Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
వేసవిలో నోరు తడిరిపోతోందా..ఐతే కూల్ డ్రింక్స్ వద్దు..తాజా జ్యూసులే ముద్దు..!
వేసవి కాలం అంటే అందరికీ భయమే ఎందుకంటే చర్మడీహైడ్రేషన్ కు గురియై, చర్మంలో నీరంత ఇంకిపోయి, చర్మం నిర్జీవంగా మారడమే కాదు, శరీరం కూడా శక్తిలేకుండా నీరసంగా కనిపించడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వేసవి వస్తోందంటే.. నీరసం కమ్ముకు వస్తోందన్న మాటే! తొందరగా అలసిపోవడం దగ్గరి నుంచి ప్రాణాంతకమైన డయేరియా వంటి వ్యాధుల వరకు వేసవి కాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని మనం నిత్యం చూస్తుంటాం.
వేసవికాలంలో సహజంగానే మనకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు పోతుంటుంది. ఈ నీటితో పాటూ మన శరీరంలో ఉం డే ఎలక్ట్రొలైట్స్, సోడియం, పొటాషియం లాంటి లవణాలు అన్నీ వెలుపలికి వెళ్లిపోతాయి. శరీరంలో ఆరోగ్య పరంగా సమతుల్యత పాటించాలంటే మనం వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం ఒక్కటే మార్గం. అయితే వీటన్నిటినీ భర్తీ చేయడానికి శరీరానికి తగినన్ని మంచినీళ్లు వీటితో పాటు కొన్ని పళ్ళ రసాలు తీసుకోవడం ఒక్కటే ప్రత్యామ్నాయం.
వేసవికాలంలో విపరీతమైన ఎండ వేడిమి. ఈ ఎండ వేడిమి వల్ల శరీరంలో ఉండవలసిన నీటి శాతం ఒక్కోసారి పడిపోతుంది. శరీరంలో ఉండవలసిన నీటి పరిమాణం కన్నా 5 శాతం అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే దానిని డీహైడ్రేషన్‌గా పరిగణిస్తారు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే...
నాలుక పిడచకట్టుక పోవడం కనిపిస్తుంది. కళ్లు తిరగడం, వికారం ఉంటుంది. చర్మం ఎర్రగా పొడిబారిపోతుంది. విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. మూత్రవిసర్జన తగ్గడం, చిక్కబడటం, పసుపుగా అవడం వంటి లక్షణాలు కనబడతాయి. శరీర ఉష్ణోగ్రత అతి ఎక్కువగా లేదా చల్లగా ఉంటుంది. తొందరగా చికాకు పడటం వంటి లక్షణం కనిపిస్తుంది. ఆకలి మందగించడం, పల్స్ రేటు పెరిగి, బీపీ తగ్గిపోతుంది. అయినప్పటికీ పట్టించుకోకపోతే అతిప్రమాదకరంగా మారిపోయి సొమ్మసిల్లి కోమాలోకి పోవడం కూడా జరుగుతుంది.

క్యారెట్ జ్యూస్: క్యారెట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, చర్మఆరోగ్యానికి కూడా మంచిదే.

బ్రొకోలీ జ్యూస్: బ్రొ గ్రీన్ వెజిటేబుల్ జ్యూసులు వల్ల చాలా రకాల ఆరోగ్య, న్యూట్రీషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది తమ చర్మసంరక్షణ కోసం, చర్మం మెరిసేలా చేసుకోవడం కోసం బ్రొకోలీ జ్యూసును రెగ్యులర్ గా తీసుకుంటుంటారు. ఇది క్యాన్సర్ తో పోరాడుతుంది. బ్రొకోలీ, మెలకెత్తిన విత్తనాల జ్యూసులు చాలా ఫేమస్.

కకుకుంబర్(కీర దోసకాయ)తో జ్యూస్: వేసవిలో చర్మానికి కావల్సినంత హైడ్రేషన్ కలిగిస్తుంది, కీరదోసలో నీరు శాతం అధికం. లోక్యాలరీస్ కలిగి ఉంటుంది. సహజంగా బరువు తగ్గాలనుకొనే వారు, కాంతివంతమైన చర్మ పొందాలనుకొనే వారు ప్రతి రోజూ ఈ కీర దోస జ్యూస్ ను త్రాగడం చాలా అవసరం. ఇది జీర్ణం కావడానికి చాలా సులభం. మరియు శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

మ్యాంగో జ్యూస్: వేసవి కాలంలో మ్యాంగో తినకుండా, మ్యాంగో జ్యూస్ త్రాగకుండా సమ్మర్ పూర్తికాదు. ఈ సీజన్ లో దొరికే పచ్చిమామిడియాలతో జ్యూస్ చేసి త్రాగితే కొద్దికొద్దిగా పులుపు, తీయ్యంగా ఉండే ఈ జ్యూస్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. సన్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. చర్మాన్ని రక్షిస్తుంది.

