అజీర్తి: తక్షణ ఉపశమనం కలిగించే టాప్ 10 హోం రెమడీస్

అజీర్తి ఇంకా వైద్యపరిభాషలో అజీర్ణం, దీనికి ప్రధాన కారణంలో కడుపులో జీర్ణ రసాలు ఏర్పడు కారణంగా వచ్చే సమస్య. ముఖ్యంగా అజీర్ణం లేదా అజీర్తి సమస్య స్పైసీ లేదా ఫ్యాటీ ఫుడ్స్ ను తిన్నప్పుడు లేదా ఎక్కువ ఆహారం తీసుకొన్నప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది.

అజీర్ణంకు ప్రధాన లక్షణం, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు ఉదరంలో మంట మరియు వికారం, వాంతులు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలను నివారించుకోవాలంటే కొన్ని వంటింటి వస్తువుల బాగా సహాయపడుతాయి. అజీర్ణం మొదలుకొన్ని, వాటి లక్షణాలన్నింటిని తగ్గించి, తక్షణ ఉపశమనం కలిగించాలంటే, అజీర్తిగా ఉన్నట్లు మీరు భావించిన వెంటనే ఒక గ్లాసు నీళ్ళు త్రాగాలి. ఇది అజీర్తీకి ఎక్కువ రిఫీఫ్ ను అంధిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు:క్లిక్ చేయండి

కడుపు ఉబ్బరం మరియు కడుపు మంట ఉన్నప్పుడు వెంటనే నీళ్ళు త్రాగడం వల్ల,నీళ్ళు కడుపులో యాసిడ్స్ తో విలీనమైన తక్షణ ఉపశమనం అందివ్వడానికి సహాయపడుతుంది. నీళ్ళు మాత్రమే కాదు, నీళ్ళతో పాటు, అజీర్ణం నుండి ఉపశమనం పొందుటకు ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి. అజీర్ణంకు తక్షణ ఉపశమనం కలిగించే టాప్ 10 హోం రెమెడీస్..

వికారం,వాంతులు & నీరసం తగ్గించే10 బెస్ట్ ఫుడ్స్: క్లిక్ చేయండి

ఆపిల్:

ఆపిల్:

ఫైబర్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. అటువంటి ఆహారాల్లో ఆపిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆపిల్ తొక్కలు అధిక ఫైబర్ ఉంటుంది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఇటువంటి ఆహారాలు తీసుకొన్నప్పుడు జీర్ణాశయంలో బ్లాక్ అయిన ప్రదేశంను క్లియర్ చేస్తుంది. దాంతో కడుపు నొప్పి నుండి కొన్ని నిముషాల్లోనే ఉపశమనం కలిగిస్తుంది.

గ్రేప్ ఫ్రూట్:

గ్రేప్ ఫ్రూట్:

గ్రేఫ్ ఫ్రూట్ తొక్కలో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండి. అవి అజీర్ణం వల్ల కడుపులో వేడిని మరియు చికాకును నివారిస్తుంది. మరియు జీర్ణరసాలు వేగంగా ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో మీ జీర్ణాశయం మరింత చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది. గ్రేప్ ఫ్రూట్ తొక్కలను తురిమి, తర్వాత ఎండలో ఎండబెట్టాలి. తర్వాత దీన్ని పొడి చేసుకోవాలి. మీకు ఎప్పుడు కడుపునొప్పిగా అనిపిస్తే అప్పుడు అరటీస్పీన్ గ్రేప్ ఫ్రూట్ పౌడర్ ను ఒక చెంచా మింగాలి. లేదా నీటిలో మిక్స్ చేసి త్రాగాలి.

ధనియాలు:

ధనియాలు:

అజీర్తికి ధనియాలు చాలా ఎఫెక్టివ్ హోం ట్రీట్మెంట్. అరగ్లాసు మజ్జిగలో వేయించిన ధనియాలను కొద్దిగా వేసి, అలాగే త్రాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

పొట్టలో అధికంగా యాసిడ్స్ఉత్పత్తి అవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో అజీర్ణం చేస్తుంది. అటువంటి సమస్యను బేకింగ్ సోడా ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఎందుకంటా ఇది యాంటాసిడ్ గా పనిచేస్తుంది. ఒక అరటీస్పూన్ బేకింగ్ సోడాను, అరగ్లాసు నీటిలో వేసి బాగా మిక్స్ చేసి, తీసుకోవడం వల్ల , పొట్ట ఉదరంలో ఆమ్లాలను స్తంభింపచేస్తుంది మరియు ఉబ్బరం నుండి తక్షణ ఉపశమనం అంధిస్తుంది.

సోంపు:

సోంపు:

కారంగా ఉన్న ఆహారాలు లేదా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నప్పుడు, సోంపు అజీర్తిని నివారించడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. సోంపులో ఉన్న నూనెలు వికారంను మరియు అపానవాయువును తగ్గిస్తుంది. అజీర్తి లక్షణాలున్నప్పుడు, వెంటనే ఒక చెంచా సోపును నోట్లో వేసుకొని నమలడం ద్వారా, తక్షణ ఉపశమనం ఉంటుంది. అలాగే మీరు సోంపుతో తయారుచేసిన టీని కూడా త్రాగవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా సోంపు వేసి బాగా మరించి, గోరువెచ్చగా చేసి త్రాగాలి.

అల్లం:

అల్లం:

అల్లం పొట్టలోని జీర్ణరసాలను మరియు మీరు తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరం అయ్యే ఎంజైముల ప్రవాహంను ప్రేరేపిస్తుంది. ఎక్కువ ఆహారం తీసుకొన్నప్పుడు అజీర్ణం నుండి తక్షణ ఉపశమనం కలిగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా నిమ్మరసం మరియు చిటికెడు ఉప్పు మరియు బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తీసుకోవాలి. అలాగే తాజాగా ఉండే అల్లం పెద్ద ముక్క తీసుకొని కట్ చేసి దాని మీద ఉప్పు చిలకరించి, చప్పరించడం లేదా నమలడం చేయాలి.

హేర్బల్ టీ:

హేర్బల్ టీ:

భోజనం చేసిన ప్రతి సారి, హెర్బల్ టీని త్రాగడం వల్ల ఒక గొప్పగా అజీర్తిని తగ్గిస్తుంది. అరకప్పు వేడి నీటిలో ఒక హేర్బల్ టీ డిప్ చేసి, 5నిముషాలు అలాగే వదిలేయాలి. వేడిగా ఉండంగానే వాటిని అలాగే త్రాగాలి. హెర్బల్ టీకి పుదీనా, రాస్బెర్రీ, బ్లాక్ బెర్రీ వంటివి ఎంపిక చేసుకుంటే తక్షణ ఉపశనమం ఉంటుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

అజీర్తితో బాధపడేవారికి తక్షణ ఉపశమనం కలిగించే వంటింటి వస్తువు దాల్చిన చెక్క. దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పొట్టఉబ్బరం,పొట్ట తిమ్మెరలను నివారిస్తుంది. అరకప్పు వేడి నీళ్ళలో దాల్చిన చెక్క పొడి వేసి మాగా మరిగించి, వెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. అలా త్రాగితే మంచి ఫలితం ఉంటుంది . ఈ హోం రెమెడీస్ అజీర్ణం నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. మీకు పొట్ట ఉదరంలో నొప్పి ఉండి, వాంతి వచ్చేట్లు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

ఆరెంజ్:

ఆరెంజ్:

ఆరెంజ్ లో చాలా నేచురల్ యాసిడ్స్, ప్రత్యేకంగా సిట్రిక్ యాసిడ్ మరియు ఆస్కోర్బిక్ యాసిడ్ మీ పొట్టను ప్రశాంత పరుస్తుంది . ఆరెంజ్ ను తినడం లేదా తాజాగా తయారుచేసి ఆరెంజ్ జ్యూస్ ను త్రాగడం వల్ల మీ పొట్టలో జీర్ణరసాలా ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది దాంతో మీ జీర్ణక్రియ యొక్క సామర్థ్యం పెరుగుతుంది . కడుపు ఉబ్బరం తగ్గించడానికి పైనాపిల్ జ్యూస్ కూడా ఒక మంచి ఎంపిక.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ లోని యాంటిబయోటిక్ లక్షణాల వల్ల కడుపు ఉబ్బరం మరియు అజీర్తి వంటి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని నీళ్ళులో మిక్స్ చేసి చిన్నగా మద్యమద్యలో గ్యాప్ ఇస్తూ త్రాగాలి. అజీర్తి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక చెంచా తేనె మిక్స్ చేసి, త్రాగాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

Desktop Bottom Promotion