For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ లేకుండా నిమిషం కూడా గడపలేకపోవడానికి రీజన్స్ ఏంటి ?

|

ప్రస్తుతం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కరికీ అనుక్షణం అవసరమవుతున్న వస్తువు మొబైల్ ఫోన్. సెల్ ఫోనే ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ప్రపంచం. ప్రస్తుతం అందరూ ఈ మొబైల్ ఫోన్లకు చాలా అడిక్ట్ అయ్యారు.

మొబైల్ వాడకం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు! మొబైల్ వాడకం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు!

మొబైల్ ఫోన్లలో ఉండే ఫెసిలిటీలు, యాప్స్ మనుషులను అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇవి ట్రెండ్ క్రియేట్ చేయడమే కాదు.. అందరికీ కామన్ గ్యాడ్జెట్ గా మారిపోయాయి. ప్రపంచాన్నంతా అరచేతిలో చూపించే సెల్ ఫోన్స్ ప్రతి ఒక్కరికీ లైఫ్ లో నిత్యావరసర వస్తువుగా మారిపోయింది.

న్యూస్ నుంచి షాపింగ్ వరకు అన్నింటినీ మొబైల్ లోనే చేసేయొచ్చు. ఇది ఒక ఫ్రెండ్లీ ఆబ్జెక్ట్ గా మారింది. అందుకే మనుషులంతా మొబైల్ చేతిలో కట్టడి అయిపోతున్నారు. ఇంతకీ మొబైల్ లో ఆకర్షిస్తున్న అంశాలేంటి ? ఎందుకు ప్రతి ఒక్కరు మొబైల్ కంపల్సరీ ఉండాల్సిందే అంటున్నారు ?

అందరికీ టచ్ లో ఉండటానికి

అందరికీ టచ్ లో ఉండటానికి

ఎక్కడున్నా.. అందరితో కమ్యునికేట్ అవడానికి సెల్ ఫోన్ సహాయపడుతుంది. కాబట్టి మీకిష్టమైన వాళ్లతో ఏ సమయంలోనైనా.. ఎక్కడున్నా.. ఎంతదూరంలో ఉన్నా.. వెంటనే మాటలు కలపాలంటే ఈ సెల్ ఫోన్ ఉంటే చాలు. అందుకే.. దీనికి అందరూ అడిక్ట్ అవుతున్నారు.

వాట్స్ యాప్

వాట్స్ యాప్

వాట్సాప్ ఇప్పుడు జీవితంలో ఓ భాగమైపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్, కొలిగ్స్ తో వెంటనే కాంటాక్ట్ అవడానికి ఇదో సులభమైన మార్గం. మెయిల్ కంటే చాలా ఫాస్ట్ గా, ఈజీగా ఫ్రెండ్స్ ని కలుపుతోంది వాట్సాప్. అంతేకాదు గ్రూప్స్ క్రియేట్ చేసి.. కావాల్సినవాళ్లందరితో ఒకేసారి కమ్యునికేట్ అవడానికి ఇదో మంచి అవకాశం కల్పిస్తోంది.

ఫేస్ బుక్, ట్విట్టర్

ఫేస్ బుక్, ట్విట్టర్

స్కూల్ ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వరకు అందరినీ కలిపే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్. ప్రస్తుతం చేస్తున్న పనుల నుంచి అన్ని రకాల ఎక్స్ పీరియన్స్ లను స్నేహితులతో పంచుకోవచ్చు. దీనికి ల్యాప్ టాప్, డెస్క్ టాప్ అవసరం లేదు. చేతిలో మొబైల్ ఉంటే చాలు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో నిమిషాల్లో అప్ డేట్స్ ఇచ్చేయవచ్చు.

న్యూస్

న్యూస్

అరచేతిలో మొబైల్ ఉంటే చాలు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని సెకన్స్ లో తెలుసుకోవచ్చు. ఎలాంటి న్యూస్ అప్ డేట్స్ అయినా వెంటనే పొందే సౌకర్యం ఇక్కడ దొరుకుతుంది. దీనివల్ల కూడా చాలామంది సెల్ ఫోన్లను ఇష్టపడుతున్నారు.

సెల్ఫీ

సెల్ఫీ

ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది సెల్ఫీ. ఏ మాత్రం గ్యాప్ దొరికినా.. వెంటనే సెల్పీ దిగేస్తున్నారు. సెల్ఫీలను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్లంటే తెగ ఇష్టపడుతున్నారు.

మ్యూజిక్

మ్యూజిక్

మ్యూజిక్ లవర్స్ ని మొబైల్ చాలా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మ్యూజిక్ ని ఇష్టపడుతున్నారు. ట్రావెలింగ్ లో, బోర్ గా అనిపించినప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు వెంటనే మ్యూజిక్ విని రిలాక్స్ అవుతున్నారు. అంతేకాదు మొబైల్స్ లో కూడా రకరకాల మ్యూజిక్ యాప్స్ అందుబాటులో ఉండటంతో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఫై మోజు పెంచుకుంటున్నారు.

షాపింగ్

షాపింగ్

ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమేజాన్ వంటి రకరకాల సైట్స్ యాప్స్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో లైఫ్ చాలా ఈజీగా మారిపోయింది. కావాల్సిన వస్తువులు, బట్టలు కొనడానికి కష్టపడి షాప్ కి వెళ్లాల్సిన పని లేదు. కేవలం టచ్ చేస్తే చాలు.. మీకు కావాల్సిన వస్తువు మీ కళ్ల ముందుకు వచ్చేస్తుంది.

ఇవి మనం సెల్ ఫోన్ కి అడిక్ట్ అవడానికి కారణాలు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా అవకాశముంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా సెల్ ఫోన్ వాడితే అంత మంచిది.

English summary

Why People Addicted To Mobile Phone? in telugu

Mobile phones.... they indeed have become everyone's first love and fantasy. With the new age smart phones people are getting highly addicted to the gadget.
Desktop Bottom Promotion