గోళ్ళు కొరకడం వెనకున్న సైంటిఫిక్ లాజిక్ మరియు నివారించే మార్గాలు

చాలా మందిలో గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. పిల్లలు మరియు పెద్దవారిలో ఇది ఒక సాధారణ సమస్య. దీన్నే ఇంగ్లీషులో ఆనిచోఫాగియా అంటారు. ఇలా గోళ్ళు కొరక కూడదని తెలిసిన పెద్దలు చెప్పిన వినిపించుకోరు. ఇది ఒక అలవాటుగా మార్చుకుంటారు. ఇక సైంటిపిక్ లాజిక్ ఏంటంటే గోళ్ళ చివరి నుండి ప్రతి కూల శక్తి బయటకు వెళ్తుంది వాటిని నోట్లో పెట్టి కొరకడం వల్ల సంబంధిత ప్రతి కూల శక్తి తిరిగి మన శరీరంలో ప్రవేశిస్తుంది. అంతే కాక మనం ఎంత శుభ్రం చేసిన గోళ్ళలో మట్టి సూక్ష్మ క్రిములు ఉండి పోతాయి. ఇవి లోపలికి వెళ్ళి అనారోగ్యానికి దారి తీస్తాయి.

స్ట్రెస్, బోర్ కొట్టినప్పుడు, ఫ్రస్టేషన్, ఆందోళన మరియు లోన్లీనెస్ మరియు మరికొన్ని ఇతర కామన్ రీజన్స్ గోళ్ళు కొరకడానికి కారణం కావచ్చు. ఇంకా కొన్ని సైకలాజికల్ కండీషన్స్, మరియు డిజార్డర్స్ వల్ల కూడా గోళ్ళ కొరకడానికి కారణం అవుతుంది. గోళ్ళు కొరకడం వల్ల పెద్దల్లోనూ మరియు పిల్లల్లో తీవ్రపరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు ఒక్కోసారి గోళ్ళను మింగేయవచ్చు అరుదుగా ఇవి పేగులలో ఎక్కడైనా గుచ్చుకొని ఒక్కోసారి ఆఫరేషన్ చేయాల్సిరావాచ్చు.

పిల్లలు గోర్లు కొరకడం మాన్పించడానికి సులభ చిట్కాలు

సాధారణంగా చేతి గోళ్ళు రోజుకు సుమారు 0.1 మి. మీ పెరుగుతాయి . కాలీ గోళ్ళు ఇందులో కేవలం మూడో వంతు మాత్రమే పెరుగుతాయి . వీటిని శుభ్రం చేసుకోకుంటే అనేకానేక ఫంగస్ కారక వ్యాధులు సోకే అవకాశం ఉంది. గోళ్ళ మీద ఉన్నా తెల్లని అడ్డ గీతలు గతంలో రుగ్మతులకు సూచిక. అంతేకాదు విటమిన్ లోపం వల్ల గోళ్ళ ఆకృతి మారుతుంది కూడ . సో గోళ్ళ సంరక్షణ కూడ ఆరోగ్యం లో ఓ భాగమే నఖ శిఖ పర్యంతం శరీరం పై శ్రద్ధ తీసుకుంటే మంచిది .

గోళ్ల కొరకడం మానేయడం కొద్దిగా కష్టమే, కానీ అసాధ్యం అని మాత్రం చెప్పలేము . ఈ అలవాటును మానుకోవడానికి కొన్ని మోటివేషన్ మరియు స్ట్రాంగ్ విల్ పవర్ ను కలిగి ఉంటే చాలు ఈ అలవాటును అలవోకగా మానుకోవచ్చు. వీటితో పాటు కొన్ని నేచురల్ రెమెడీస్ కు గోళ్ళ కొరికే అలవాటు మాన్పిస్తాయి. మరి ఆ నేచురల్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం....

1. వేప నూనె:

1. వేప నూనె:

వేపనూనె రుచికి చేదుగా ఉంటుంది. కాబట్టి గోళ్ళు కొరకడం మానేయడంలో ఈ నూనె గ్రేట్ గా సహాయపడుతుంది . అంతే కాదు, ఈ నూనెలో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉంచుతుంది. కాటన్ బాల్ ను వేపనూనెలోడిప్ చేసి కోళ్ళమీద మర్దన చేయాలి. అదంత అది ఆరే వరకూ అలాగే ఉండాలి. తర్వాత మీకు తెలియకుండా గోళ్ళ కొరకాలన్నా, చేదు వల్ల కొరకలేకపోతారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే, అలవాటును సులభంగా మానుకోవచ్చు.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

గోళ్ళు కొరకడం మానేయడానికి వెల్లుల్లి మరో బెస్ట్ హోం రెమెడీ. చాలా మంది వెల్లుల్లి ఘాటైన వాసన పట్టదు. ఇది గోళ్ళ కొరకడంతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లి యాంటి సెప్టిక్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది గోళ్ళను బలోపేతం చేస్తుంది మరియు ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది . కాబట్టి గోళ్లకు వెల్లుల్లి రసాన్ని లేదా గార్లిక్ ఆయిల్ ను అప్లై చేయవచ్చు. వెల్లుల్లిని బాగ పేస్ట్ చేసిన ఆ రసాన్ని గోళ్ళకు పట్టించి కొన్ని నిముషాలు అలాగే ఉండాలి. ఆ వాసనే మీరు గోళ్ళ కొరకాలన్న అలవాటను తగ్గిస్తుంది. అలాగే గార్లిక్ ఆయిల్ కూడా అప్లై చేయడం వల్ల అలవాటు మానుకోవచ్చు.

3. కాకరకాయ:

3. కాకరకాయ:

మరో ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ ఇది . పేరు వింటనే ఇందులో ఉండే చేదు లక్షణాలు మనకు గుర్తు వస్తాయి. కాకరకాయను పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ను చేతి వేళ్ళ గోళ్ళకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత కడిగేసిన, అలాగే ఉంచుకొన్నా సరే చేదు వల్ల గోళ్ళు కొరకడానికి ఆసక్తి చూపించరు.

4. నెయిల్ బిట్టింగ్ పాలిష్ :

4. నెయిల్ బిట్టింగ్ పాలిష్ :

మార్కెట్లో వివిధ రకాల నెయిల్ బిట్టింగ్ పాలిష్ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డిజైన్ గాను మరియు గోళ్ళు కొరికే అలవాటను మానుకోవడానికి సహాయపడుతుంది. బిట్టర్ టేస్ట్ కలిగిన నెయిల్ బిట్టింగ్ పాలిష్ ను ఉపయోగించవచ్చు . ఈ బిట్టర్ టేస్ట్ వల్ల గోళ్ళు కొరకడం మానేస్తారు .

5. తరచూ గోళ్ళను ట్రిమ్ చేస్తుండాలి:

5. తరచూ గోళ్ళను ట్రిమ్ చేస్తుండాలి:

మరో మంచి ఉపాయం, రెగ్యులర్ గా గోళ్ళను ట్రిమ్ చేస్తుండాలి . ఎప్పటికప్పుడు గోళ్ళను షార్ట్ గా మార్చుకుంటుంటే...గోళ్ళకొరికే చాన్సెస్ తక్కువగా ఉంటాయి . అంతే కాదు, గోళ్ళు చూడటానికి అందంగా నీట్ గా ఉంటాయి.

6. రెగ్యులర్ గా మానిక్యూర్:

6. రెగ్యులర్ గా మానిక్యూర్:

ప్రొఫిషనల్ మానిక్యూర్ ను మీరు చేయడం వల్ల గోళ్ళు కొరికే అలవాటు తప్పిపోతుంది . ప్రొఫిషినల్ మానిక్యూర్ వల్ల గోళ్ళ మీద అక్రిలిక్ మీ నేచురల్ నెయిల్స్ మీద అప్లై చేస్తారు . లేదా గోళ్ళ మీద అలంకరించుకోవడం వల్ల గోళ్ళ కొరకాలని అనిపించదు . గోళ్ళను ఎంత అందంగా ఉంచుకుంటే, అంత ఎక్కువగా గోళ్ళ కొరకడం మానుకుంటారు.

7. ఆర్టిఫిసియల్ నెయిల్స్:

7. ఆర్టిఫిసియల్ నెయిల్స్:

ఆర్టిఫిషియల్ నెయిల్స్ ను అమర్చుకోవడం వల్ల గోళ్ళు కొరకాలనిపించదు. మరియు గోళ్ళు కొరకడం వల్ల పాడైన గోళ్ళను కనబడనివ్వకుండా దాచేసి, గోళ్ళు స్టైలిస్ గా కనబడుతాయి. ఆర్టిఫిషియల్ నెయిల్స్ లో కూడా వివిధ రకాలున్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

8. గ్లౌజులు వేసుకోవాలి:

8. గ్లౌజులు వేసుకోవాలి:

నెయిల్ బిట్టింగ్ అలవాటను మాన్పించడానికి గౌజులు గ్రేట్ గా సహాయపడుతాయి . గ్లౌజులు వేసుకోవడం వల్ల గోళ్ల కొరకడానికి అవకాశం ఉండదు కాబట్టి, తరచూ గ్లౌజులను ధరించుకోవచ్చు . ఇది ఒక మోటివేషనల్ టూల్ అని చెప్పవచ్చు.

9.అడ్వైజ్ బ్యాండేజ్ లు:

9.అడ్వైజ్ బ్యాండేజ్ లు:

మరో మంచి ఉపాయం, సెల్ఫ్ అడ్వైజ్ బ్యాండేజ్ లను ఫింగర్ టిప్ కు చుట్టుకోవడం . బ్యాండేజ్ నెయిల్స్ చూడటానికి అందంగా కనబడకపోయినా, ఇవి మోటివేటర్ గా పనిచేసి గోళ్ళు కొరకడం మానేందుకు సహాయపడుతాయి .

10. ద్రుష్టిని మళ్ళించాలి:

10. ద్రుష్టిని మళ్ళించాలి:

స్ట్రెస్ , డిప్రెషన్ లో ఉన్నప్పడుు, బోర్ గా అనిపించినప్పుడు , మీకు నచ్చినది ఏదైనా ఒక కొత్త అలవాటు వల్ల గోళ్ళ కొరడం అనే ఆలోచనను దారి మళ్లించవచ్చు . మైండ్ కు పనిపడితే, ద్యాస గోళ్ళ మీదకు వెళ్ళకుండా ఉంటుంది.

Desktop Bottom Promotion