మ్యాంగో (ఆమ్ పన్నా)వాటర్: ఇది వేసవికాలంలో చాలా పాపులర్ డ్రింక్. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. సమ్మర్ హీట్ పారదోలుతుంది. చర్మానికి తగినంత హైడ్రేషన్ కలిగిస్తుంది.

లెమన్ జ్యూస్: లెమన్ జ్యూస్ మరో రిఫ్రెషింగ్ డ్రింక్. ఈ జ్యూస్ మీ శరీరాన్ని, చర్మాన్ని హైడ్రేషన్లో ఉంచడమే కాదు, బరువును కూడా తగ్గిస్తుంది. ఈ సమ్మర్ లో వేడిని ఉపశమనం పొదడానికి తప్పనిసరిగా ఈ హెల్తీ డ్రింక్ ను త్రాగాల్సిందే.

పుదీన జ్యూస్: మనకు తెలుసు పుదీనా మన శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. వేసవి వేడితో పోరాడుతుంది. కాబట్టి ఈ సమ్మర్ సీజన్ ఈ డ్రింక్ ను తప్పనిసరిగా త్రాగాలి.

టమోటో జ్యూస్: టమోటో లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఇది ఆరోగ్యం మాత్రమే కాదు, న్యూట్రీషియన్స్ కూడా పుష్కలమే. టమోటోలో ఉన్నలైకోపిన్ మొత్త ఆరోగ్యానికే మేలు చేస్తుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్: కొన్ని పౌండ్స్ బరువును తగ్గించుకోవాలా? అయితే ఈ పుల్లని తియ్యని జ్యూస్ త్రాగాల్సిందే. అంతే కాదు ఇది యూరినరీ ఇన్ఫెక్షన్ కు దారితీసే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

పపాయ జ్యూస్: ఈ జ్యూస్ ను బెస్ట్ మెడిసినల్ జ్యూస్ అని చెప్పొచ్చు . దీన్ని తాగడం వల్ల రుతు క్రమం టైమ్ కు వస్తుంది. ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారో వారు దీన్ని తీసుకోవడం మంచిది.

అవొకాడో జ్యూస్: అవొకాడో జ్యూసులో చాలా హెల్త్ మరియు స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి రోజూ అవొకాడో జ్యూస్ ను త్రాగితే మంచి ఆరోగ్యంతో పాటు, కాంతివంతమైన చర్మ ఛాయను పొందుతారు.

కివి జ్యూస్: కివి ఒక పండు. దీంతో తయారు చేసే జ్యూస్ ఆరోగ్యం మాత్రమే కాదు టేస్టీ కూడా. ఈ కివి జ్యూస్ ను ఒక్క సారి త్రాగితే చాలు అందరికి చాలా ఇష్టం అవుతుంది. దీన్ని పాలతో మిక్స్ చేసి త్రాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీనులు అందుతాయి.

పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. సోడియం తక్కువ. విటమిన్లలో విటమిన్-ఎ, ఫోలేట్, విటమిన్-సిలు ఎక్కువ. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

ఆపిల్ జ్యూస్: యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రోజూ ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి.

నీరు: దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు.

ద్రాక్ష రసం: ఇందులో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, కాపర్, ఐయోడిన్ ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటివి ఫుష్కలంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో గుండె ఆరోగ్యానికి, గౌట్, కీళ్ళనొప్పులకు, లివర్ సమస్యలకు, హెమరాయిడ్స్ మరియు ఇతర అలెర్జీలను పోగొట్టేందుకు సహాయపడే మరికొన్ని అధనపు ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఆరెంజ్/బత్తాయి: నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.
వేసవికాలంలో, చాలా రకాల పానీయాల అందుబాటులో ఉంటాయి. అవి రసాలు మరియు నీరు మరియు జ్యూసులు. అందులో చాలా రకాల జ్యూలు ఆరోగ్యానికి మంచిది మరియు తగినన్ని పోషకాలు అందిస్తుంది. ఈ జ్యూసులను వెజిటేబుల్స్ తోనూ మరియు పండ్లతోనూ తయారు చేయబడి ఉంటాయి. సమ్మర్ వెజిటేబుల్స్ బ్రొకోలి, క్యారెట్స్, మ్యాంగోస్, బెర్రీస్, కీరదోస, టమోటో వంటి మరికొన్ని పండ్లు కూరగాయలతోటి హెల్తీ జ్యూసులను తయారు చేస్తారు. ఈ సమ్మర్ ఫుడ్స్ పానీయాలుగా తీసుకోవడం వల్ల అత్యధికంగా విటమిన్స్, న్యూట్రీషియన్స్, మినిరల్స్ శరీరానికి అందుతాయి. అంతే కాదా శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా మనల్ని కాపాడుతాయి. మరి ఆ హెల్తీ జ్యూసులేంటో ఒకసారి చూద్దాం...



Click it and Unblock the Notifications











