Latest Updates
-
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం!
అనీమియా (రక్తహీనత) లోపంను నివారించే 18 హోం రెమెడీస్
అనీమియా (రక్తహీనత). రక్తహీనత ఎవరిలో అయితే హీమోగ్లోబిన్ లెవల్స్ మరియు రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉంటాయో వారిలో రక్తహీనత ఏర్పడుతుంది . హీమోగ్లోబిన్ మన శరీరంలో అన్ని బాగాలకు మరియు కణాలకు ఆక్సిజన్ తీసుకెళుతుంది . అనీమియా వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో సర్వసాధారణం(గర్భధారణ లేదా రుతుక్రమంలో). అనీమియాను వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోకపోతే, ప్రాణానికే ప్రమాధంగా మారుతుంది . అనీమియాకు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి., వాటిని ఈ రోజు మీతో పంచుకోవడం జరిగింది.
అనీమియా(రక్తహీనతకు)ప్రధాణ లక్షణం పేల్ స్కిన్ మరియు నెయిల్స్, అలసట, కూర్చొని ఉన్నా, నిల్చొని ఉన్నా బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది (ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్), తలనొప్పి, బలహీనత, అలసట, అలసిపోయినట్టు అనిపించడం, శ్వాసతీసుకోలేకపోవడం, ఏకాగ్రత లపించించడం మరియు వర్టిగో వంటివి ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు .
READ MORE: గర్భిణీ స్త్రీలకు రక్తం లేకపోతే తప్పక తినాల్సిన 15 ఆహారాలు..!
అనీమియా (రక్తహీనత)కు ప్రధాన కారణం , మనం తీసుకొనే అసమతౌల్య ఆహారం వల్ల ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి లోపం వల్ల అనీమియా వస్తుంది. అనీమియా శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే వచ్చే అనీమియాను పర్నీషియస్ అనీమియా అంటారు . కొన్ని రకాల వ్యాధులు క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులు కూడా ఆనీమియ యొక్క లక్షణాలే. కొంత మంది మలంలో రక్తం పడుట, క్రమంగా జిఐటి సమస్యలు , ఇవన్నీ కూడా అనీమియాకు కారణం అవుతాయి.
అలాంటీ తీవ్రపరిస్థితులల్లో అకస్మాత్తుగా రక్తాన్ని కోల్పోవడం ఫిజికల్ ట్ర్యూమాగా ఏర్పడి, వ్యక్తి షాక్ కు గురి అవుతాడు. మీరు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నట్లైతే, విటమిన్ బి12లోపం ఉన్నదోలేదో నిర్ధారించుకోవాలి. ఈ లోపం వల్ల నరాల డ్యామేజ్ ను కలిగిస్తుంది.
అనీమియ(రక్తహీనత)ను ఎలా నివారించాలి? అనీమియా నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ మరియు నేచురల్ హోం రెమెడీస్ ను బోల్డ్ స్కై మీకో అందిస్తోంది. వీటిని పరిశీలించి అనీమియాను నేచురల్ గా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. హాపీ లైఫ్ ను పొందండి.

అనీమియా రక్తహీనత లోపం నివారించే ఆహారాలు
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి
చాలా వరకూ అనీమియా(రక్తహీనత)విటమిన్ డి లోపం వల్లే వస్తుంది. హీమోగ్లోబిన్ ఐరన్ గాను మరియు ప్రోటీన్ గాను మారుతుంది. అందువల్ల మీ రెగ్యులర్ డైట్ లో ఐరన్ రిచ్ ఫుడ్స్ ను చేర్చుకోవడం వల్ల హీమోగ్లోబిన్ పొందవచ్చు. ఐరన్ అధికంగా ఉండే ఆకు కూరలు మరియు ఇతర గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, లివర్, ఓయిస్ట్రెస్, బ్రౌన్ రైస్, ద్రాక్ష, నల్లనువ్వులు మరియు ఇతర ఐరన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
ఆపిల్స్:
ఆపిల్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ కూడా అధికమే. రోజుకు ఒక ఆపిల్ తినడం ఆరోగ్యానికి మంచిది. అలాగే రక్తహీనత ఉండదు . ఆపిల్లో ఉండే ఐరన్ హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది. దాంతో అనీమియా నివారించుకోవచ్చు. అనీమియాకు ఒక ఉత్తమ హోం రెమెడీ.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
బీట్ రూట్
అనీమియాతో బాధపడే వారికి ఒక ఉత్తమ ఆహారం ఫోలిక్ యాసిడ్ మరియు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి . తొక్క తొలగించి తీసుకోవడం వల్ల పూర్తి న్యూట్రీషియన్స్ అందుతాయి . అలాగే దీన్ని జ్యూస్ రూపంలో లేదా ఉడికించి తీసుకోవచ్చు.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
నల్ల నువ్వులు
నల్ల నువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిని నేరుగా అలాగే తీసుకోవచ్చు. లేదా స్వీట్ డిష్ లలో చిలకరించి తీసుకోవచ్చు. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది . అనీమియాను తగ్గించడంలో ఇది ఒక నేచురల్ పదార్థం.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
తేనె
తేనెలో ఐరన్ మరియు ఇతర విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . దీన్ని మీరు నిమ్మరసంతో చేర్చి లేదా నేరుగా అలాగే తీసుకోవడం వల్ల మీ శరీరంలో హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుకోవచ్చు . అనీమియాకు ఇది ఒక నేచురల్ ఎఫెక్టివ్ రెమెడీ.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
అరటిపండ్లు
అరటిపండ్లలో ఐరన్, పొటాషియం, మరియు ఇతర ఎన్షెషియల్ విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి . రెగ్యులర్ గా అరటిపండ్లు తినడం వల్ల అనీమియా నివారించడం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
డాండలిన్ మరియు బర్డక్ రూట్
మీరు తీసుకొనే ఆహారం నుండి ఐరన్ గ్రహించడానికి ఇది సహాయం చేస్తుంది . లేదా ఇది జిఐటి సప్లిమెంట్ నుండి గ్రహింగి, రక్తకణాల్లోకి ప్రవహించేలా చేస్తుంది . ఈ మూలికలతో తయారుచేసిన టీని రెగ్యులర్ గా తీసుకోండి.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లు ఆరెంజ్ , పైనాపిల్, స్ట్రాబెర్రీ మరియు టమోటో వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . ఇది రక్తం ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది . ఇవి అనీమియాతో పోరాడి, అనీమియా లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది .

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
ఖర్జూరం
వీటిలో ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ,. అనీమియాను నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ . కొన్ని ఖర్జూరాలను పాలలో వేసి ఉడికించి వాటితో పాటు, పాలను అలాగే త్రాగాలి

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
బెల్లం
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది హీమోగ్లోబిన్ ను పెంచుతుంది . టీ కాఫీలలో పంచదారకు బదులుగా బెల్లంను మిక్స్ చేసి తీసుకోవాలి.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
ఉసిరి
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ అనీమియా మరియు దాని లక్షణాలను కూడా నివారిస్తుంది. ఉసిరికాయ జ్యూస్ ను మీరు రోజులో ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు . ఇది ఐరన్ సప్లిమెంట్ ను కూడా చేర్చుతుంది.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
టమోటోలు:
టమోటోలలో విటమిన్ సి మరియు లైకోపిన్ అధికంగా ఉంటుంది. రక్తంలో ఐరన్ గ్రహించడానికి విటమిన్ సి గ్రేట్ గా సహాయపడుతుంది.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
దానిమ్మ:
దానిమ్మలో ఐరన్ మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది . మరియు ఇందులో ఇతర మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి , ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది . ఇది బ్లడ్ సర్కులేషన్ మరియు హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది . అనీమియా లక్షణాలను నివారిస్తుంది

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
ఆర్గాన్ మీట్:
ఆర్గాన్ మీట్స్, లివర్ లో ఐరన్ అధికంగా ఉంటుంది . ఇందులో విటమిన్ బి12 , జింక్, మరియు ఫాస్పరస్ అధికంగా ఉంటుంది . వీటిని మైక్రోవేవ్ లో బేక్ చేసి తీసుకోవచ్చు . ఇది శరీరంలో ఐరన్ లెవల్స్ పెంచుతుంది. దాంతో అనీమియా నివారించబడుతుంది.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
ద్రాక్ష
ద్రాక్షలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనీమియా లక్షణాలను నివారించవచ్చు. ఇవి రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యం కూడా.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
పార్ల్సే
పార్ల్సేలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది. అనీమియా నివారించడంలో బెస్ట్ హోం రెమెడీ. మరియు ఇందులో విటమిన్ సి అధికంగా ఉండి, రక్తంలోని ఐరన్ గ్రహిస్తుంది . దీనిలో ఇంకా ఇతర విటమిన్స్ మరియు విటమిన్స్ కూడా ఉన్నాయి.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
మసాజ్:
శరీరం మొత్త మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది . దాంతో గుండె శరీరం మొత్తానికి రక్తాన్ని ప్రసరణ చేయడంలో చురుకుగా పనిచేస్తుంది. అనీమియా లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా ఆవనూనెతో మసాజ్ చేయాలి.

రక్తహీనత లోపంను నివారించే ఆహారాలు
చల్లనీటి స్నానం
చల్లనీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది . ఇది శరీరం యొక్క ఉష్ణోగ్రతను రీసెట్ చేస్తుంది . అనీమియా లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications











