Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
చికెన్ పాక్స్(ఆటలమ్మ) సహజ నివారణా పద్దతులు ...
చికెన్ పాక్స్(వారిసెల్ల) అనే వ్యాధి వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం, దురద, బొబ్బల వంటి రాష్ లు ఈ వ్యాధి యొక్క లక్షణాలు. చర్మం పై సూక్ష్మ క్రిముల ద్వారా అంటువ్యాధి, న్యుమోనియా, మెదడు వాపు వంటి ప్రమాదకరమైన సమస్యలకి ఈ వ్యాధి కారణమయ్యే అవకాశం ఉంది.

ఆటలమ్మ(Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు. ఆ రోజుల్లో మశూచి (Smallpox) అంటే చాలా భయపడేవారు, ఎందువలనంటే ఈ జబ్బు బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయేవారు, లేక వారు రూపురేఖలు చూడటానికి భయంకరంగా వుంటుంది.
చికెన్ పాక్స్ ని నివారించడం ఎలా

టీకా మందు ఇప్పించుకోవాలి: చికెన్ పాక్స్ ని నివారించడానికి ఉత్తమ మైన మార్గం చికెన్ పాక్స్ టీకా మందు ని ఇప్పించుకోవడం. ఈటీకా మందు చేయించుకున్న వ్యక్తినే కాక సమాజం లో ని చుట్టుపక్కల వాళ్ళకి కూడా, వారు వాక్సినేషన్ చేయించుకోకపోయినా వ్యాప్తి చెందడం అనేది జరగదు.

ఈ టీకా మందు ఎవరు తీసుకోవాలి : 13 ఏళ్ళు , అంతకంటే పెద్దవాళ్ళు ఇంకా ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారందరూ ఈ టీకా మందు ని రెండు డోసులు 4 నుండి 8 వారాల ఎడం తో తీసుకోవాలి.

పిల్లలు: ఆరోగ్యవంతమైన పిల్లలు 12 నెలల నుండి 12 సంవత్సరాల వరకు రెండు డోసులు కనీసంమూడు నెలల తేడాతో తీసుకోవాలి.

విదేశీ పర్యాటకులు

గర్భవతులు కాని మహిళలు

పిల్లలతో సహజీవనం చేసే పెద్దవాళ్ళు మరియు యువకులు : ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉండే చోట నివసించడం లేదా పని చెయ్యడం చేసే వాళ్ళు (కళాశాల విద్యార్ధులు, జైలు లో పని చేసే వాళ్ళు, మిలిటరీ లో పని చేసే వాళ్ళు). హెల్త్ కేర్ ప్రొవైడర్స్. వ్యాధి నిరోధక శక్తి క్షీణించిన వ్యక్తులు.

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అల్పాహారం తప్పనిసరి. అలాగే సరైన నిద్ర, సరైన ఆహారం కూడా అవసరం. అల్పాహారం చెయ్యకుండా బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి అత్యల్ప స్థాయిలో ఉంటుంది. అలాగే, ఆకుపచ్చని కూరగాయలు, తాజా పళ్ళు రోగ నిరోధక శక్తి ని పెంచుతాయి.

శరీరాన్ని చల్లగా ఉంచుకోండి: సాధ్యమైనంత పళ్ళు మరియు కూరగాయలు తీసుకోండి. సాధారణం గా శరీరం వేడిగా ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. మాంసాన్ని దూరం గా ఉంచండి.

సహజ నివారణా పద్దతులు: ఈ వ్యాధి కొంత కాలం ఉన్న తరువాత సహజంగా తగ్గుతుంది. అయినప్పటికి, ముందు జాగ్రత్త చర్యలు మరియు నివారణ ముఖ్యం. సహజ సిద్దమైన నివారణ పద్దతులలో మూలికల వైద్యం కూడా ఉంది.

ఆహారం మరియు పోషకాలు: పాల ఉత్పత్తులను తీసుకోకండి. వీటి వల్ల వచ్చే యూరిక్ ఆసిడ్ వల్ల జీర్ణ శక్తి సన్నగిల్లుతుంది. ఈ సమయం లో విషపదరధాలను శరీరం నుంచి తొలగించుకుంటూ ఉండాలి. అందుకే తాజా పళ్ళు, కారట్ జ్యూస్, ఆర్గానిక్ యోగర్ట్ వంటివి తీసుకోవాలి.

ఘనాహారాన్ని తగ్గించండి. ఈ వైరస్ మీ శరీరం లో ప్రవేశించినప్పటినుంచి ఘనాహారం, మాంసం వంటివి తగ్గించండి. ఒక వేళ మాంసాన్ని మీ ఆహారం లో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి అనుకున్నప్పుడు రసాయనిక గొడ్డు మాంసాన్ని అలాగే కోడి మాంసానికి దూరం గా ఉండండి. రసాయనాలు కలిగిన మాంసం వల్ల శరీరం లో అనేక రకాలైన ప్రతీకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆకుపచ్చని సలాడ్స్, సీ గ్రీన్స్ మరియు పచ్చి కారట్స్ తో వాటిని భర్తీ చెయ్యండి.

295 నుండి 354 మిల్లీ లీటర్ల క్రాన్బెర్రీ జ్యూస్ లో అర చెక్క నిమ్మ రసం కలిపి ప్రతి భోజనం తో తీసుకోండి. దీనివల్ల శరీరం లోని అంటి ఆక్సిడెంట్లు వైరస్ పై ప్రభావం చూపి చర్మం కోలుకునే విధంగా ఉపయోగ పడతాయి .

రెండు కివి పండ్లను ప్రతి భోజనం తో తీసుకోవటం వాల్ల విటమిన్ సి ,మరియు అతి ముఖ్య పోషకాలు లభించి ఉపిరి తిత్తులకు మేలు చేస్తాయి . దానివలన చర్మము మరియు రక్తము ఆరోగ్యం గా ఉంటాయి . అంతేకాక కివి లో ఉన్న ఎంజైము లు జీర్ణ వ్యవస్థకు కూడా మంచి చేస్తుంది . జీర్ణము అవ్వటం వలన శరీరానికి కావాల్సిన ఆరోగ్య కారకాలు అందుబాటులోకి వొచ్చి వ్యాధి నివారణను వేగవంతం చేస్తాయి .

నిద్రపోవటానికి ముందు రెండు కప్పుల కాఫిన్ లేనటువంటి చమోమిలే టీ తాగటం వలన దురదలు లేకుండా నిద్రపోవటానికి ఉపయోగపడుతుంది .

శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు : ఒక టబ్ లో గోరువెచ్చని లేదా వెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ సి సాల్ట్ మరియు 1/4 కప్ ఆపిల్ సైడేర్ వినిగర్ కలిపి దానిలో 20 నిముషాలు కూర్చోవటం చెయ్యటం మంచిది . దీని వలన దురదలు తగ్గటం మరియు పుల్లు శుభ్రపడటం జరుగుతుంది . బబుల్ బాత్ లు , సాధారణ సబ్బు తో స్నానం చెయ్యక పోవటం మంచిది .

టీట్రీ ఆయిల్:
స్నానం తరువాత పుళ్ళకు అణిచి వేసే మందులను రాయండి . వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి పిండి దానికి 10 నుండి 15 చుక్కలు టీ ట్రీ ఆయిల్ ను వేసి పుళ్ళ పైన వేడి తగ్గేవరకు రాయండి.



Click it and Unblock the Notifications











