Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జీర్ణక్రియను మెరుగుపరిచే బెస్ట్ ఫుడ్స్
మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు అనేక జీర్ణసమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఎవ్వరిని పలకరించినా ఎసిడిటీ, ఐబీఎస్, అల్సర్ వంటి సమస్యల్లో ఏదో ఒకటి ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ సమస్యలు చేజేతుల్లా కొనితెచ్చుకున్నవే. అయితే లక్షణాలు తగ్గే విధంగా కాకుండా, వ్యాధి మూలకారణాన్ని తొలగించే విధంగా చికిత్స ఉన్నప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. జీర్ణ సంబంధ సమస్యలలో సాధారణంగా కనిపించే లక్షణాలు అజీర్తి, గ్యాస్, తేన్పులు, కడుపు నొప్పి, కడుపులో మంట, మలబద్దకం, విరేచనాలు. ఒక్కోసారి మలంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్దకం, బరువు తగ్గటం, ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి పనితీరు వల్ల కూడా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరిలో రోజువారి విరేచనాలు సాఫీగా జరగవు. దీనినే మలబద్దకం అంటారు. విరేచనం అయిన తరువాత కూడా మళ్లీ వెళ్లాలనిపించడం మలబద్దకం లక్షణమే.జీర్ణక్రియను
మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు:క్లిక్ చేయండి
కొందరిలో అన్నం తినకపోతే కడుపులో మంట, తింటే అజీర్తి వేధిస్తుంటాయి. మరికొందరిలో మలబద్దకం సమస్య ఏళ్ల పర్యంతం ఉంటుంది. ఇవి మొదట్లో చిన్న సమస్యలుగానే అనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారతాయి. అయితే వీటిని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. మరి మన వంటింటి చిట్కాలేంటో ఒక సారి చూద్దాం...

ఆపిల్స్ :
ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు, ఇది బౌల్ మూమెంట్ కు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంల అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో కరిగే గుణాలు మరియు కరగని గుణాలు రెండు ఉన్నాయి. ఆపిల్స్ లోని సెల్యులోజ్ బౌల్ మూమెంట్ సక్రమంగా జరిగేలా చేసి,మలబద్దకాన్ని నివారిస్తుంది.

బీట్ రూట్:
జీర్ణ సమస్య కడుపు ఉబ్బరం, మలబద్దకం, కడుపు నొప్పి , వంటి సమస్యలనుండి ఉపశమనం పొందడానికి బీట్ రూట్ బాగా సహాయపడుతుంది. బీట్ రూట్ లోని మెగ్నీషియ, ఫైబర్ మరియు పొటాషియం లు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందిస్తుంది. ఇది అసిడిటిని తగ్గిస్తుంది.

పుదీనా :
పుదీనా నమలడం ద్వారా శ్వాస చాలా స్వచ్చంగా తాజాగా ఉంటుంది. పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటర్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, పుదీనా ఆకులను సలాడ్స్, సూప్స్ లో జోడించి తీసుకోవాలి . అలాగే కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో పిప్పర్ మెంట్ ఆయిల్ వేసి త్రాగాలి . ఇలా చేయడం వల్ల ప్రేగుల్లోని చెత్తను బయటకు నెట్టివేయబడుతుంది.

ఓట్స్:
ఓట్స్ చాలా అధ్బుతఆరోగ్యకరమైన ఆహారం. ఇది బరువు తగ్గించడంలోనే కాదు, ఇంకా ఇది జీర్ణక్రియ ప్రయోజనాలు కూడా కలిగి ఉంది. ఇందులో ఉండే పుష్కలమైనటువంటి ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది . ఇది రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను సాఫీ జరిగేలా చూస్తుంది. కాబట్టి, అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారించడం కోసం ఓట్స్ ను రెగ్యులర్ గా తీసుకోండి .

అల్లం:
చాలా పాతకాలపు మసాలా దినుసు అల్లం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది సరిగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరి మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను వికారం, గ్యాస్, కడుపు ఉబ్బరం నివారిస్తుంది.కాబట్టి, అల్లం టీని రెగ్యులర్ గా తీసుకొని సమస్యను నుండి బయటపడండి.



Click it and Unblock the Notifications