Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొబైల్ కి అడిక్ట్ అయ్యారా ? అయితే రిస్క్ లో పడ్డట్టే
కళ్లు తెరవగానే దేవుడి ఫోటోనో, అరచేతులో చూసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఉదయం కళ్లు తెరిచింది మొదలు.. నిద్రపోయే వరకు మొబైల్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాం. టెక్నాలజీ లేకుండా ఈ రోజుల్లో ఏ పని జరగడం లేదు. ప్రతి విషయంలోనూ.. మొబైల్స్, టెక్నాలజీపై ఆధారపడుతున్నాం.
మొబైల్స్ ఫోన్స్ చిన్నా పెద్దా అని తేడా లేకుండా.. అందరూ అడిక్ట్ అయిపోయారు. దీనివల్ల పొందే ప్రయోజనాల కంటే.. అనారోగ్య సమస్యలనే ఎక్కువగా పొందుతున్నాం. మనకు తెలియకుండా.. మొబైల్ ఫోన్ ద్వారా అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయబోతున్నాం.
మొబైల్స్ ఫోన్స్ ఆన్ లో ఉన్నతంసేపూ వాటి ద్వారా వచ్చే రేడియో వేవ్స్ చాలా హానికరం. సెల్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు.. అనేక రకాల వైబ్రేషన్స్ మనపై దుష్ర్బభావాన్ని చూపుతాయి. అలాగే మొబైల్ ఫోన్ టవర్స్ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు రిస్క్ పొంచి ఉంచి. సెల్ ఫోన్ టవర్స్ నుంచి 50 నుంచి 300 మీటర్ల దగ్గర్లో ఉండే వాళ్లకు రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొబైల్ టవర్స్ దూరంగా ఉండండి. సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించండి. మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..

క్యాన్సర్
మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వాళ్లకు క్యాన్సర్ రిస్క్ పొంచి ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్స్ లో రేడియో ఫ్రీక్వెన్సీ కారణంగా.. ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంది. అలాగే ఇది బ్రెయిన్ ట్యూమర్ కి కూడా కారణమయ్యే అవకాశముంది.

నిద్ర
నిద్రలేమి సమస్య ఎందుకని ఇప్పటికైనా తెలుసుకున్నారా ? సెల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడమే.. నిద్రలేమి సమస్యలకు కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంది. దీనివల్ల ఇది అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది.

యాక్సిడెంట్ రిస్క్
ఎక్కడున్నా.. మొబైల్ మాత్రం చెంతనే ఉండాలన్నది నేటి తరం భావన. కనీసం డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ని పక్కనపెట్టరు. చాలామంది డ్రైవింగ్ చేస్తూనే సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల.. యాక్సిడెంట్స్ కి కారణమవుతున్నాయి. అలాగే రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా చాలామంది మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటారు. యాక్సిడెంట్స్ పెరగడానికి సెల్ ఫోన్సే ప్రధాన కారణమని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

గుండె సమస్యలు
సెల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా క్రోనిక్ డిసీజ్ లైన గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కార్డ్ లెస్ ఫోన్స్, సెల్ ఫోన్స్ లోనే ఎక్కువ రేడియేషన్స్ ఉంటాయి. దీనివల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. అలాగే ఎర్ర రక్తకణాల కౌంట్ కూడా తగ్గడానికి కారణమవుతుంది.

ఇన్ఫెర్టిలిటి
సెల్ ఫోన్ల వాడకం ఇన్ఫెర్టిలిటీకి కూడా కారణమవుతోంది. సెల్ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతుంది. కాబట్టి సెల్ ఫోన్ ని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే అంత మంచిది.

వినికిడి శక్తి
సెల్ ఫోన్ రేడియేషన్ వినికిడి శక్తి కోల్పోవడానికి కారణమవుతుందని మీకు తెలుసా ? ఎక్కువగా సెల్ ఫోన్ లలో మాట్లాడటం వల్ల వినికిడి శక్తి రానురాను తగ్గిపోతుందట. కాబట్టి.. మొబైల్ ఫోన్ తో కాస్త జాగ్రత్తగా వ్యవహరిచండి.

కంటి సమస్యలు
బుక్ రీడింగ్ ఇష్టపడేవాళ్లు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే.. పుస్తకాలకు బదులు.. ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసి.. బుక్స్ చదువుతున్నారు. ఎప్పుడైతే.. చిన్న ఫాంట్ తో ఉన్న స్టోరీలను స్ర్కీన్ పై చూస్తూ చదువుతారో.. అప్పుడు కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు కళ్లు పొడిబారి, దురదగా అనిపిస్తాయి.
కాబట్టి సెల్ ఫోన్ ని వాడకుండా ఉండలేరు కాబట్టి,.. కాస్త జాగ్రత్తగా, తక్కువగా, అవసరమున్నంత వరకే వాడటం వల్ల ఎలాంటి దుష్ర్పభావం ఉండదు. కానీ.. పదే పదే సెల్ ఫోన్ పై ఆధారపడితే.. చాలా అనర్థాలు జరుగుతాయి.



Click it and Unblock the Notifications