Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ ఒంట్లో ఇనుము తగ్గిందా ఇక అంతే సంగతులు....
నీరసం ఎక్కువవుతుంటే శరీరంలో ఇనుము తగ్గిపోయిందేమో.. రక్తం తగ్గిందేమో... అని అనుకోవడం సహజమే. ఎక్కువ మందిలో ముఖ్యంగా చిన్నారులు, మహిళల్లో కనిపించే పోషకాహార లోపం ఇది. ఇనుము లోపిస్తే శరీరంలో రక్తం కూడా తక్కువైనట్టే.
ఎందుకంటే శరీరానికంతటికీ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఇనుము అవసరం అవుతుంది. ఇనుము తగ్గిందని చెప్పడానికి నీరసం ఒకటే కాదు.. రకరకాల హెచ్చరికలు కనిపిస్తాయి.

తీవ్రమైన అలసట :
అతి సాధారణంగా కనబడే లక్షణం అలసట, నీరసం. మహిళల్లో దీన్ని గుర్తించడం కొంచెం కష్టమే. ఇల్లు, ఆఫీసు పనులతో సతమతమయ్యే మహిళల్లో అలసట ఎక్కువే. కాబట్టి చాలా సందర్భాల్లో అలసట మామూలే అనుకుంటారు. ఐరన్ లోపించడం వల్ల శరీరం తీవ్రమైన అలసటకు గురి అవుతాయి. అయితే మామూలు అలసటతో పాటు చిరాకు, ఏకాగ్రత తగ్గిపోవడం, బలహీనంగా అనిపించడం కూడా ఉంటే ఇనుము లోపించిందేమోనని అనుమానించాలి.

శ్వాస సంబంధిత సమస్యలు :
రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు ఎంత గట్టిగా శ్వాస తీసుకున్నా సరిపోయినట్టుగా అనిపించదు. మెట్లు ఎక్కడం, నడవడం వంటి పనుల్లో ఆయాసంగా, ఊపిరాడనట్టుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ను కలిసి ఫెరిటిన్ టెస్ట్ ను చేయించుకోవడం వల్ల ఐరన్ డిఫిషియన్సీని కనుగొనవచ్చు.

పీరియడ్స్ ఎక్కువ అవ్వడం వల్ల:
మహిళల్లో పీరియడ్స్ నెలకు ఒకటికి రెండు సార్లు ఉండటం వల్ల ఐరన్ ను ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది. లేదా పీరియడ్స్ లో ఎక్కువ బ్లడ్ పోతున్నట్లైతే గైనిక్ డాక్టర్ ను సంప్రదించాలి.

రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ :
పడుకునేటప్పుడు రాత్రంతా అదేపనిగా కాళ్లు కదిలిస్తూ ఉంటారు. గోకుతూ ఉంటారు. దీన్నే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. ఇది ఐరన్ లోపానికి సంకేతం కావొచ్చు. ఇలాంటివారిలో దాదాపు 15 శాతం మందిలో ఇనుము లోపం ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతే కాదు కండరాలు పట్టేసినట్లు అనిపించడం మరియు మజిల్ క్రాంప్స్ ఉంటాయి. జిమ్ లో వర్కౌట్ వల్ల వచ్చే నొప్పులు కూడా ఐరన్ లోపం వల్ల త్వరగా నొప్పులు తగ్గవు.

తలనొప్పి :
ఇనుము లోపించినవాళ్లలో శరీరం మిగిలిన కణజాలాల కన్నా ముందుగా మెదడుకు ఆక్సిజన్ అందేట్టుగా చేస్తుంది. అయినప్పటికీ ఆక్సిజన్ మెదడుకు సరిపోదు. తద్వారా మెదడులోని రక్తనాళాలు వాచిపోయి, తలనొప్పి వస్తుంది.

జుత్తు రాలిపోవడం :
ఇనుము లోపం తీవ్రంగా ఉండి, రక్తహీనత ఉంటే జుత్తు రాలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం కీలక అవయవాలకు ఎక్కువ ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో జుత్తుకు తగినంత ఆక్సిజన్ అందక రాలిపోతుంది.

ఆందోళన :
నాడీవ్యవస్థకు తగు మోతాదులో ఆక్సిజన్ అందకపోవడం వల్ల అది మరింత చురుగ్గా పనిచేస్తుంది. అందువల్ల గుండె వేగం పెరుగుతుంది. ఫలితంగా అనవసర ఆందోళన పెరుగుతుంది. చిన్న విషయాలకే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు.

మట్టి తింటున్నారా, చాక్ పీస్, ఐస్ తినాలనిపిస్తున్నదా? :
ఆహార పదార్థాలు కానివాటిని అంటే మట్టి, చాక్‌పీసులు, బలపాలు, కాగితాల లాంటివి తింటున్నారంటే అది ఇనుము లోపించిందనడానికి సంకేతం.

ముఖం పాలిపోవడం :
రక్తానికి ఎరుపు రంగునిచ్చే హిమోగ్లోబిన్ మోతాదు తగ్గిపోతుంది కాబట్టి చర్మం కూడా మెరుపు కోల్పోతుంది. పాలిపోయి కనిపిస్తుంది. పెదవులు, చిగుళ్లు, కనురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గుతుంది.

హైపోథైరాయిడిజమ్ :
ఇనుము లోపం వల్ల థైరాయిడ్ పనితీరు దెబ్బతింటుంది. హైపోథైరాయిడిజమ్ ఉన్న ప్రతి 10 మందిలో 6గురిలో ఇనుము లోపం ఉందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి త్వరగా అలసిపోవడం, బరువు పెరగడం, శరీరం చల్లగా అనిపించడం లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.



Click it and Unblock the Notifications