Latest Updates
-
ఇంట్లో ఫోన్ చెక్ చేస్తున్నారా? డిజిటల్ నిఘాతో కుటుంబ బంధాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయో తెలుసా? -
ఎండల దెబ్బకు పీరియడ్స్ ఆలస్యమవుతున్నాయా? మహిళలు అస్సలు మిస్ అవ్వకూడని హెచ్చరికలు! -
విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు! భార్యలకు ఊరటనిచ్చే సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇదే -
గర్భిణీలు ఈ తప్పులు చేస్తున్నారా? మీ బిడ్డ ఆరోగ్యం కోసం ఇవి తెలుసుకోండి! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఉదయాన్నే ఈ ప్రోటీన్ రిచ్ పరాఠా ట్రై చేయండి..సొరకాయ రైతాతో కేక! -
ఈ రాశుల వారికి ఈరోజు ధనయోగం.. ఆదాయం పెరగడమే కాదు అదృష్టం కూడా తోడవుతుంది! -
హ్యాపీ హనుమాన్ జయంతి..మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
వైధృతి యోగం ఎఫెక్ట్.. ఈరోజు హైదరాబాద్, విజయవాడ వాసులు ఈ తప్పులు అస్సలు చేయకండి! -
హనుమాన్ దీక్ష విరమణ చేస్తున్నారా? స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలు, ముహూర్తాలు తప్పక పాటించండి! -
చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఉందా?
మన డైలీ హ్యాబిట్సే మన దంతాలకు హాని కలిగిస్తాయి...
మన దినచర్యంలో కొన్ని పనులు తప్పనిసరిగా చేసుకోవల్సి ఉంటుంది. మన దినచర్యలో మనం చేసే కొన్ని పనుల్లో కొన్ని అలవాట్లు మన దంతాలను నాశనం చేస్తాయి. స్మోకింగ్ మరియు ఆల్కహాల్ త్రాగడం వల్లే దంతాలు పాడవుతాయని చాలా మంది అభిప్రాయం...ఆలోచన.
ఇవి మాత్రమే కాదు, మరికొన్ని ఇతర అలవాట్లు కూడా మన దంతాల మీద పరోక్షంగా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు కొన్ని సోడా వంటి ప్యాక్డ్ టిన్స్, లేదా బాటిల్స్ యొక్క లిడ్స్(మూతల)ను ఓపెన్ చేయడం వల్ల కూడా దంతాలు పాడవుతాయి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేశారు ? మరి అయితే మీ దంతాలకు తగిన సంరక్షణ కల్పించడం లేదన్న విషయాన్ని గ్రహించండి.
READ MORE: దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే 20 చిట్కాలు
మరో చెడు అలవాటు షుగర్స్ ఎక్కువగా ఉండే క్యాండీస్ ను తినడం వల్ల అవి నేరుగా మన దంతాల మీద ఎక్కువ హానికరమైన ప్రభావంను చూపుతాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ కొన్ని యాసిడ్స్ ను విడుదల చేయడం వల్ల దంతాలకు హాని జరుగుతంది.
READ MORE: పసుపు రంగు దంతాలు తెల్లగా మార్చే సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్
నిజానికి, మీరు హెల్తీ లైఫ్ స్టైల్ మరియు న్యూ డైట్ ను ప్లాన్ చేసుకొన్నప్పుడు, మీ దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాకాకుండా మీరు దంత సంరక్షణలో నిర్లక్ష్య దోరణి కలిగి ఉన్నట్లైతే నోటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
READ MORE: జ్ఞానదంతాల నొప్పి నివారించేందుకు కొన్ని ఉత్తమ చిట్కాలు
రోజువారి మీరు చేసే పనుల్లో దంతాల మీద ప్రభావం చూపేది షుగర్ ఫుడ్సే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. షుగర్స్ దంతాలను నాశనం చేస్తుంది. షుగర్స్ క్యాండీస్ లేదా ఆహారపదార్థాలు తిన్నప్పుడు అవి దంతాల మీద అలాగే ఎక్కువ సమయం ఉండటం వల్ల దంతక్షయానికి దారితీస్తుంది.

షుగర్ ఫుడ్స్ :
దంతాల ఆరోగ్యంలో షుగర్ ఫుడ్స్ జోక్యం చేసుకుంటాయి. నోట్లో ఉండే బ్యాక్టీరియా షుగర్స్ ను ఎంజాయ్ చేస్తాయి మరియు ఫలితంగా దంతక్షయాన్ని మీకు గిఫ్ట్ గా అందిస్తాయి . షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతక్షయానికి దారితీస్తుంది.

ఐస్ క్యూబ్ కొరకడం వల్ల:
ఫ్రిజ్ లో నుండి ఐస్ ను బయటకు తీసిన వెంటనే ముని పళ్ళతో కొరకడం వల్ల కూడా దంతాల నొప్పి ఉంటుంది.

జ్యూసులు:
జ్యూసులు. జ్యూసుల్లో కూడా పంచదార వాడకం వల్ల దంతాల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఫ్రెష్ జ్యూసులకు షుగర్స్ వినియోగించకుండా జ్యూసులు త్రాగడం వల్ల కొంత వరకూ దంతాలకు క్షేమం.

దంతాలు కొరకడం:
కొంత మంది నిద్రలో పళ్ళ కొరికే అలవాటు ఉంటుంది . ఇలాగే కొంత కాలం చేస్తుంటే ముందు ముందు దంతాలు అరగడం లేదా దంతాలు పొడి పొడిగా రాలిపోడం జరుగుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఆల్కహాల్ దూరంగా ఉంటూ ఒత్తిడి తగ్గించుకోవాలి.

సోడాలు:
సోడాల్లో షుగర్స్ మరియు కొన్ని యాసిడ్స్ ఉండటం వల్ల , ఇవి దంతాల యొక్క ఎనామిల్ ను దెబ్బతీస్తాయి . కాబట్టి వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

స్నాక్స్:
తరచూ స్నాక్స్ తినడం లేదా ఏదో ఒకటి నములుతుండటం వల్ల దంతాల ఆరోగ్యానికి సంబంధించి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . స్నాక్స్ తినడం లేదా తరచూ ఏదోఒకటి నములుతుండటం వల్ల కూడా దంతాలకు హాని కలుగుతుంది.

స్మోకింగ్:
స్మోకింగ్ చేయడం వల్ల దంతాల మీద మరకలు ఏర్పుడుతాయి . స్మోకింగ్ చాలా ప్రమాధకరమైన విషయం. ఇది డెంటల్ హెల్త్ మరియు ఓరల్ హెల్త్ ను తీవ్రంగా నాశనం చేస్తుంది.

చిప్స్:
ఓరల్ బ్యాక్టీరియా స్ట్రార్చ్ ఫుడ్స్ కు చాలా త్వరగా రియాక్ట్ అవుతాయి. మరియు ఇది యాసిడ్స్ ను విడుదల చేస్తాయి. ఇవి దంతాలను తీవ్రంగా నాశనం చేస్తాయి. కాబట్టి చాలా మంది చిప్స్ తిన్నతర్వాత నోరు పుక్కలించడం, శుభ్రం చేసుకోవడం చేస్తుంటారు.

కాఫీ:
కాఫీలో ఉండే యాసిడ్స్ దంతాలు పసుపు వర్ణంలోకి మార్చడానికి కారణం అవుతాయి . ఒక రోజులో ఒక కప్పు కంటే ఎక్కువ కాఫీ త్రాగడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.



Click it and Unblock the Notifications