Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
జన్మాష్టమిన ఆకలిలేకుండా, ఉపవాసం ఉండటానికి ఈజీ టిప్స్
శ్రీ కృష్ణ జన్మాష్టమి. శ్రీ కృష్ణుడు మృత ప్రపంచలోకి జన్మించిన పవిత్ర రోజును జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అనేక మంది హిందువులు అర్ధరాత్రి వరకూ ఉపవాసంతో ఉంటారు. జన్మాష్టమి రోజున మీరు ఉపవాసం ఉండటం వల్ల శరీరం యొక్క ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపుతుంది. లార్డ్ క్రిష్ణ అర్ధరాత్రి న పుట్టాడానికి, ఉపవాసం ఉండే వారు, అర్ధరాత్రి 12గంటల సమయంలో ఉపవాస దీక్షలు విరమిస్తుంటారు.
ఇలా ఎక్కువ సమయం ఉపవాసం ఉండే వారికి కోసం కొన్నిసింపుల్ చిట్కాలు అనుసరించినట్లైతే, ఉపవాసం ఉండే వారి యొక్క మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ సామర్థ్యం బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముందుగా ఒక తెలుసుకోవల్సిన మొదటి విషయం ఉపవాసం అనేది చాలా మందికి ఆరోగ్యకరమైనది కాదు. కానీ హిందూ మత గ్రంధముల ప్రకారం, వారంలో లేదా ఇలా పండుగల సమయంలో ఉపవాసం ఉండటం వల్ల అది మీలోని భావాలను నియంత్రణ సాధించడానికి మరియు మీ మానసిక శక్తి పెంచడానికి సహాయపడుతుంది. మీరు కూడా ఈ జన్మాష్టమికి ఉపవాసం ఉండాలని కోరుకుంటున్నట్లైతే, మంచి ఆరోగ్యం కోసం కొన్ని ఆదర్శవంతమైన చిట్కాలను అనుసరించాలి .
మీరు కేవలం బేసిక్ రూల్స్ ను అనుసరించినట్లైతే, జన్మాష్టమి రోజున ఉపవాసం అంత కష్టంగా అనిపించదు. ఉపవాసం సమయంలో మీ శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి మరియు తగినంత శక్తితో ఎనర్జిటిక్ గా ఉండటానికి శ్రద్ద తీసుకోవాలి. ఈ విషయంలో మీరు సరైన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు.

ఎక్కువ నీరు త్రాగాలి:
ఉపవాసం ఉన్నప్పుడు, మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. నీరు మీ పొట్టను నింపడానికి మరియు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను తటస్తం చేయడానికి సహాయపడుతుంది. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు, కనీసం 5-6లీటర్ల నీరు త్రాగాల్సి ఉంటుంది.

ప్రి ఫాస్ట్ మీల్ తీసుకోవాలి:
జన్మాష్టమికి ముందురోజు రాత్రి (అంటే ఉదయం ఉపవాసం ఉంటారు అనంగా) మిడ్ నైట్ స్నాక్స్ లేదా భోజనం చేయాలి. హింధూ మత గ్రంధం ప్రకారం, సూర్యోదయం తర్వాత తిరిగి కొత్త దినం ప్రారంభం అవుతుంది. కాబట్టి, సూర్యోదయానికి ముందు ఏదైనా తినాల్సి ఉంటుంది. లేదంటే ఉదయం మీకు ఎక్కువ ఆకలి కావచ్చు.

ఎనర్జీ:
మీరు ఉపవాసం ఉన్నప్పుడు, మీ శరీరంలో తగినంత శక్తి ఉండదు. కాబట్టి, మీ శరీరాన్నిలిమిట్స్ కు మించి స్ట్రెచ్ చేయకండి. మొట్లు ఎక్కడానికి బదులుగా లిఫ్ట్ లో వెళ్ళండి. అలాగే ఎక్కువ లెగ్ వర్క్ మరియు జిమ్ వంటి వ్యాయామాలను నివారించండి.

వాటర్ కంటెంట్ అధికంగా ఉన్న పండ్లను తీసుకోండి:
జన్మాష్టమికి ఉపవాసం ఉండే వారు, పండ్లను తీసుకోవచ్చు. అందుకు మీరు హై వాటర్ కంటెంట్ ఉన్న పండ్లను తీసుకోవచ్చు . వాటర్ మెలోన్ మరియు మస్క్ మెలోన్ వంటి పండ్లు కడుపు నింపడంతో పాటు, నీటిశాతం వీటిలో ఎక్కువగా ఉంటుంది.

సిట్రస్ పండ్లను నివారించండి:
మీరు ఫాస్టింగ్ ఉన్న రోజున సిట్రస్ పండ్లను తినడం నివారించండి. ఆరెంజ్, నిమ్మ మరియు బెర్రీస్ వంటి వాటిని తినకుండా నివారించాలి. సిట్రస్ పండ్లు పొట్టలో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి మరియు అసిడిక్ రిఫ్లెక్షన్ కు దారితీస్తాయి.

కొబ్బరి బోండాం:
ఉపవాస సమయాల్లో మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా అవసరం. అందుకోసం కొబ్బరి బోండంలోని నీరు చాలా బాగా సహాయపడుతాయి. తగినన్ని శక్తి సామర్థ్యాలను అంధిస్తాయి. అలాగే ఎలక్ట్రోలైట్స్ ను కూడా అందిస్తాయి.

జ్యూస్:
ఉపవాసం ఉన్నవారు పండ్ల రసాలను తీసుకోవచ్చని అనుమతిస్తుంటారు. ఉపవాసం ఉన్న రోజున, రోజు మొత్తానికి 4-5గ్లాసులు పండ్ల రసాలను తీసుకోవడం మంచిది.

ఉపవాస పలహారాలు:
ఉపవాస చేసే వారికి కోసం అల్పాహారాలు వివిద రకాలున్నాయి. ఉపవాసం ఉన్నవారికి సాబుదానా (సగ్గుబియ్యం), పోహా(అటుకులు) మరియు సింగార స్నాక్స్ ను జన్మాష్టమికి ఉపవాసం ఉండే వారు తీసుకోవచ్చు. ముఖ్యంగా, ఈ అల్పాహారాలు జన్మాష్టమి రోజు రాత్రి ఉపవాసం విరమించే సమయంలో తీసుకోవాలి.

మానసిక ఆరోగ్యం:
ఒక రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం అంత సులభం కాదు. కానీ, ఈ విషయంలో సైన్స్ విఫలమైంది , ఆధ్యాత్మికత గెలిచింది. పండుగలకు ప్రార్ధనలు చేయడం వల్ల మీ మైండ్ యొక్క సామర్థ్యంను పెంచడంలో, మీ మెదడును స్ట్రాంగ్ గా ఉంచడానికి అమితంగా సహాయపడుతుంది.

స్మార్ట్ గా ఉపవాసంను విరమించుకోండి:
ఉపవాసం విరమించిన వెంటనే ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఆకలిగా ఉందని ఒకే సారి ఎక్కువ మోతాదులో ఆహారాన్ని పొట్టలోనికి తోసేయకూడదు. అలాగే, డైరీప్రొడక్ట్స్ కూడా కడుపులో యాసిడ్ రిఫ్లెక్షన్ కు గురిచేస్తుంది. అందువల్ల ఉపవాసం విరమించిన తర్వాత నిధానంగా తక్కువ..తక్కువగా రెండు మూడు సార్లుగా బాగా నమిలి తినడం.



Click it and Unblock the Notifications