Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నీటి శాతం అధికంగా ఉండే హెల్తీ అండ్ ఎనర్జిటిక్ ఫుడ్స్
సాధారణంగా మన శరీరానికి అవసరం అయ్యేన్ని నీరు త్రాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నీరు ఎక్కువగా త్రాగలేని వారు, నీటికి ప్రత్యామ్యాయంగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకొన్నప్పుడు, మన చర్మం మెరుస్తుంటుంది మరియు మలబద్దకం మరియు అజీర్తి వంటి జీర్ణ సమస్యలన్నీ నివారించబడుతాయి.
మరీ ముఖ్యంగా, పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్స్ కూడా చెప్పలేనన్ని ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇవి శరీరానికి ఎనర్జీని అందించి ఆరోగ్యంగా ఉంచడటానికి ఎంతో సహాయం చేస్తాయి.
READ MORE: వేసవి కాలంలో ఈ ఆహారాలను దూరం చేసుకోకండి...!
ముఖ్యంగా వేసవి సీజన్ లో, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అన్ని రకాలుగా శ్రేయస్కరం. మరి ఇంకెదుకు ఆలస్యం, వాటర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ను ఈక్రింది స్లైడ్ లో ఇస్తున్నాము వీటి గురించి తెలుసుకొని, రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.....
READ MORE: శరీరంలో కొవ్వు కరిగించి.. పొట్టతగ్గించుకొనేందు పరిష్కార మార్గం..!

వాటర్ మెలోన్:
వాటర్ శాతం అత్యధికంగా ఉండే ఒక ఆరోగ్యకరమైన ఆహారం నీళ్ళు. పుచ్చకాయలో క్యాలరీలు తక్కువ అందువల్ల, ఇది ఒక బెస్ట్ వెయిట్ లాస్ ఫ్రూట్ గా రెగ్యులర్ డైట్ లో నిరభ్యరంతరంగా చేర్చుకోవచ్చు.

నిమ్మరసం
నిమ్మరసం మరో వారట్ రిచ్ ఫుడ్. దీన్ని వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సి. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడంతో పాటు, శరీరాన్ని చల్లబరడిచి బరువును తగ్గించడంలో కూడా గ్రేట్ గా పనిచేస్తుంది

కొబ్బరి నీళ్ళు
నీటిశాతం అత్యధికంగా ఉన్న ఆహారపానీయాల్లో కోకనట్ ఒకటి. ఈ సమ్మర్ సీజన్ లో కోకనట్ వాటర్ ను తప్పనిసరిగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

కీరదోసకాయ
వాటర్ కంటెంట్ అత్యధికంగా ఉండే మరో వెజ్ ఫ్రూట్ కీరదోసకాయ. వీటిని సలాడ్ రూపంలో భోజనంలో చేర్చుకోవడం వల్ల ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు

సెరెల్స్
సెరెల్స్ మరో వెజ్ ఫుడ్. ఇందులో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఈ వాటర్ కంటెంట్ ఫుడ్స్ మీ పొట్టను నింపుతాయి. వీటిని సలాడ్స్ మరియు లీన్ మీట్ తో కలిపి తీసుకోవచ్చు.

టమోటోలు
టమోటోలు మెటబాలిజంను పెంచడంలో చాలా మంచిది . ఇది క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

ముల్లంగి
ముల్లంగిలో 90శాతం నీరు ఉంటుంది. వీటిని భోజనంలో తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . అదేవిధంగా, ఇది గ్యాస్ కు కారణం అవుతుంది కాబట్టి, వీటిని మితంగా తీసుకోవాలి

గ్రీన్ క్యాప్సికమ్
గ్రీన్ క్యాప్సికమ్ మరో హెల్తీ వాటర్ రిచ్ ఫుడ్. గ్రీన్ క్యాప్సికమ్ ను కర్రీస్ లో జోడించి తీసుకోవడం వల్ల వంటలకు మరింత టేస్ట్ వస్తుంది.

కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ లో 80శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది హెల్తీ వాటర్ కంటెంట్ ఫుడ్ కాబట్టి, సమ్మర్లో తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది.

ఆకుకూరలు
ఆకుకూరలు లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అంతే కాదు, కూరల్లో విటమిన్ కె మరియు ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల ఇవి మీకు అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తాయి.

స్ట్రాబెర్రీస్
లవ్లీ రెడ్ జ్యూసీ ఫ్రూట్ స్ట్రాబెర్రీ. అత్యధిక న్యూట్రీషియన్స్ కలిగినటువంటి పండ్లు. ఈ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల వేసవి సీజన్ లో శరీరంను హైడ్రేట్ చేస్తుంది.

బ్రొకోలీ
బ్రొకోలీలో వాటర్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. ఈ బిట్టర్ వెజిటేబుల్ శరీరంలోని టాక్సిన్స్ ఫ్లష్ చేయడానికి మరియు హైడ్రేషన్ లో ఉంచడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











