Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
కాలేయంను శుభ్రపరిచే 14 ఎఫెక్టివ్ హోం రెమెడీస్
కాలేయం మన శరీర జీవక్రియల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన ఉదరభాగంలో కుడివైపున ఉంటుంది. జబ్బు పడినా కూడా తనను తాను బాగు చేసుకోగలదు, శరీరానికి కావల్సిన శక్తిని తయారు చేయగలదు, జీర్ణక్షికియలో అత్యంత కీలకపాత్ర నిర్వర్తించే అవయవం, శరీరంలోని అతి పెద్ద గ్రంథి. మూడువంతుల వరకు పాడైపోయినా తిరిగి దానంతట అదే బాగుపడగలదు. పావువంతు అవయవం బావున్నా సరే తనని తాను తిరిగి నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవమే కాలేయం. శరీరంలో పెద్ద గ్రంథి మాత్రమే కాదు, బరువైన అవయవం కూడా కాలేయమే. తిరిగి ఏర్పడే అవకాశం ఉన్న అవయవం కూడా ఇదొక్కటే. దీని సుగుణాలే ఒక్కోసారి దానికి ప్రమాదకరంగా మారుతాయి. ఎందుకంటే పూర్తిగా పాడై పొయ్యే దాకా ఎటువంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. అప్పుడు పరిస్థితులు ప్రాణాంతకం కావచ్చు కూడా. ఇది కుడి పక్క పక్కటెముకలలో కొద్దిగా కిందివైపు ఉంటుంది. ఒకటి పేగుల నుంచి వచ్చే పోర్టల్ రక్తనాళం ద్వారా మరోటి 20 హెపాటిక్ ఆర్టరీ ద్వారా దీనికి రెండు చోట్ల నుంచి రక్త సరఫరా జరుగుతుంది.
కాలేయం... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.
మరి ఇన్ని కీలకమైన బాధ్యతలు నిర్వహించే అతి పెద్ద అవయం శుభ్రంగా లేకపోతే ఎలా. ప్రస్తుత కాలంలో ఆహారం ద్వారా, నీరు, గాలి, ద్వారా లివర్ కలుషితమైన కాలేయానికి ఎక్కువ పనిపెడుతున్నది. కాబట్టి, కాలేయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి. లివర్ ను క్లీన్ చేసి, ఆరోగ్యాంగా ఉంచడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఈక్రింది విధంగా ఉన్నాయి..

వెల్లుల్లి:
వెల్లుల్లిలో సెలీనియం మరియు అల్లిసిన్ అధికంగా ఉంటుంది. వెల్లుల్లి ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. దీన్ని నేరుగా వేయించకూడదు.

ఆపిల్స్ :
ఆపిల్స్ ఉండే పెక్టిన్, గ్రీన్ లీఫ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరియు ప్రేగుల్లో టాక్సిన్స్ (వ్యర్థాల)ను తొలగిస్తుంది. అది కాలేయానికి రక్షణ కల్పిస్తుంది. ఎప్పుడైతే హెల్తీ డైజెస్టివ్ ట్రాక్ ఉంటుందో, అప్పుడు కాలేయాన్ని శుభ్రం చేయడం సులభం అవుతుంది.

తృణధాన్యాలు:
తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. కాలేయంను శుభ్రం చేయడంలో చాలా ఉత్తమ ఆహారం ఇది.

బెర్రీస్ :
బెర్రీస్ లో హెల్తీ నేచురల్ న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ మరియు పూర్తిగా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో ఆర్గానిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి . ఇవి లివర్ క్లీనింగ్ కు చాలా బాగా సహాయపడుతాయి. లివర్ శుభ్రం చేయడంలో ఇవి చాలా బెస్ట్ ఫుడ్స్ అని చెప్పవచ్చు.

ద్రాక్ష:
ద్రాక్షలో ఎక్కువగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ప్రతి ఒక్కటీ కాలేయంలో నిలిచే ఫ్యాట్ ఫుడ్స్ ను డిటాక్సిఫై చేస్తుంది.

వాల్ నట్స్:
కాలెయానికి అమ్మోనియా ద్వారా టాక్సిఫైడ్ చేరుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఆర్జినైన్ ఆమ్లం అమ్మోనియా కణాలను విచ్చిన్న చేసి, కాలేయాన్ని శుభ్రం ఉంచుతుంది.

గ్రీన్ టీ:
లివర్ సమస్యలకు అద్భుతమైనటువంటి రెమెడీ గ్రీన్ టీ. గ్రీన్ టీలో అధిక శాతంలో క్యాటచిన్స్ కలిగి ఉండి, లివర్ ఫంక్షన్స్ కు సహాయపడుతుంది . ప్రతి రోజూ రెండు మూడు కప్పుల గ్రీన్ టీ త్రాగడం వల్ల లివర్ సమస్యనుండి కాలేయాన్ని రక్షణ కల్పించబడుతుంది.ముఖ్యంగా ఇందులోని 'ఇజీసీజి','కాటెచిన్స్' అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్ తగ్గుతాయి. అందుకు యాంటీ ఆక్సిడేటివ్, యాంటి ప్రొలిఫరేటివ్ గుణాలే కారణం. రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.

అవొకాడో:
కాలేయ వ్యాధులను నుండి కాలేయానికి రక్షణ కల్పించాలంటే మీ రెగ్యులర్ డైట్ లో అవొకాడో మరియు నట్స్ ను చేర్చుకోవాలి. ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో శాచ్యురేటెడ్ కొవ్వుపదార్థాలున్నాయి. దీనిలో ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్దించడానికి బాగా సహాయ పడుతుంది. అవొకాడో మరియు వాల్ నట్స్ లో ఉండే గ్లూటాథైయాన్ కాలేయంని టాక్సిన్స్ ను శుభ్రం చేసి కాలేయంను శుభ్రం చేస్తుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కు ఉంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. కాలేయానికి ముఖ్యంగా కాకరకాయ, ఆకుకూరలు, క్యాబేజి వంటి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి.

అన్ రిఫైండ్ ఆయిల్స్:
ఆర్గానిక్ ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ లేదా హెప్ సీడ్ ఆయిల్స్ టాక్సిన్స్ ను నివారిస్తాయి మరియు లివర్ లోని టాక్సిన్స్ నివారించడానికి సహాయపడుతాయి. అంతే కాదు, ఇవి లిపిడ్ ప్రొడక్ట్స్ ను పెంచుతుంది. ఇది శరీరంలో నిల్వచేరిన టాక్సిన్స్ ను నివారిస్తుంది.

పసుపు:
పసుపు, కాలేయానికి సంబంధించిన హానికర టాక్సిన్స్ మరియు కార్సినోజెనిక్ ను నివారించడానికి సహాయపడుతుంది . టాక్సిన్ కు సంబంధించిన అంశాలను కాలేయం నుండి తొలగించడానికి కొన్ని ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో పసుపు చేర్చడం వల్ల ఇది చాలా త్వరగా, సులభంగా మరియు ఎఫెక్టివ్ గా కాలేయంను శుభ్రం చేస్తుంది.

బీట్ రూట్ మరియు క్యారెట్స్ :
ఈ దుంపల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ కాలేయం చురుకుగా పనిచేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ రెండు వెజిటేబుల్స్ లివర్ క్లీనింగ్ లో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

నిమ్మరసం:
మీరు రెగ్యులర్ గా తగినంత నీరు తీసుకుంటుంటే, అందులో కొద్దిగా నిమ్మరసం చేర్చి తీసుకోవడం వల్ల, అది మీకు నచ్చిన ఫ్లేవర్ జోడించడంతోపాటు, ప్రేగు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతాయి. ఇది కాలేయంలోని టాక్సిన్స్ చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

నీళ్ళు:
లివర్ ను శుభ్రం చేయడానికి ఇది ఒక నేచురల్ హోం రెమెడీ. శరీరంలో అన్ని అవయవాలు చురుకుగా పనిచేయడానికి నీళ్ళు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఎక్కువగా నీళ్ళు తీసుకోవడం వల్ల కణాలు చాలా త్వరగా పునరుత్పత్తి అవ్వడానికి సహాయపడుతాయి మరియు శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను సరఫరా చేస్తాయి.



Click it and Unblock the Notifications











