Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
స్మోకింగ్ హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..!
ధూమపానం ఆరోగ్యానికి హానికరము అని మనకు తెలిసిన విషయమే! ప్రస్తుతం ఇతర దేశాల పాటు మన దేశంలో కూడా ప్రతి సంవత్సరం ధూమపానం వల్ల వివిధ క్యాన్సర్ల వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ల వల్ల చనిపోయేవారు కొన్ని వేలల్లో ఉన్నారు. అయితే, ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో స్మోకింగ్ చేయడం ఒక స్టైల్ స్టేట్ మెంట్ అయింది.
స్మోకింగ్ వల్ల వచ్చే దగ్గు: నివారించే ఉత్తమ చిట్కాలు: క్లిక్ చేయండి
మనదేశంలో పొగతాగే అలవాటు రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా యువకుల్లో సిగరెట్లు కాల్చే ధోరణి విజృంభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పొగతాగటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటితో పాటు వూపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. అయినా ఎంతోమంది ఈ 'పొగ'కు బానిసలు అవుతూనే ఉన్నారు. పొగతాగటం, సిగరెట్లపై నెలకొన్న అపోహలు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తున్నాయి. అసలు ఈ అపోహల్లో నిజమెంత?
ధూమపానం మీకు పెద్ద శత్రువు అని చెప్పటానికి 10 కారణాలు: క్లిక్ చేయండి

అపోహ: పొగ తాగితే మూడ్ బాగుంటుంది?
వాస్తవం: ఇది పూర్తిగా తాత్కాలిక భావన. అప్పటికే కుంగుబాటు బారిన పడినవారు సిగరెట్లు తాగితే పరిస్థితి మరింత ముదురుతుండటమే ఇందుకు నిదర్శనం. పొగతో అతిగా స్పందించటం, ఏకాగ్రత కుదరకపోవటం వంటి లక్షణాలూ పొడసూపుతాయి. రోజూ సిగరెట్లు తాగే యువకుల్లో కుంగుబాటు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని అధ్యయనాల్లో తేలింది.

అపోహ: అప్పుడప్పుడు మాత్రమే సిగరెట్లు తాగుతాను. కావాలంటే ఎప్పుడైనా ఈ అలవాటును మానగలను.
వాస్తవం: సిగరెట్లు తాగేవారు అందులోని నికోటిన్‌కు బానిసలయ్యే ప్రమాదం ఉంది. వీటిని కాలుస్తున్న కొద్దీ శరీరం నికోటిన్ మీద ఆధారపడడం ఆరంభిస్తుంది. కాబట్టి దీన్నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. రోజుకి మూడు సిగరెట్లు కాల్చినా గుండెజబ్బుల ముప్పును కొని తెచ్చుకుంటున్నట్టే. ముఖ్యంగా మహిళలకు ఈ ప్రమాదం ఎక్కువ.

అపోహ: కేవలం పొగతాగే అలవాటు గలవారికి మాత్రమే వూపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది.
వాస్తవం: పొగతాగేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువే అయినప్పటికీ.. ఇతరులు వదిలిన పొగను పీల్చే వారికీ ముప్పు పొంచి ఉంటుంది. రేడియేషన్, విషతుల్యమైన పారిశ్రామిక వ్యర్థాలు, వాతావరణ కాలుష్యం, క్షయ కూడా వూపిరితిత్తుల క్యాన్సర్‌కు దోహదం చేస్తాయి.

అపోహ: పొగతాగితే కేవలం వృద్ధులకే ప్రమాదం.
వాస్తవం: పొగ తాగితే ఎవరికైనా ముప్పు తప్పదు. దీంతో ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, దగ్గు, త్వరగా అలసిపోవటం వంటివి దాడి చేస్తాయి. వాసన, రుచి తెలియకపోవటంతో పాటు చర్మం కూడా త్వరగా ముడతలు పడుతుంది.

అపోహ: జీవితాంతం పొగ తాగినా నా తల్లిదండ్రులకు ఈ క్యాన్సర్ రాలేదు. కాబట్టి సిగరెట్లు కాల్చినా నాకు రాదు.
వాస్తవం: ఇలా అనుకోవటం పొరపాటు. వారికి రాలేదంటే మీకూ రాదని అర్థం కాదు. Pపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో 90 శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొగ పీల్చినవారే! చాలాకాలంగా పొగ తాగుతుండటం, ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాలుస్తుండటం వంటివన్నీ ముప్పును పెంచేవే.

అపోహ: 'లైట్' సిగరెట్లు మిగతావాటికన్నా మంచివి.
వాస్తవం: అన్ని సిగరెట్ల మాదిరిగానే ఇవీ ప్రమాదకరమైనవే. మెంథాల్ సిగరెట్లు కూడా సురక్షితమైనవి కావు. ఈ మెంథాల్ సిగరెట్లు చాలా ప్రమాదకరమైనవి మాత్రమే కాదు, వీటి అలవాటును మానుకోవటం అంత తేలిక కాదనీ పరిశోధనల్లో తేలింది. వీటిల్లోని చల్లదనం మూలంగా పొగను మరింత లోనికి పీల్చుకునేలా చేస్తుంది.

అపోహ: పైప్, చుట్టలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీయవు.
వాస్తవం: వీటితో వూపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే కాదు.. గొంతు, నోరు, అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదమూ ఉంది. చుట్టలతో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

అపోహ: పొగ తాగటం మానేస్తే బరువు పెరుగుతారు.
వాస్తవం: ఇది అపోహ. నిజానికి పొగ మానటంతో ఆకలి పెరుగుతుంది. దీంతో తిండి ఎక్కువ తినటానికి ఇష్టపడతారు. అందువల్ల పండ్లు, కూరగాయల వంటి ఆరోగ్యకర ఆహారం ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయటం వంటివి చేస్తే బరువు పెరగకుండా చూసుకోవచ్చు.

అపోహ: చాలాకాలంగా సిగరెట్లు కాలుస్తుంటేనే ప్రమాదం.
వాస్తవం: ఇది పూర్తిగా అపోహే. మొదటి సిగరెట్ కాల్చటం దగ్గర్నుంచే శరీరంలోని కణాలు దెబ్బతినటం మొదలవుతుంది.



Click it and Unblock the Notifications
