Latest Updates
-
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.!
డెంగ్యూ మహమ్మారిని గుర్తించే 10 లక్షణాలు
అంటువ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది డెంగ్యూ. ప్రస్తుతం భారతావనిని వణికిస్తోన్న డెంగ్యూ కేసులు రోజురోజుకి డెంగ్యూ కేసులు పెరిగుతున్నాయి. ఎడిస్ ఎజిప్టై దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతోంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ... మరొకరిని కుట్టినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
డెంగ్యూ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తుండటం వల్ల.. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే.. సమస్యను ముందుగానే తెలుసుకుని.. మందులు తీసుకుంటే.. ప్రమాదం నుంచి బయటపడవచ్చు. డెంగ్యూ లక్షణాలు అందరికి ఒకేలా ఉండవు. కాబట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఇంతకీ డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలేంటో ఒకసారి చూద్దాం..

తీవ్రమైన తలనొప్పి
డెంగ్యూ లక్షణాల్లో తలనొప్పి ప్రధాన సమస్య. డెంగ్యూ సోకితే.. ఈ తలనొప్పి కొన్ని సందర్బాల్లో మెదడులో రక్తస్రావానికి దారితీయవచ్చు.

జ్వరం
ఉన్నట్టుండి జ్వరం వస్తున్నట్లైతే.. అది డెంగ్యూకి సంకేతమని గుర్తించాలి. ఒక్కసారిగా.. జ్వర తీవ్రత పెరగడం.. కొన్ని సందర్భాల్లో.. టెంపరేచర్ 1020 F స్థాయికి చేరుతుంది. జ్వరం ఈ స్థాయిలో పెరిగితే.. చాలా కష్టం. కాబట్టి హఠాత్తుగా జ్వర తీవ్రత పెరుగుతున్నట్లైతే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

కీళ్ల నొప్పులు
డెంగ్యూ లక్షణాల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. డెంగ్యూ సోకితే.. కండరాలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం కోసం పారాసెట్మాల్ వంటి పెయిన్ కిల్లర్స్ ను డాక్టర్లు సూచిస్తుంటారు.

డీ హైడ్రేషన్
సాధారణంగా శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అలాంటప్పుడు డెంగ్యూ రోగులకు.. గ్లూకోజ్ వంటివి అందిస్తారు డాక్టర్లు.

రక్తస్రావం
రక్తస్రావం డెంగ్యూ లక్షణాల్లో ప్రాథమికమైనది. డెంగ్యూ వ్యాధి తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు.. కొన్ని సందర్భాల్లో రక్తస్రావం ఎక్కువైతే.. చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితి ఇక్కడి దాకా రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం
డెంగ్యూ వల్ల శరీరంలో ప్లేట్ లెట్లల స్థాయి పడిపోతుంది. డెంగ్యూ లక్షణాల్లో ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం చాలా భయంకరమైనది.

లో బీపీ
ప్లేట్ లెట్స్ స్థాయి తగ్గిపోవడం వల్ల.. లో బీపీకి ప్రమాదముంది. దీనివల్ల శరీరం నిస్సత్తువకు లోనవుతుంది. అంతేకాదు.. కనీసం కూర్చోవడానికి, నిలబడటానికి, నడవటానికి కూడా శరీరం సహకరించదు.

నరాల బలహీనత
డెంగ్యూ వ్యాధి లక్షణాల్లో నరాల బలహీనత కూడా ఒకటి. దీని ప్రభావం మెదడుపై చూపించే అవకాశం ఉంది. అది మెదడులో రక్తస్రావానికి కూడా దారితీయవచ్చు.

చర్మంపై దద్దుర్లు
డెంగ్యూ సోకిందనడానికి చర్మంపై దద్దుర్లు ప్రాథమిక ఆధారం. డెంగ్యూ సోకిన వెంటనే దద్దుర్లు కనిపించవు. రెండో రోజు నుంచి ఐదో రోజు లోపు ఇవి కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వికారం
డెంగ్యూ లక్షణాల్లో ఇది ఒకటి. డెంగ్యూ నివారించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డెంగ్యూ అని గుర్తించి డాక్టర్ ని సంప్రదించి సరైన మందులు తీసుకోవడం మంచిది. సమస్య మొదట్లోని గుర్తించి.. తగిన మందులు వాడితే.. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications