Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే!
కామ వాంఛను పెంచే ఇండియన్ మసాలా దినుసులు
అంగస్తంభన సమస్య కావచ్చు లేదా హార్మోన్ల ప్రభావం కావచ్చు కొంతమందిలో కామ వాంఛలు తగ్గిపోతాయి. అందుకుగాను వారు ఎంతో ఖరీదైన మందుల వాడకం, మానసిక వైద్యం వంటివి చేయిస్తూ వుంటారు. తమ లైంగిక జీవితం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పురుషులు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు తినే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అప్పుడు పురుషులు వారి పార్ట్నర్ తో లవ్ లైఫ్ ను గడపడానికి సహాయపడుతుంది. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కామోద్దీపన పెంచడానికి సహాయపడుతాయి. అటువంటి సమస్య ఉన్న వారు అందుబాటులో వున్న కొన్ని ఆహారాలు తిని తమ పరిస్ధితి మెరుగుపరచుకోవచ్చు.
అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్:క్లిక్ చేయండి
ప్రపంచ దేశాలలో భారతదేశం సుగంధద్రవ్యాల లభ్యతలో రెండో దేశంగా పేరొందింది. కొన్ని సుగంధ ద్రవ్యాలు వాడితే సెక్స్ లైఫ్ అధికమవుతుందని పరిశోధనలు రుజువు చేశాయి. మీ శృంగార జీవితాన్ని అధికం చేసుకోవాలంటే మనకు అందుబాటులో వున్న ఈ సుగంధ ద్రవ్యాలు పరిశీలించండి.

మెంతులు -
మగవారిలో రతి కోర్కెలు విజృంభించాలంటే వారిలోని టెస్టోస్టిరోన్ హార్మోన్ అధికమవ్వాలంటే మెంతులు తినాలి.

ఏలకులు -
ఆకుపచ్చగా, చిన్నగా వుండే ఏలకులు తింటే అద్భుతమైన ఎనర్జీ, అలసట పోతుంది. ఇక మీ లవ్ లైఫ్ ఆకాశాన్నంటే రీతిలో ఎదిగిపోతుంది.

లవంగాలు -
శరీరాన్ని వేడెక్కించి...బెడ్ లో మీ కవసరమైన కోర్కె కలిగిస్తాయి.

సోపు లేదా పెద్ద జీలకర్ర -
కామ కోర్కెలను పెంచే ఈస్ట్రోజన్ లాంటిది ఇందులో అధికంగా వుంటుంది. సాధారణంగా డిన్నర్ తర్వాత రెస్టరెంట్లలో దీన్ని అందిస్తారు.

జిన్ సెంగ్ -
మగవారిలో నపుంసకత్వాన్ని పోగొట్టటానికి గాను దీనిని వాడతారు. జిన్ సెంగ్ "కింగ్ ఆఫ్ మెడిసిన్"గా పేరు పొందినది, ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తరచుగా తీసుకోవటం వల్ల శక్తిని తిరిగి ఇస్తుంది అదేవిధంగా దీర్ఘాయుష్షునిస్తుంది. ఈ ఉత్పత్తిని తక్కువ ఉష్ణోగ్రతనుపయోగించి రూపొందించబడటం వల్ల ప్రతి ఒక్కరికి తగినది.

కుంకుమపువ్వు -
మొదటి రాత్రి శోభనం గదిలోకి వధువు తీసుకెళ్ళే పాలగ్లాసులో కూడా దీన్ని కలుపుతారు.

జాజికాయ -
జాజికాయ, వయాగ్ర మెడిసిన్ అంత సమర్ధవంతంగా కామ కోర్కెలను కలిగిస్తుందని రీసెర్చి చెపుతోంది. రాత్రివేళ పాయసంలో వేసి తాగితే...ఇక నిద్రే రాదు.

వెల్లుల్లి -
వెల్లుల్లి తోపాటు పచ్చి మిరప కూడా కలిపి తింటే....విపరీతమైన కోర్కె పుడుతుందని పాతకాలంలోనే చెప్పారు. వెల్లుల్లి రెబ్బలు నేతిలో వేయించి మీ భాగస్వామికిచ్చేయండి. ఫలితం అనుభవించండి.

అల్లం -
ఇది వెల్లుల్లికి సోదరుడు. మరింత కోర్కె రేపుతుంది. ఎంతసేపు కోర్కె తీర్చుకున్నా తనివి తీరకుండా చేస్తుంది.

అశ్వగంధ:
సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.
కనుక, బెడ్ రూమ్ లోకి వెళ్ళేముందు కిచెన్ లోని పోపుల పెట్టెలోని ఈ సుగంధ ద్రవ్యాలను నోటిలో వేసుకొని రాత్రంతా భాగస్వామితో ఆనందించండి.



Click it and Unblock the Notifications