Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తన కోపమే తనకు శత్రువు..తన శాంతమే తనకు రక్ష..!
తన కోపమే తనకు శత్రువు అంటారు మన పెద్దలు. కోపాన్ని తగ్గించుకుంటే మనలో మానసిక ఒత్తిడి వుండదు. మనస్సు ఎంతో ప్రశాంతంగా వుంటుంది. నిర్మలంగా వుంటుంది. నిర్మలమైన మనస్సును ఒక సరోవరంతో పోల్చారు. సరోవరం అంటే కొలను అన్నమాట. అందుకే మానస సరోవరం అంటారు.
కట్టలు తెంచుకునే కోపం.. ఎందుకంత కోపం.. అసలు కోపానికి కారణాలేమిటి.. అని దానికి గల కారణాలను అన్వేషిస్తే... దిగులు అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా వున్నాయి.. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు. అవేంటో ఒకసారి పరిశీలించండి.. మీకోసాని కంట్రోల్ చేసుకోండి.

ఒత్తిడి(స్ట్రెస్): అత్యధిక కోపాని గురియైనప్పుడు ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. అధిక కోపం ప్రదర్శించడం వల్ల ఒక్క సారిగా శరీరంలో నరాలన్నీ నొక్కి ఉంచబడుతాయి. దాంతో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడి, ఒత్తిడి వల్ల మధుమేహం, నిరాశ, అధిక రక్తపోటు తదితర తీవ్రమైన వ్యాధులు రావడానికి కారణం కావచ్చు

గుండె జబ్బులు: ఒత్తిడి తాలూకూ ప్రభావాల వల్ల గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంది. కోపం వల్ల హార్ట్ పల్స్ రేట్ లో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. ఒక్కసారిగా కోపం తెచ్చుకోవడం వల్ల అనేక గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది

నిద్రలేమి: చీటికి మాటికీ అధిక కోపానికి గురౌతుంటే శరీరం, మనస్సు ప్రశాంతంగా లేకపోయినట్లయితే నిద్రాభం గం తప్పదు. దీని వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది.

రక్తపోటు: కోపంగా వున్నప్పుడు రక్తపోటు బాగా ఎక్కువవతుంది. వచ్చిన కోపం ఎక్కువసేపు అలాగే ఉండిపోతే ఆపైన కోపం వదిలినా అధిక రక్తపోటును మాత్రం అలాగే వదిలి వెళ్తుంది.

ఆస్తమా: ఎవరైతే శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారో, వారు అధికంగా ఆగ్రహం తెచ్చుకున్నప్పుడు, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడవల్సి వస్తుంది. అధిక కోపాన్ని ప్రదర్మించినప్పుడు ఈ శ్వాస సంబంధిత సమస్యలే ఆస్తమాకు దారితీస్తాయి.

తలనొప్పి/శారీరక నొప్పులు : కోపం వచ్చినప్పుడు శరీర కండరాలపై ఒత్తిడి పెరిగి, నడుమునొప్పి, కాళ్లులాగడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వెన్నునొప్పి, మెడనొప్పి వంటి వాటికి కోపం ప్రథమ కారణం కాగలదు.

సెరిబ్రల్ స్ట్రోక్(మెదడుకు పోటు): ఇది మెదడులోని ఒకటి లేదా రెండు రక్తకణాలు బ్రస్ట్ అయినప్పడు సెరిబ్రల్ స్ట్రోక్ కు గురికావల్సి ఉంటుంది . ఇది మీరు అధిక కోపాన్ని ప్రదర్శించినప్పుడు మీలోని బ్లడ్ ప్రెజర్ అధికంగా పెరిగి సెరిబ్రల్ స్ట్రోక్ కు దారితీస్తుంది. ఈ సెరిబ్రల్ స్ట్రోక్ గురియైనప్పుడు మీ ప్రాణాలకే ప్రమాదం లేదా మూర్చవ్యాదిని కారణం అవుతుంది.

డిప్రెషన్: సాధారణంగా కోపంగా ఉన్నప్పుడు తోటి వారికి దూరంగా ఉంటాం. ఇలా ఉన్నందువల్ల ఒంటరి భావం కలిగి డిప్రెషన్‌కు దారి తీస్తుంది.

చర్మం : కోపం వంటి ప్రతికూల ఎమోషన్ల వల్ల హార్మోన్లు ప్రభావితం అవుతాయి. మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ముఖంలో జిడ్డు ఏర్పడి ముఖాన్ని అందవిహీనంగా మార్చుతుంది.

బౌల్ సిండ్రోమ్ : దీర్ఘకాలిక కోపతాపాలు జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అల్సర్లకు కారణమవుతుంది.
కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకూ రాకుండా చూసుకోవాలి. ఒక వేళ వచ్చి నప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి.
కోపం కలిగినప్పుడు దానిని అదుపులో వుంచుకొనుటకు కొన్ని ప్రయత్నాలు చేయండిలా...
1. ధ్యానం చేయటం, సంగీతం వినడం...వంటి రిలాక్సేషన్ ప్రక్రియలను చేయండి.
2. ఒక్క క్షణం మీరు చేస్తున్న పనిని ఆపి శరీరానికి, మనసుకు విశ్రాంతినివ్వండి.
3. నీళ్లు తాగడం, అంకెలు లెక్కబెట్టడం, మనసులో ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ కొంత సమయాన్ని గడపడం వంటివి చేస్తే కాస్త తగ్గించవచ్చు.
4. శ్వాసను నిదానంగా పీల్చి వదులుతూ ప్రశాంతత పొందుటకు ప్రయత్నించండి.
5. పరిస్థితి మితిమీరకుండా ఉండటానికి ఉన్న ప్రదేశాన్ని విడిచి వేరొక్క చోటుకు వెళ్లండి. కొంత సమయం తీసుకోండి.



Click it and Unblock the Notifications