ఫేస్ మ్యాప్: మొటిమల వెనుక దాగున్న అనారోగ్య లక్షణాలు..

అంతర్గత ఆరోగ్యం గురించి తెలిపే సూచిక మొదట ముఖం. ముఖం చూస్తానే ఆరోగ్యంగా ఉన్నారో...లెదో చెప్పేస్తుంటారు . మంచి గ్లోయింగ్...క్లియర్ స్కిన్ ఉన్నట్లైతే ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు లేవని అర్థం . మన ముఖం మన అంతర్గత అవయవ ఆరోగ్య స్థితిగతుల గురించి మన ముఖమే చెబుతుంది. ముఖంలో మొటిమలు కూడా మన ఆరోగ్య స్థితిగతులను చెప్పేస్తుంటాయి.

ప్రస్తుత కాలం లో అందరూ మొటిమల సమస్యను ఎదుర్కొంటున్నారు. మంచి పౌష్టికాహారం తింటున్నా... స‌రిప‌డా నీళ్లు తాగుతున్నా..కంటినిండా నిద్ర‌పోతున్నా.. ముఖాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నా ...మొటిమ‌లు వ‌స్తూనే ఉన్నాయ‌ని బాధ‌ప‌డుతుంటారు చాలామంది. అలాంటి వారు తెలుసుకోవాల్సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి.

మ‌న చ‌ర్మ ఆరోగ్యం మ‌న శ‌రీరం లోప‌లి ఆరోగ్యాన్ని ప్ర‌తిబింబిస్తుంది. అందుకే చ‌ర్మం క‌ళా విహీనంగా మార‌డం, మొటిమ‌లు, దద్దుర్లు, మ‌చ్చ‌లు రావ‌డం...రాషెష్ ఏర్పడటం ఇలాంటివి జ‌రిగిన‌పుడు, మ‌న శ‌రీరం లోప‌లి ఆరోగ్యం స‌క్ర‌మంగా ఉందా లేదా అనే సందేహాన్ని తీర్చుకోవ‌డ‌మూ అవ‌స‌ర‌మే అంటున్నారు నిపుణులు.

ముఖంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగంలో మొటిమలు వస్తాయి . మొటిమలను బట్టి మన ఆరోగ్య పరిస్టిని అంచనావేయవచ్చు అని చైనీస్ నిపుణులు అంటున్నారు. ఇంత‌కీ ముఖంలోని ఏ భాగాన్ని ఏ అవ‌య‌వానికి సంకేతంగా తీసుకోవాలి. మరి మీ ముఖంలో వచ్చే మొటిమ మీ ఆరోగ్యం గురించి చెబుతున్నాయన్న సంగతులేంటో తెలుసుకుందాం...

నుదిటి మీద మొటిమలు- ఉదర సమస్యలను సూచిస్తుంది:

నుదిటి మీద మొటిమలు- ఉదర సమస్యలను సూచిస్తుంది:

ప్రతి రోజూ రెగ్యులర్ గా మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేక, శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా విడుదల కావడం జరగుతుంది. నుదటిమీద మొటిమలకు ఇవి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ఎదురైతే నీళ్లు ఎక్కువగా తాగడం, కాఫీ మానేసి గ్రీన్ టీ , హెర్బల్ టీ త్రాగడం మంచిది.

కనుబొమల మధ్య మొటిమలు- కాలేయం ఎక్కువ పనిచేస్తున్నదని సూచిస్తుంది:

కనుబొమల మధ్య మొటిమలు- కాలేయం ఎక్కువ పనిచేస్తున్నదని సూచిస్తుంది:

అవును, మీ కనుబొమల మధ్య వచ్చే ఆ చిన్న మొటిమ మీ కాలేయం అధిక బరువు లాగుతోందని గుర్తు చేస్తోంది. అందువల్ల ఇక మద్యం, మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారం మానేయాలి. రాత్రి పూట చిరు తిళ్ళు తగ్గించుకోండి, కంటి నిండా నిద్ర పొండి. వారానికి ఒకసారి మీ శరీరాన్ని ఉత్సాహ పరిచేందుకు సాత్వికాహారం తీసుకోండి. శుభ్రం చేసుకోవడం, పచ్చటి ఆహారం తీసుకోవడం కొత్తగా మొదలు పెట్టె వారికి మంచిది.

మీ కంటి చుట్టూ, కంటి నొసల దగ్గరా వచ్చే మొటిమలు :

మీ కంటి చుట్టూ, కంటి నొసల దగ్గరా వచ్చే మొటిమలు :

కంటి చుట్టూ వచ్చే మొటిమలకు కారణం డీహైడ్రేషన్. అందువల్ల నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇది కిడ్నీగురించిన విషయాలను తెలియజేస్తుంది. కళ్ళ కింద వలయాలు కుడా డీహైడ్రేషన్ వల్ల వస్తాయి., అందువల్ల మీ శరీరాన్ని ఎక్కువగా నీటితో నింపండి. ఒక నీటి సీసా అందుబాటులో ఉంచుకుని, ఖర్బూజా, పుచ్చకాయ లాంటి నీటి శాతం ఎక్కువున్న పళ్ళు తినండి. మీ మొటిమల చుట్టూ నల్లటి వలయాలుంటే అది ఖచ్చితంగా డీ హైడ్రేషన్ అని గుర్తు.

ముక్కు మీద మొటిమలు-గుండె సమస్యను తెలియజేస్తుంది:

ముక్కు మీద మొటిమలు-గుండె సమస్యను తెలియజేస్తుంది:

మీ ముక్కు మీద మొటిమ వుంటే మీరు ప్రేమలో పడినట్టు కాదు. కానీ అది మీ గుండెకు సంబంధించిన విషయమే. మీ రక్తపోటు ఎక్కువైనా లేక తగ్గిపోయినా, మీకు విటమిన్ బి లోపం వున్నా, మీ ముక్కుమీద ఇలాంటి సంకేతాలు చూపిస్తుంది. కనుక కాస్త తాజా గాలి ఆస్వాదించండి, అలాగే వీరు కారం, ఘాటైన ఆహారాలను తినడం తగ్గించుకోవాలి . అలాగే మాంసాహారం తినడం కూడా తగ్గించుకోవడం మంచిది. వ్యాయామం చేయండి, విటమిన్ బి సప్లిమెంట్ లు తీసుకుని ఆ మొటిమలు తగ్గించుకోండి.

నోటి చుట్టూ:

నోటి చుట్టూ:

చెంప‌ల‌కు దిగువ‌న నోటికి చుట్టుప‌క్క‌ల మొటిమ‌లు వ‌స్తుంటే నోరు శుభ్రంగా లేద‌ని భావించాలి. ప‌ళ్లు, చిగుళ్ల ఆరోగ్యం దెబ్బ‌తిన‌కుండా చూసుకోవాలి. అందుకు రెగ్యులర్ గా పరిశుభ్రతను పాటించాలి. మరియు దంతఆరోగ్యానికి సహాయపడే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

బుగ్గ మీద మొటిమ - శ్వాసకు సంబంధించిన సమస్యలు:

బుగ్గ మీద మొటిమ - శ్వాసకు సంబంధించిన సమస్యలు:

మీరు పొగ తాగే వారైనా లేక మీకు శ్వాసకోస సమస్యలున్నా, మీ బుగ్గల మీద ఒకటి రెండు మొటిమలు వుంటాయి. మీ ధూమపానం తగ్గించుకోండి, ఉదయాన్నే వ్యాయామం చేయాలి. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలాగే (దోస, పుచ్చ లాంటి పళ్ళ రసాల వంటి) చలువ చేసే ఆహార పానీయాలు రెగ్యులర్ డైట్లో చేర్చుకొని శరీరం నుంచి అధిక ఉష్ణం దూరం చేసుకోసుకోవాలి.

గడ్డం కి ఇరువైపులా మొటిమలు - హార్మోన్ల అసమతౌల్యతకు ప్రతీక:

గడ్డం కి ఇరువైపులా మొటిమలు - హార్మోన్ల అసమతౌల్యతకు ప్రతీక:

పీఎంఎస్ అనే మూడు అక్షరాలూ మీ శరీరాన్నిబాగా ఇబ్బంది పెట్టగలవు. కానీ రుతుక్రమం తరువాత కూడా మీకు అస్తమాను మొటిమలు వస్తుంటే మీకు హార్మోన్ల అసమతౌల్యం ఉన్నట్టే. ఇలాంటి వారు ప్రతిరోజూ ఖచ్చితంగా 7 నుండి 8గంటలు ఖచ్చితంగా నిద్రించడం మంచిది. అదేవిధంగా ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. శరీరానికి సరిపడినంత నీటిని తాగాలి. ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే మీ అందమైన చర్మాన్ని తిరిగి పొందడానికి మీ గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళండి.

గడం:

గడం:

ఉదర సంబందమైన విషయాలను గురించి తెలియజేస్తుంది. ఈ భాగంలో మొటిమలు కలవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాల్ని తీసుకోవాలి. అలాగే హానికారక మరియు మత్తుపానీయాలను తీసుకోవడం మానుకోవాలి. ప్రతి రోజూ హెర్బల్ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

 చెవుల చుట్టూ:

చెవుల చుట్టూ:

ఈ ప్రదేశంలో మొటిమలు కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. ఉప్పు వాడకం ఎక్కువ కావడమూ కారణం కావచ్చు. అలాగే కొన్ని సార్లు హెయిర్ ఆయిల్స్, జుట్టుకి కండీషనర్లని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వలన కూడా మొటిమలు వస్తాయి.

మెడ:

మెడ:

మెడ మీద లేదా మెడ చుట్టూ వచ్చే మొటిమలు అనారోగ్యానికి సూచిక. ఇలాంటి సమస్యలతో ఉన్నవారు యోగా చేయడం, మధ్యాహ్నా వేళలలో కొంచెం సేపు నిద్రపోవడం, బాగా గట్టిగా గాలిపీల్చి వదలడం ఇలాంటి ప్రక్రియలు చేయడం వల్ల ఆరోగ్యపరిస్థితి మెరుగుపరుడుతుంది. చూశారు మొటిమలు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్పాయో...

Story first published: Friday, December 11, 2015, 17:03 [IST]
Desktop Bottom Promotion