Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మగవారికి ఇబ్బంది కలిగించే 10 ఆరోగ్య సమస్యలు
మగవారికి బయటకి చెప్పుకోలేని కొన్ని ఆరోగ్య సమస్యలుంటాయి.వాటిలో కొన్ని ఆరోగ్య కారణాలవల్ల తలెత్తి వైద్యుడి పర్యవేక్షణ అవసరం ఉన్నవి కావచ్చు మరికొన్ని ఇంట్లో చేసుకుని పాటించే చిట్కా వైద్యాలతో తగ్గేవిగా ఉంటాయి.
మూసుకుపోయిన ధమనులు మీరు శృంగారం లో ఉండగా గుండెల్లో నెప్పి కలిగించి మీ సంతోష సమయాన్ని పాడుచెయ్యవచ్చు లేదా మీ నోటి దుర్వాసన మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవాలనుకున్నప్పుడు అడ్డంకిగా మారవచ్చు.ఇలాంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేస్తాయి.
ఫిట్ గా ఉండే మగవారి యొక్క 10 సీక్రెట్ హ్యాబిట్స్
కారణాలేమైనా కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు మగవారికి నలుగురిలో బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ఒకవేళ ఈ రకమైన సమస్యలకి సరిన సమయం లో చికిత్స అందించకపోతే ఇవి మరింత తీవ్రతరమై మగవారి స్వీయ గౌరవానికి కూడా మచ్చ తెస్తాయి.అందువల్ల ఈ సమస్యలు కనపడిన తక్షణం వాటికి తగిన చికిత్స అందిచడం ద్వారా మరలా మామూలు గా అవ్వవచ్చు.
ఇప్పుడు ఆ ఆరోగ్య సమస్యల గురించి చూద్దాము

తరచూ మూత్ర విసర్జన
వయసు మీద పడుతున్న కొద్దీ ప్రొస్ట్రేటు గ్రంధి వ్యాకోచించే అవకాశాలెక్కువ. దీని వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు.మీరు కనుక మీ భాగస్వామితో డేటింగ్ కి వెళ్ళిబప్పుడు తరచూ మూత్ర విసర్జన చేయాల్సొస్తే నిజంగా ఇబ్బందికరమైన విషయమే.వెంటనే వైద్యుడిని సంప్రదించి ఈ సమస్య కి చికిత్స అందేలా చూసుకోండి.

అంగం స్తంభించకపోవడం
ఇది మగవారికి అత్యంత ఇబ్బంది కలిగించే సమస్య. మీరు మీ భాగస్వామితో కలిసి బెడ్ రూం లో ఉండగా అంగం స్తంభించకపోతే మీరు అత్యంత ఇబ్బంది కర పరిస్థితిని ఎదుర్కొంటారు.వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీకు లోపల ధమనులు మూసుకుపోవడం లేదా డయాబెటీస్ లేలాంటి సమస్యలు వు అని ముందు నిర్ధారించుకోవడానికే వైద్యుడిని కలవమని చెప్పేది.

శీఘ్ర స్ఖలనం
ఈ సమస్య మగవారి ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీస్తుంది.ఆందోళన ,ఒత్తిడి తదితర కారణాలవల్ల కూడా ఈ సమస్య ఏర్పడచ్చు. శీఘ్రస్ఖలనాన్ని చికిత్స లేకుండా మాయం చేస్తామన్న బురిడీ మాటలకి మోసపోకుండా ఒక థెరపిస్ట్ ని కలిసి దీనికి చికిత్స తీసుకోండి.

హాలిటోటిస్ లేదా ఊపిరి దుర్వాసన
మగవారు తమ భాగస్వామికి దగ్గరగా జరిగి ఊసులాడుదామనుకున్నప్పుడు లేదా ఆమె ని ముద్దు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఊపిరి నుండోచ్చే దుర్వాసన చాలా ఇబ్బందికి గురి చేస్తుంది.ఈ దుర్వాసన మీరు తీసుకునే ఆహారం వల్ల లేదా మీరు మీ దంతాలని సరిగ్గా శుభ్రపరచుకోకపోవడం వల్ల కావచ్చు.దంత వైద్యుడిని కలిసి దీనికి నివారణ అడగండి.

పిరుదులమీద వచ్చే ఆక్నే
మీకు కనుక పిరుదుల మీద ఆక్నే సమస్య ఉంటే ఆమె ముందు మీరు బట్టలని పూర్తిగా తొలగించలేరు.ఇది చర్మ సమస్య. దీనికి హోం రెమెడీస్ లేదా చర్మ వ్యాధి నిపుణుడు సూచించిన క్రీములని వాడి నివారించవచ్చు

ఆపాన వాయువు విడుదల
మీకు జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఉబ్బరం ఉంటే ఆపాన వాయువు విడుదలవుతుంటుంది.కానీ మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఈ సమస్య మీరు సిగ్గు పడేటట్లు చేస్తుంది.

బీర్ బెల్లీ
మీకున్న బీర్ బెల్లీ ని తాగ్గించుకోవాలంటే వెంటనే బీరు మరియు జంక్ ఫుడ్ ని మానెయ్యండి.అవి మానెయ్యగానే సరిపోదు, మీరు తీసుకునే క్యాలరీలని తగ్గించి వ్యాయామం కూడా చేస్తేనే ఫలితం.

అంగం మీద దురద
ఫంగల్ ఇన్ ఫెక్షన్ వల్ల మీకు అంగం మీద దురద పెడుతుంది. మీ భాగస్వామి తో కలిసి ఉన్నప్పుడు ఇది మరింత ఇబ్బందికరం.మీకు ఈ సమస్య ఉంటే కనుక డేట్ కి వెళ్ళే ముందు వైదుడిని సంప్రదించి యాంటీ ఫంగల్ క్రీం ని అక్కడ రాయండి.

నపుంసకత్వం
అంగం స్తంభించకపోవడం మరియు నపుంసకత్వం రెండూ వేరు వేరు.మీలో వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండి మీ భాగస్వామిని గర్భవతిని చెయ్యలేకపోతే మీకు నపుంసకత్వం ఉన్నట్లే.వైద్యుడిని సంప్రదిస్తే ఈ సమస్య కి తగిన సూచనలివ్వగలరు

రీర దుర్వాసన
మీ శరీరం నుండి దుర్వాసన వస్తోంటే మీ భాగస్వామిని హత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.చెమట పట్టకుండా డియోడరెంట్ల లాంటివి లేదా పెర్ఫ్యూం లు అప్పటికప్పుడు సమస్య ని తగ్గిస్తాయేమో కానీ అసలు కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడి సలహా చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications