వేసవిలో చికెన్ పాక్స్(అమ్మవారు)తో తస్మాత్ జాగ్రత్త

వేసవిలో అధికంగా వచ్చే వ్యాధుల్లో పెద్దమ్మవారు, చిన్నమ్మవారు ముఖ్యమైనవి. ఈ వ్యాధినే గ్రామాల్లో దట్టమ్మ, అమ్మవారు, ఆటలమ్మలగా పిలుస్తుంటారు. వెరిసెల్లా జోస్టర్ అనబడే వైరస్‌తో వచ్చే ఈ వ్యాధి సాధారణంగా ఐదు నుంచి పదేళ్లలోపు పిలల్లకు వస్తుంది. అయితే పెద్దల్లో కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. పరిశుభ్రతతో సక్రమమైన ఆహార నియమాలను పాటించినట్లయితే దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి సోకిన వారికి చర్మం దురదగా ఉండటమే కాకుండా ఎర్రగా కందిపోతుంది. తొలుత ముఖంపై ప్రారంభమైన ఈ దురద మెల్లగా వీపు, నడుము భాగాలకు కూడా వ్యాపించి చర్మం మొత్తం చిన్న చిన్న ఎర్ర కురుపులుగా మారతాయి. నోటి పూత, కురుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఈ వ్యాధి బారిన పడినవారితో మాట్లాడడం ద్వారా 10 - 21 రోజుల్లో మరొక వ్యక్తికి కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇలా ఇన్ఫెక్షన్ కు గురైన పెద్దవారిలో నివారించడం చాలా కష్టం అవుతుంది. వ్యాధిగ్రస్తులు దగ్గు, తుమ్ము, ఉమ్ము వేయడం ద్వారా వైరస్ క్రిములు గాలిలో ప్రయాణించి ఇతరుల శరీరంలోకి చేరవచ్చు. తొలి మూడు నెలల్లో గర్భిణులు ఈ వ్యాధి బారిన పడితే గర్భస్త శిశువుకు వేరిసెల్లా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది.

పెద్దల్లో వ్యాధినిరోధకత లోపించిన ఇన్ఫెక్షన్ డిసీజ్ కు గురైన వారు కోలుకోవడానికి ఈ వైరస్, వేరిసెల్లా కు వ్యతిరేకంగా వ్యాసినేట్ చేసుకోవాలి. లేదా కొన్ని హోం రెమడీస్ ఉపయోగించి నేచురల్ గా చికెన్ పాక్స్ ను తగ్గించుకోవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగిన వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. గర్భిణులు మాత్రం వైద్యుని పర్యవేక్షణలోనే మందులు వాడాలి. సంవత్సరంలోపు శిశువులు ఈ వ్యాధి బారినపడకుండా ప్రత్యేక టీకాలను వేయించాలి. వీటితో పాటు మరికొన్ని చిట్కాలు...

వ్యాధినిరోధకతకు అవసరం అయ్యే ఆహారాలు:

వ్యాధినిరోధకతకు అవసరం అయ్యే ఆహారాలు:

పెద్దవారిలో చికెన్ పాక్స్ ను నివారించుకోవడానికి అతను/ఆమె శరీరం స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి, ముఖ్యంగా వ్యాధినిరోధకతను పెంచుకోవాలి . ఇలా ఇమ్యునిటి పెంచుకోవాలంటే మీరు తీసుకొనే ఆహారంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను మరియు తాజా పండ్లు చేర్చుకోవాలి .

చికెన్ పాక్స్(ఆటలమ్మ)సోకిన వ్యక్తికి దూరంగా ఉడటం:

చికెన్ పాక్స్(ఆటలమ్మ)సోకిన వ్యక్తికి దూరంగా ఉడటం:

ఆటమ్మ వైరస్ కు ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి ఆరోగ్యవంతులు దూరంగా ఉండాలి. ఈ సమస్యను మీరు చిన్నప్పుడు ఎదుర్కోకపోయినా కూడా, పెద్ద అయిన తర్వాత వస్తే, తగ్గే వరకూ ఒపికగా ఉండాలి. ఇది తగ్గడానికి కనీసం 3వారాలు పడుతుంది.

శరీరంను చల్లగా ఉంచుకోవాలి:

శరీరంను చల్లగా ఉంచుకోవాలి:

వేసవిలో శరీరంను సాధ్యమైనంత వరకూ చల్లగా ఉంచుకోవాలి. ఎక్కువగా కొబ్బరిబొండాంలోని నీళ్ళు త్రాగాలి. రాగిపిండితో తయారుచేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంకు తగినంత చలువ చేస్తుంది. ప్రతి నాలుగు గంటలకోసారి చల్లని నీటితో స్నానం చేయడం ద్వారా దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. చల్లని పానీయాలు, ద్రవపదార్థాల వంటివి వ్యాధిగ్రస్తులకు అందించడం ద్వారా ఇంట్లోనే ప్రాథమిక చికిత్స చేపట్టవచ్చు.

సమ్మర్ డ్రింక్స్:

సమ్మర్ డ్రింక్స్:

నిమ్మరసం ఒక బెస్ట్ సమ్మర్ డ్రింక్. పెద్దవారిలో చికెన్ పాక్స్ నివారణకు ఇది ఇక బెస్ట్ సమ్మర్ కూల్ డ్రింక్. నిమ్మరసంలో ఉండే యాసిడ్స్ పొట్టలో చేరి చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

బిట్టర్ ఫుడ్స్:

బిట్టర్ ఫుడ్స్:

చేదు ఆహారాలు బిట్టర్ గార్డ్(కాకరకాయ లేదా బ్రొకోలీ)వంటివి పెద్దవారిలో చికెన్ పాక్స్ నివారించడానికి ఉత్తమ ఆహారాలు. ఈవెజిటేబుల్స్ ఆరోగ్యకరం మరియు వేరిసెల్లా వైరస్ తో పోరాడుతుంది. ఇటువంటి ఆహారాలు కనీసం వారంలో ఒక సారి తీసుకోవాలి.

శరీరంను ఎల్లప్పుడు తేమగా ఉంచుకోవాలి:

శరీరంను ఎల్లప్పుడు తేమగా ఉంచుకోవాలి:

నీరు మీ శరీరంను ఎల్లపుడు ఎనర్జిటిక్ గా మరియు హెల్తీగా ఉంచతుంది. మరియు వేసవిలో తగినంత నీరు తీసుకోవడం వల్ల మీ శరీరంను కూల్ గా ఉంచుతుంది. పెద్దవారిలో చికెన్ పాక్స్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

మీ ఇంటిని డిస్ ఇన్ఫెక్ట్ గా ఉంచాలి:

మీ ఇంటిని డిస్ ఇన్ఫెక్ట్ గా ఉంచాలి:

ఇంట్లో ఎవరైనా వేరిసెల్లా వైరస్ కు గురైనప్పుడు, మీ ఇంటిని క్రిమికీటకాలు లేకుండా శుభ్రంగా ఉంచాలి. వేపఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ వేడినీటితో స్నానం చేస్తే చికెన్ పాక్స్ కు ఉత్తమ పరిష్కార మార్గం.

చేతులను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి:

చేతులను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి:

అన్ని వేళలా, మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు, మీ చేతులను తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి. క్లియర్ రన్నింగ్ వాటర్ తో చేతులను శుభ్రం చేసుకుంటుండాలి.

వ్యాక్సిన్:

వ్యాక్సిన్:

మీరు వ్యాక్సిన్ వేయించుకోకపోతే, ఇప్పుడు వేయించుకొనే సమయం అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పిల్లల్లో నేచురల్ పద్దతులు పనిచేసినా, పద్దవారిలో ఈ నేచురల్ పద్దతుల అంత త్వరగా ప్రభావం చూపకపోవచ్చు. కాబట్టి, ఈ చిట్కాలను పాటించడంతో పాటు, వ్యాక్సింగ్ చేయించుకోవడం ఉత్తమ మార్గం.

యాంటీబయోటిక్ ఫుడ్:

యాంటీబయోటిక్ ఫుడ్:

చికెన్ పాక్స్ ను పెద్దవారిలో నివారించడం కోసం పొట్ట నిండుగా యాంటీబయోటిక్ ఫుడ్స్ తో నింపండి. వేసవిలో ఒక ఉత్తమ యాంటీబయోటిక్ మజ్జిగ లేదా పెరుగు. వేసవిలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మజ్జిగ ఒక ఉత్తమ యాంటీబ్యాక్టీరియల్ ఫుడ్.

Story first published: Wednesday, March 26, 2014, 13:27 [IST]
Desktop Bottom Promotion