Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నిద్రమాత్రల వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు
ప్రస్తుత రోజుల్లో చాల మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్యగా మారినది. ఎప్పుడైతే మీరు సరిగా రెస్ట్ తీసుకోకపోతే, మీ శరీరం ఎక్కువ ఒత్తిడికి గురి అవుతుంది. దాంతో నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు చాలా మంది చేసే ప్రధానమైన పరిష్కార మార్గం నిద్రమాత్రలకు అలవాటు పడటం! నిద్ర పోవాలంటే, కొంతమంది నిద్రమాత్రలు వేసుకోకుండా నిద్రపోలేరు. ఈ మాత్రలు తాత్కాలికంగా మీకు నిద్ర పట్టించినప్పటికి శరీరానికి హాని చేస్తాయి.
READ MORE: బాగా నిద్రపోవాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే
నిద్రమాత్రలు తాత్కాలిక పరిష్కార మార్గం. అనారోగ్యం రిత్యా డాక్టర్ సలహా మేరకు నిద్రమాత్రలు తీసుకుంటే పర్వాలేదు కానీ, వ్యక్తిగతంగా తమంతట తాము తీసుకోకూడదు. నిద్రమాత్ర విషయంలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకూడదు. నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకొనే కొద్ది శరీరంలో దుష్ప్రభావాలు ఎక్కువ అవుతాయి.
READ MORE: నిద్ర గురించి మీకు తెలియని 12 వాస్తవాలు
మరి నిద్రమాత్రలు తినడం వల్ల ఎదురయ్యే ఆ దుష్ప్రభావాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా చూద్దాం...

నిద్రమాత్రలు ఎక్కువైతే:
దీర్ఘకాలం నుండి నిద్రమాత్రలు తరచూ తీసుకుంటుంటే, దాని అవశ్యం మరింత పెరుగుతుంది . కాబట్టి ప్రతి సారి ఎక్కువ మోతాదులో తీసుకోవల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాత్రతలు ఒక వారంకు మంచి ఎక్కువగా తీసుకోకూడదు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి.

నిద్రమాత్రలు తినడం నిధానంగా మానుకోవాలి:
నిద్రమాత్రలు తినడం వల్ల ఇవి నిధానంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. ఈ నిద్రమాత్రల ప్రభావం మార్నింగ్ వరకూ ఉన్నట్లైతే అది దినచర్య మీద ప్రభావం చూపుతుంది. దాంతో మీ జీవితం ప్రమాధంలో పడుతుంది.

ప్రవర్తనలో మార్పులు:
నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాధకరమైన ఆమ్నీషియా జబ్బుకు దారితీస్తుంది. కాబట్టి, మీరు తీసుకొనే మాత్రల్లో మార్పుతు తీసుకోవల్సి ఉంటుంది.

పడిపోవడం:
స్లీపింగ్ పిల్స్ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ కళ్ళు తిరగడం మరియు పడి పోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో వెంటనే హాస్పిటల్లో చేర్చకపోతే చాలా ప్రమాధం జరగుతుంది.

కోమా లేదా మరణం:
నిద్రమాత్రలు తినడం వల్ల మోతాదు ఎక్కువైతే కోమాలోని వెళ్ళడం లేదా మరణం పొందవచ్చు. నిద్రమాత్రల వల్ల శ్వాసలో ఇబ్బందులు కలుగుతాయి. దాంతో ప్రాణాంతక ప్రమాదంగా మారుతుంది.

క్యాన్సర్:
నిద్రమాత్రలు ఎక్కువ రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటుంటే క్యాన్సర్ కు దారి తీస్తుందని కొన్ని పరిశోధన ద్వారా తెలిసింది . కాబట్టి, నిద్రలేమి సమస్యను నివారించుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

ఆస్తమా
నిద్ర మాత్రలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి. గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. ఆస్తమా రోగులకు ఈ మందులు అసలు మంచివి కావు. కనుక వీరు నిద్రమాత్రలు తీసుకోరాదు.

ఆకలిని చంపేస్తాయి
నిద్రమాత్రలు మీ ఆకలిని చంపేస్తాయి. జీవక్రియ మందగిస్తుంది.

ఆల్కహాల్ తో ప్రమాదకరం
కొంతమంది నిద్రమాత్రలు ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటారు. ఇది ప్రమాదకరం. మరణానికి దోవతీస్తుంది కూడాను. ద్రాక్షరసంతో కూడా కలిపి తీసుకోకండి.

కలలు
నిద్రపోయినప్పటికి అసాధారణ కలలు వస్తాయి.

తలనొప్పి
నిద్రమాత్రలు, మత్తు కలిగించి, ఉదయమే తలనొప్పి, అలసట, దాహం, బలహీనం, చూపు మందగించటం చేస్తాయి.



Click it and Unblock the Notifications