Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మగువలకు ముగ్గు చెప్పే ముచ్చట్లు
ప్రతి రోజూ ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం భారతీయ సంప్రదాయం. ముగ్గు ఎక్కువగా రాతి సున్నము, బియ్యం పిండి లేదా రెండూ కలిపి వేస్తారు. సున్నంతో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్లూ, జెర్లు, పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు. బియ్యం పిండితో వేస్తే...ఆ పిండి తినటానికి చీమలు చేరతాయి, అవి ఈ విషకీటకాలను చంపుతాయి.
READ MORE: సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ..కలర్ ఫుల్ ముగ్గులతో కళకళలాడాల్సిందే...
పురాతన కాలం నుంచి ముగ్గు వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ముగ్గులు రెండు రకాలుగా వేస్తారు. చుక్కలు పెట్టి కలపడం, చుక్కలు లేకుండా కేవలం డిజైన్స్ వేయడం ద్వారా రంగవళ్లులు తీర్చిదిద్దుతారు. ఇలా నిత్యం ముగ్గులు వేయడం సంప్రదాయం మాత్రమే కాదు... దీని వెనక అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా దాగున్నాయి.

ఉత్తేజం
ముగ్గు పెట్టేటప్పుడు ఆడవాళ్లు వంగి చేస్తారు. ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్ల నుంచి పాదాల వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

కొవ్వు కరగడానికి
అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా ముగ్గు వేసే ప్రక్రియ కాపాడుతుంది. అలాగే ముగ్గు వేయడానికి ముందు ఆవు పేడతో ఇంటి ముందు అలుకుతారు. దీనివల్ల పేడలోని ఔషధ గుణాలు ఎన్నోరకాల క్రిములను నాశనం చేసి... ఆరోగ్యాన్నిస్తాయి.

సంతానోత్పత్తి
ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్లు వంగి లేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్లలో సంతానోత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది, కడుపుకి సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి.

నడుము నొప్పి
ముగ్గు వేయడానికి చుక్కలు పెడతారు. అవి కలపడానికి చేతులు అటు ఇటు కదుపుతారు. అలాగే నడుమును కూడా కదిలిస్తూ ఉంటారు. దీని వల్ల నడుము నొప్పులు రావు. వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలు కూడా దూరంగా ఉంటాయి.

ప్రాణాయామం
ముగ్గు వేయడానికి మహిళలు వంగినప్పుడు శ్వాస నిదానంగా పీలుస్తారు. అలా ఇది ఒక విధమైన ప్రాణాయామం.

మానసిక ప్రశాంతత
ముగ్గు వేయటం వలన మానసిక వత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక సాంత్వన లభిస్తుంది. ఇలా ముగ్గు ద్వారా రిలాక్స్ గా, కంఫర్టబుల్ గా, హ్యాపీగా ఫీలవవచ్చు.

ముగ్గు సంపదకు
ముగ్గులు అదృష్టాన్ని సూచిస్తాయి. ఇలా ముగ్గు వేయడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామని హిందువుల నమ్మకం.

ఏకాగ్రత
కళాత్మకంగా ముగ్గులు వేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ముగ్గులు రకరకాలుగా వేస్తారు. విభిన్న డిజైన్స్ తో ఎంత పెద్దగా అయినా వేసేస్తారు. ఇలా కొత్త డిజైన్స్ లో ముగ్గు పెట్టడానికి చాలా ఏకాగ్రత, ఓపిక అవసరం. ఇలా ఓపిగ్గా, కాన్సంట్రేసన్ తో ముగ్గు వేయడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications