదల కన్నా... ముఖ్యమైనది ఆరోగ్యం. అందుకోసం మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడుల కారణంగా ఇటీవల కాలంలో వ్యాధులు పెరుగుతున్నాయి. 20 ఏళ్లకే కీళ్లనొప్పులు, 25 ఏళ్లకే గుండెపోటు, మధుమేహం లాంటివి సోకుతున్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనారోగ్యానికి గురైన తరువాత చికిత్స చేయించుకోవడం కంటే ఆరోగ్యంగా ఉండటానికి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం.

ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫ్యాస్ట్ తీసుకోవడం కూడా మంచి అలవాటుగా ఆరోగ్యానికి ఉతమమైనదిగా భావిస్తారు. ఒక వేళ ఆలస్యంగా నిద్రలేవడం లేదా నిద్ర మూడ్ తోనే నిద్రలేస్తే అప్పుడు అది అనారోగ్యకరమైన అలవాటే అవుతుంది. దాంతో మీరు వర్క్ కోసం వెళ్ళేంత వరకూ మీ పనులను పూర్తి చేయడానికి సమయం సరిపోతుంది.ఇక మార్నింగ్ చేయాల్సిన కొన్ని మంచి అలవాట్లను కోల్పోతారు.

కాబట్టి ఉదయాన్నే లేవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడతుంది. నిద్ర లేచిన తర్వాత వ్యాయం లేకపోతే, అప్పుడు మీ మార్నింగ్ హాబిట్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదాయాన్నే తీసుకొనే ఆహారపు అలవాటు కూడా మార్నింగ్ హ్యాబిట్ క్రిందికే వస్తుంది. అలా కాకుండా ఉదయం నిద్రలేవగానే పనులు ముగించుకొని బ్రేక్ ఫాస్ట్ చేయకుండా బ్లాక్ కాఫీ త్రాడం, ఇది ఒక చెడు అలవాటు క్రిందికే వస్తుంది.

కొన్ని సులభమైన వ్యాయామాలు చేయడంతో పాటు సరైన సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల మీ హ్యాబిట్స్ ఆరోగ్యకరమైనవి. మీ జీవితాన్ని సుఖవంతంగా ఆరోగ్యంగా మార్చే అలాంటివి మరికొన్ని మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్ మీకోసం....

మీ సుఖవంతమైన జీవితానికి పునాదులు ఇవే...!

త్వరగా నిద్ర లేవడం: మీ సుఖవంతమైన జీవితాన్నిమార్నింగ్ హాబిట్స్ చాలా బాగా సహాయపడుతాయి. అందుకు ముందుగా మీరు సరైన సమయానికి వేకువ జామున లేదా ఉదయానే నిద్రలేవడం అలవర్చుకోవాలి. మీరు బయట వెళ్ళడానికి అరగంట ముందు లేవడం వల్ల ఉదయం చేసే కొన్ని మంచి అలవాట్లను లేదా పనులను మీరు కోల్పోతారు.

మీ సుఖవంతమైన జీవితానికి పునాదులు ఇవే...!

నీరు ఎక్కువగా త్రాగాలి: మార్నింగ్ హాబిట్స్ లో ఇది కూడా ముఖ్యమైనది. ఉదయం నిద్రలేవగానే పరగడుపున రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి. నీరు తక్కువగా సేవించే వారికి ఆరోగ్య పరమైన పలురకాల ఇబ్బందులు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా సేవించడం మూలాన రక్తాన్ని పలుచగా మారుస్తుంది. వీలైనంత ఎక్కువగా నీరు సేవిస్తుండండి. రోజు దాదాపు 8-10 గ్లాసుల నీరు సేవించండి.

మీ సుఖవంతమైన జీవితానికి పునాదులు ఇవే...!

యోగాసనాలు: ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే యోగసనాలు చేయడం వల్ల అవి మీ శరీరం ఫిట్ గా ఉంచడానికి మరియు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. నిజానికి మీరు, ఉదయం చేసే బ్రీథింగ్ ఎక్సర్ సైజ్ మరియు మెడిటేషన్ వల్ల ఆరోజంతా సంతోషంగా పనిచేయడానికి కావల్సిన ఎనర్జీని పొదగలుగుతారు.

మీ సుఖవంతమైన జీవితానికి పునాదులు ఇవే...!

గోరువెచ్చని లెమన్ వాటర్: భోజనానంతరం వెంటనే నీరు త్రాగకండి. నిమ్మకాయ రసంతో కూడుకున్న నీటిని ప్రతి రోజు తప్పనిసరిగా సేవిస్తుంటం ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని సేవించండి. లెమన్ వాటర్ లో కొద్దిగా తేనె కలుపుకొని త్రాగడం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది.

మీ సుఖవంతమైన జీవితానికి పునాదులు ఇవే...!

వ్యాయామం: ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల చాలా వరకు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. చిన్నా, పెద్దా వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వ్యాయామం అవసరమే. నిత్యం వ్యాయామం చేస్తుంటే శరీరం మనం తీసుకున్న ఆహారంలోని శక్తిని సమర్థంగా వినియోగించుకుంటుంది. దీనివల్ల అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు. వ్యాయామం వల్ల రక్తంతో పాటు వ్యాధులతో పోరాడే తెల్లరక్త కణాలు, యాంటీ బాడీలు కూడా శరీరమంతటా ప్రసరిస్తాయి. నడక, జాగింగ్, సైకిల్ వంటివి ఏవి చేసినా ఆరోగ్యానికి మంచిదే.

మీ సుఖవంతమైన జీవితానికి పునాదులు ఇవే...!

మార్నింగ్ బాత్: ప్రతి రోజూ ఉదయాన్నే స్నానం చేయడం వల్ల శరీరంలో మగతను పోగొట్టి మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది. అలా కాకుండా రోజులో మరేదైనా సమయంలో స్నానం చేయడం వల్ల ఉదయం చేసినంత ఆరోగ్యపు ప్రభావాన్ని చూపించదు. కాబట్టి స్నానానికి ఉదయమే బెస్ట్ సమయం.

మీ సుఖవంతమైన జీవితానికి పునాదులు ఇవే...!

కాఫీ/టీలకు బదులు జ్యూసులకు ప్రాధాన్యత: ప్రతి రోజూ ఉదయం లేవగానే కెఫిన్ రిలేటెడ్ పానీయాలు (కాఫీ/టీ)వంటివి త్రాగడం కంటే హెల్తీ జ్యూసులను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీల వల్ల ప్రస్తుతానికి మెదడుకు ఉపశమనం కలిగినా, శరీరానికి కీడు చేస్తాయి. కాఫీ టీలకు బదులు సిట్రస్ ఫ్రూట్స్ (నిమ్మజాతికి)చెందిన జ్యూసులను తీసుకోవడం మంచిది.

మీ సుఖవంతమైన జీవితానికి పునాదులు ఇవే...!

ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి/ఆహారపు అలవాట్లు: ఆరోగ్యానిని, అనారోగ్యానికి మనం తీసుకునే ఆహారమే మూలం. ప్రతి రోజూ ఉదయం తీసుకొనే ఆహారంలో ఓట్స్, హెల్తీ సాండ్ విచ్ తీసుకోవడం మంచిది. తీసుకునే ఆహారంలో కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు సమతులంగా ఉండటం అవసరం. ప్రతిరోజు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పీచుపదార్థాలు, గుడ్లు వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొవ్వు, నూనె పదార్థాలు బాగా తగ్గించాలి. మాంసాహారం మితంగా తీసుకోవారు. రోజూ ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ప్యాకెట్లలో విక్రయించే రెడీమేడ్ పదార్థాలు, స్వీట్లు తక్కువగా భుజించాలి. ప్రతిరోజు 4-5 లీటర్ల మంచినీరు తాగాలి. మధుమేహం, ఊబకాయం వంటివి ఉంటే వాటి నియంవూతణ కోసం కచ్చితంగా ఆహార జాగ్రతలు పాటించాలి.

Story first published: Tuesday, March 5, 2013, 17:28 [IST]
Desktop Bottom Promotion