Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
వర్షకాలంలో అనుసరించాల్సిన ఆయుర్వేద హెల్త్ టిప్స్
ఆయుర్వేదం వైద్యానికి మరియు ఔషదాలకు పురాతన భారతీయ శాస్త్రంగా ఉంది. ఆయుర్వేధ ఔషధాలు వివిధ రకాలు, పొదలు, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల కలయికలతో తయారు చేస్తారు. ఆయుర్వేద ఔషధాలు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఆయుర్వేద ఔషధాలలో వివిధ రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాయిఅందువల్లే ఇది అంత ప్రజాదరణ పొందుతున్నది.
ఆయుర్వేదం అన్న పదానికి అర్థం "దీర్ఘ జీవన శాస్త్రం", ఆయుర్వేద చికిత్సలు మిమ్మైలిని ప్రకృతికి దగ్గరగా మరియు సరళమైన ఆరోగ్యకరమైన జీవన విధానంలో జీవించేలా చేస్తుంది..
READ MORE: మొటిమల నివారణకు ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం..!
వర్షాకాలంలో ఆరోగ్యం గురించి మరింత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్ లో దొరికే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు ఈ సీజన్ కొన్ని ఆహారాలకు మరియు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఈ సీజన్ లో ఆరోగ్యంగా ఉండటానికి నిపుణులు తెలిపిన కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

కొన్ని హెవీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి
ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన హెవీ ఫుడ్స్ అంటే(డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్)ఇవి మాత్రమే కాదు, కారంగా ఉన్న ఆహారాలు, ఎసిడిక్ ఫుడ్స్, పుల్లనివి(పికెల్, పెరుగు, కర్రీస్)వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. వీటిలో ఎక్కువ ఉప్పు ఉండటం వల్ల అజీర్తి, హైపర్ అసిడిటి, మరియు కడుపుబ్బరంకు కారణం కావచ్చు.

పాదాల జాగ్రత్తలు
వర్షాకాలంలో పాదాలు చాలా త్వరగా తడి అవ్వడం, ముఖ్యంగా డయాబెటిక్ వారు తగ్గిన సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఇంట్లో ఉన్నా చెప్పులు ధరించాలి . అదే విధంగా తేమకు జారకుండా మంచి గ్రిప్ ఉన్న ఫూట్ వేర్ ను ధరించాలి. అలాగే గోళ్లను తరచూ ట్రిమ్ చేస్తూ అన్ని సమయాల్లో డ్రైగా ఉంచాలి.

తేలికగా ఉండే మరియు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి
తేలిక ఆహారాలు మరియు జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి. గుమ్మడి, మరియు గ్రీన్ వెజిటేబుల్స్ తో ఉడికించినవి మరియు ఆవిరి మీద ఉడికించిన సలాడ్స్, ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్, పెసరపప్పు, కార్న్ వంటివి మీ డైజెస్టివ్ ట్రాక్ ను చాలా సున్నితం చేస్తుంది. హెల్తీగా ఉంచుతుంది.

మంచి జీర్ణక్రియకోసం
ఆయుర్వేడిక్ డ్రింక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందులో కొద్దిగా ఉప్పు, పెప్పర్, క్యాప్సికమ్ మరియు అల్లం వంటివి హాట్ వాటర్లో వేసి రోజుకోసారి త్రాగాలి.

గ్రీన్ లీఫ్స్ తినడం నివారించాలి.
గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ భూమికి చాలా దగ్గరగా పెరుగుతాయి కాబట్టి మట్టిలో బ్యాక్టీరియాను మరియు మురికిని మరియు తేమను గ్రహిస్తాయి . ఇలాంటి ఆహారాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. మరియు ఇవి జీర్ణం అవ్వడం కష్టం మరియు వీటిని శుభ్రం చేయడం కూడా కష్టమే...

మీరు ఎంపిక చేసుకొనే నూనెలు
తేలిక నూనెలు ఎంపిక చేసుకోవడం మంచిది మరియు ఇవి జీర్ణం అవ్వడానికి చాలా సులభం. మస్టర్డ్ ఆయిల్, శెనగనూనె, బట్టర్ వీటికంటే ఆయిల్ నెయ్యి, ఆలివ్ ఆయిల్ మరియు సన్ ఫ్లవర్ ఆయిల్ ఎంపిక చేసుకోవడం ఈ సీజన్ కు మంచిది.

హెర్బల్ టీలు త్రాగాలి
అనేక హేర్బల్ టీలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జింజర్ టీ మరియు గ్రీన్ టీలు చేర్చుకోవాలి. మరియు ఇవి వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి, ఫ్లూ వంటివి అనారోగ్య సమస్యలను నివారిస్తాయి . చల్లని వాతావరణంలో మీ శరీరంను వెచ్చగా ఉంచుతుంది .

వ్యాయామం తప్పనిసరి
వర్షాకాలం కదా అని వ్యాయామం నిలపకూడదు. వర్షకాలం బయటకు వెళ్ళలేని పరిస్థిలో ఇంట్లోనే పుష్ అప్ లు, యోగా, తేలికపాటు వ్యాయామాలు చేయవచ్చు. లేదంటే వ్యాధినిరోధకతను మరింత బలహీనపరుస్తుంది.

బయట తినడం నివారించాలి
వర్షాకాలంలో బయట తినడం పూర్తిగా నివారించాలి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగినది . మీరు బయట తీసుకొనే బేల్ పూరి లేదా పానీ పూరి వంటివాటిలో నూనెలు ఆహారాలు మంచివి వాడకపోతే, అనారోగ్యానికి దారితీస్తుంది .

భావోద్రేకాలను గమనిస్తుండాలి
వర్షాకాలంలో బావోద్రేకాలు కూడా ముఖ్య పాత్రపోషిస్తాయి . మీ శరీరంను హెల్తీగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో మూడ్ నెగటివ్ గా ఉంటుంది (ఆయుర్వేదంతొ)కోసం, చిరాకు, జలసీ మరియు ఈగోను తగ్గించుకోవచ్చు.



Click it and Unblock the Notifications