Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బోన్ ఫ్రాక్చర్ నుండి త్వరగా కోలుకొనేలా చేసే ఆహారాలు..
ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు బోన్ ఫ్రాక్చర్ జరిగితే..బోన్ ఫ్రాక్చర్ ను నయం చేసే ఆహారాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక తప్పదు. . కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఎలాంటి ఫ్రాక్చర్సైనా చాలా ఎఫెక్టివ్ గా నయం చేస్తాయి.
సాధారణంగా, సెడ్ ఆక్సిడెంట్స్ -మెట్ల మీద నుండి జారిపడటం, లేదా స్పోర్ట్స్ లో గాయాలవ్వడం మరియు ఇతర యాక్సిడెంట్స్ వల్ల బోన్ ఫ్రాక్చర్ జరుగుతుంటుంది.
బోన్ ఫ్రాక్చర్ కు మరో ముఖ్య కారణం ఓస్టిరియోఫోసిస్. ఈ రకమైన ధీర్ఘకాలిక వ్యాధి వల్ల క్రమంగా ఎముకలు పల్చబడి, చివరకు ఎముకలు బ్రేక్ అవుతుంటాయి. ఇలా ఫ్రాక్చర్ అయ్యే ఎముకలను నయం చేయడానికి కొన్ని రకాల ఆహారాలున్నాయి ?
సాధారణంగా, మనం రెగ్యులర్ గా తీసుకొనే కొన్ని ఆహారాల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ను అతి తక్కవు సమయంలో నయం చేస్తాయి.
క్యాల్షియం, జింక్, మెగ్నీషియం, మొదలగు ఉపయోగికరమైన పోషకాలు ఎముకలను మరింత స్ట్రాంగ్ గా మార్చి ఓస్ట్రియోఫోసిస్ వంటి వ్యాధులను నివారిస్తాయి. అంతే కాదు, బోన్స్ మరియు దంతాలను మరింత స్ట్రాంగ్ గా మార్చుతాయి. దాంతో సామన్యంగా ఎముకలు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
అయితే, ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ జరగినా...ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను కలిసి మెడికల్ హెల్ప్ తీసుకోవాలి . దాంతో డాక్టర్స్ సలహాలతో పాటు ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల నొప్పులను మరియు హీలింగ్ లక్షణాలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మరి బోన్ ఫ్రాక్చర్ నుండి త్వరగా నయం చేసి కోలుకొనేలా చేసే ఆ ప్రత్యేకమైన ఆహారాలేంటో తెలుసుకుందాం....

పాలు:
చాలా వరకూ మెడికల్ స్టడీస్ వల్ల పాలలో క్యాల్షియం మరియు ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుందని నిరూపించబడ్డాయి. అంతే కాదు వ్యాధినిరోధకతను పెంచడంలో మరియు శరీరం తనంతట తాను గాయాలను , ఫ్రాక్చర్స్ ను నయం చేసుకోగల లక్షణాలను కలిగి ఉంటాయి. వీటితో పాటు, పాలలో ఉండే క్యాల్షియం ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ అయినా నయం చేసి, బోన్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి . అంతే కాదు పాలలో ఉండే విటమిన్ డి బోన్ లోని క్యాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది.

బ్రొకోలీ:
బోన్ ఫ్రాక్చర్ ను నివారించడంలో బెస్ట్ ఫుడ్ బ్రొకోలీ. ఈ గ్రీన్ వెజిటేబుల్లో విటమిన్ కె అధికంగా ఉంది. విటమిన్ కె బోన్ మాస్ ఏర్పడటానికి సహాయం చేస్తుంది. దాంతో ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ అయినా త్వరగా నయం అవ్వడానికి సహాయపడుతుంది.

ఆరెంజ్:
ఫ్రాక్చర్ హీల్ చేయడానికి ఇలాంటి ఫుడ్స్ ను ఎందుకు కన్సిడర్ చేస్తాము? బోన్ ఫ్రాక్చర్ చాలా పెయిన్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి, ఆ ప్రదేశంలో ఇన్ఫ్లమేషన్ కూడా అధికంగా ఉంటుంది. నొప్పిని మరియు వాపును ఒకే సారి తగ్గించడంలో విటమిన్ సి గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే బోన్ మాస్ ఏర్పడుటకు సహాయపడుతుంది . వ్యాధినిరోధకశక్తిని పెంచుటకు ప్రోత్సహిస్తుంది.

పెరుగు:
పెరుగులో ఉండే అమినో యాసిడ్స్, లిసిన్, గ్లుటమిన్ వంటివి క్యాల్షియం గ్రహించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి . వీటితో పాటు, ప్రోటీన్ మరియు ఫాస్పరస్ వంటివి హీలింగ్ ప్రొపర్టీస్ త్వరగా బోన్ ఫ్రాక్చర్ ను నివారించడానికి సహాయపడుతాయి.

లీన్ ప్రోటీన్:
బోన్ ప్రాక్ఛర్స్ ను నివారించే ఇతర ఆహారాలేంటి? బోన్ ఫ్రాక్చర్ జరిగినప్పుడు , బోన్ టిష్యును కోల్పోవడం సహాజం. ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు . కాబట్టి, ప్రోటీన్ ఫుడ్ లేకుండా టిష్యులు పునరుత్పత్తి కావు. కాబట్టి, ఇలాంటి సమయంలో ఫిష్, గ్యాస్ ఫీడ్ బీఫ్ వంటి ప్రోటీన్ ఫుడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

గుమ్మడి మరియు ఆకుకూరలు:
ఫ్రాక్చర్ రిపేర్ చేయడానికి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. . అటువంటి సమయంలో జింక్ అవసరమైనటుంటి న్యూట్రీషియన్ . లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ ఆకుకూరల, మరియు గుమ్మడి వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జింక్ కంటెంట్ ను పొందవచ్చు. గుమ్మడి సూప్ మరియు స్నాక్ రూపంలో తీసుకోవచ్చు.

టమోటోలు:
చాలా వరకూ ఇలా విటమిన్ సి ఫుడ్స్ బోన్ ఫ్రాక్చర్స్ ను నయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. టమోటోల్లో ఉండే విటమిన్ సి , బోన్ రీబిల్డ్ చేయడానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తికి చర్మం రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications