Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఎముకల ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్స్ పై అవగాహన ఉందా ?
పాలు, ఫిష్, డైరీ ప్రాడక్ట్స్ బలమైన ఎముకల నిర్మాణానికి సహాయపడతాయి. క్యాల్షియం రిచ్ ఫుడ్స్ వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితనానికీ ఒంట్లో క్యాల్షియం చాలా అవసరం. ఎముకలు ఆరోగ్యానికి రోజువారీ డైట్ లో క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఎముకల బలాన్ని తగ్గిస్తాయని తెలుసా ?
అవును మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని ఎములకు హాని కలిగిస్తాయి. శరీరంలో క్యాల్షియాన్ని పీల్చేసే ఆహారాలు, నిరోధించే ఆహారాలు ఉన్నాయి. కొన్ని పదార్థాలు క్యాల్షియంను బయటకు పంపిస్తాయి. కాబట్టి శరీరంలో ఉండే క్యాల్షియంపై చెడు ప్రభావం చూపే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఎముకలకు తీవ్ర హాని కలుగజేసే ఆహారాలేంటో చూద్దాం.

సోడియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్
ఎక్కువ మోతాదులో ఉప్పు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే.. క్యాల్షియం తగ్గిపోతుంది. కిడ్నీల ద్వారా క్యాల్షియం బయటకు వెళ్తడానికి కారణమవుతుంది. ఎముకల బలాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. రోజుకి 15 వందల గ్రాములు లేదా అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. అలాగే 12 వందల గ్రాముల క్యాల్షియం శరీరానికి రోజూ అందేలా జాగ్రత్తపడాలి.

చక్కెరతో కూడిన స్నాక్స్
ఎక్కువగా చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం తగ్గుతుంది. స్వీట్స్ తినాలనిపించినప్పుడు స్వీట్స్ కి బదులు క్రాన్ బెర్రీస్, ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.

కోలా లేదా కూల్ డ్రింక్స్
వారానికి ఏడు అంతకంటే ఎక్కువ కోలా తీసుకోవడం వల్ల ఎముకల్లో బలం తగ్గడమే కాదు, ఫ్రాక్చర్స్ కి ఎక్కువ అవకాశముంది. కోలాల్లో ఫోస్ఫ్రోరిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని క్యాల్షియంను తగ్గిస్తుంది. ఈ కోలాలకు బదులు ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం మంచిది.

కెఫెన్
కెఫీన్ వల్ల ఎముకల్లో ఉన్న క్యాల్షియం తగ్గిపోతుంది. దీనివల్ల ఎముకలు నిస్సత్తువగా లోనవుతాయి. 100 ఎమ్ జీ కెఫీన్ ద్వారా 6 ఎమ్ జీ క్యాల్షియం తగ్గిపోతుంది. కాబట్టి కాఫీ, టీలకు బదులు చాకొలెట్ తీసుకోండి.

ఆల్కహాల్
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకల అభివృద్ధి తగ్గిపోతుంది. ఫ్రాక్చర్స్ అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి ఆల్కహాల్ తాగలేకుండా ఉండలేని వాళ్లు రోజుకి టు డ్రింక్స్ మగవాళ్లు, రోజుకి ఒక డ్రింగ్ ఆడవాళ్లు తీసుకోవచ్చు.

చిక్కుళ్లు, బఠాణి
చిక్కుళ్లు, బఠాణీల్లో ఫైటేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియంని నిరోధిస్తాయి. అయితే వీటిలో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటిని తీసుకునే ముందు కొన్నిగంటల పాటు నీటిలో నానబెట్టి తర్వాత వండుకోవడం వల్ల ఎముకలకు ఎలాంటి హాని కలుగదు.

ఇన్ల్ఫమేటరీ ఫుడ్స్
టమోటా, మష్రూమ్స్, వైట్ పొటాటో, పెప్పర్ వంటివి ఎముకల వాపుకి కారణమవుతాయి. కానీ వీటిల్లో విటమిన్స్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటిని తీసుకోవాలి.. కానీ పరిమితికి మించి తీసుకోకూడదు.

పాలకూర, బచ్చలికూర
వీటిల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓక్సాలేట్స్ అనేవి ఉంటాయి. ఇవి క్యాల్షియంను దెబ్బతీస్తాయి.



Click it and Unblock the Notifications