Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మిరియాల వల్ల కగలిగే 7 ప్రమాధకర దుష్ప్రభావాలు
ఆమ్లెట్, పస్తా లేదా వెజిటబుల్ సూప్ మీరు తాగేది, తినేది ఏ ఆహారమైనప్పటికి నల్లని మిరియాలు వేస్తే రుచి మరింత పెరుగుతుంది. చాలామందికి తెలిసినదానికంటే కూడా నల్లని మిరియాల ప్రయోజనం ఎంతో ఎక్కువ. వంటలలోరుచికి, ఘాటుకు ఉపయోగించటమే కాదు, టేబుల్ పై పెట్టుకొని ఆహారాలలో అదనపు రుచికి చల్లుకొని కూడా తింటారు. కారపు విందులకు పుట్టినిల్లుగా పేర్కొనబడే భారతదేశం, నల్ల మిరియాలను ఆహార పదార్థాలలో సాధారణంగా వాడే ఔషదంగా చెప్పవచ్చు. నల్ల మిరియాలను ఆహరంలో వినియోగించటమే కాకుండా, భారతదేశంలో ఈ ఔషదాన్ని విరేచనాలు వంటి వ్యాధులను తగ్గించుటకు గానూ మరియు ఆయుర్వేద ఔషదాల తయారీ (త్రికుటా) కూడా వాడుతున్నారు.
అయితే నల్ల మరియాలతో ఎంత లాభాలున్నాయో అంతే దుష్ర్పభావాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, నల్ల మిరియాలను వాడెంత స్థాయిలో మాత్రమె వాడాలి, అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలను కలుగ చేస్తుంది. నల్ల మిరియాలను ఎక్కువగా వాడటం వలన కలిగే నష్టాల గురించి ఇక్కడ తెలుపబడింది.

1. ప్రాణానికే ప్రమాదం
నోటి ద్వారా అధిక మొత్తంలో నల్ల మిరియాలను తీసుకుంటే, అవి ఊపిరితిత్తులలో చేరే అవకాశం ఉంది. ఈ విధంగా మిరియాలు ఊపిరితిత్తులలో చేరటం వలన మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఇది జరగవచ్చు

2. చర్మం ఎర్రగా మారటం
పెద్దలలో చాలా మంది, శరీర చర్మానికి నల్ల మియాలను నేరుగా వాడటం సురక్షితం అనే చెప్పాలి. కానీ కొన్ని సార్లు, నున్నితమైన చర్మం కలిగి ఉన్న వారి చర్మం ఎర్రగా మారే అవకాశం ఉంది మరియు చర్మంపై మంటలను కలుగ చేస్తుంది.

3. స్రావాలు
సాధారణ స్థాయిలో వీటిని తీసుకున్నపుడు, గర్భవతులలో ఎలాంటి సమస్యలను కలుగ చేయదు. కానీ, గర్భవతులు, అధిక మొత్తంలో వీటి సేకరణ సురక్షితం కాదనే చెప్పాలి. గర్భవతులలో స్రావాలను కలుగచేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, గర్భ సమయంలో, నల్ల మిరియాలను చర్మానికి నేరుగా వాడటం మంచిది కాదనే చెప్పాలి.

4. జీర్ణకోశ ప్రతికూల ప్రభావాలు
నల్ల మిరియాలతో చేసిన ఔషదాలను నోటి ద్వారా తీసుకోవటం వలన కడుపులో కలతలను లేదా జీర్ణాశయంలో ప్రతికూల ప్రభావాలను కలుగచేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. జీర్ణాశయంలో సమస్యలతో సతమతం అయ్యే వారు తక్కువ మోతాదులో నల్ల మిరియాలను తీసుకోవటం చాలా మంచిది.

5. కోలన్ క్యాన్సర్
నల్ల మిరియాలు మరియు అజీర్ణం, శ్వాసకోశ లేదా అన్నవాహిక క్యాన్సర్ మధ్య సంబంధం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. వీటి మధ్య గల సంబంధం గురించి వివాదాస్పదంగా మారింది.

6.మందుల వాడకంలో జాగ్రత్తలు
నల్ల మిరియాలు యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు నొప్పు నివారణ గుణాలను కలిగి ఉంటాయి. కావున ఇవే గుణాలను కలిగిన అల్లోపతి మందులు వాడినపుడు, వీటిని వాడటం మంచిది కాదు

7.మూలికల వాడకంలో జాగ్రత్త
నల్ల మిరియాలను వాడేటపుడు చాలా జాగ్రత్తలను తీసుకోవాలి, మూలికలను వాడేటపుడు లేదా ఉపభాగాలను వాడేటపుడు, నల మిరియాలను కూడా వాడటం వలన శరీరంలో ఇతర ఏజెంట్లు యొక్క రవాణా సమయంలో మార్పులు జరిగి, ఈ ఏజెంట్లు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications