Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
హానీ వాటర్ తో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ...
హనీ వాటర్ త్రాగితే ఏమవుతుంది? హార్ట్ వాటర్ మరియు లెమన్ వాటర్ త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని మనందరికీ తెలిసిన విషయమే..మరి మీరు హనీ విత్ వాటర్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? హాని వాటర్ లో కూడా చాలా ఆశ్చర్యం కలిగించే అనేక ప్రయోజనాలున్నాయి.
మనకు నేచురల్ గా అందుబాటులో ఉండే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
ముఖ్యంగా వార్మ్ హనీ వాటర్ త్రాగడం వల్ల అలసట తగ్గుతుంది, వ్యాధినిరోధకత పెరుగుతుంది మరియు చర్మం మీద గాయాలను నివారిస్తుంది మరియు బరువు తగ్గిస్తుంది. అంతే కాదు, వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

1. ప్రయోజనం #1:
వర్కౌట్స్ తర్వాత గోరువెచ్చని హానీ వాటర్ త్రాగడం వల్ల జీవక్రియలు మరింత వేగవంతం అవుతాయని కొందరు హెల్త్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

2. ప్రయోజనం #2:
గొంతునొప్పి, దగ్గు, మరియు శ్వాస సంబంధిత సమస్యలు నివారించడంలో హానీ వాటర్ చాలా మంచిది. హానీ వాటర్ తో ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

3. ప్రయోజనం #3:
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి. ఇంకా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంను హెల్తీగా ఉంచడానికి సహాయపడుతాయి.

4. ప్రయోజనం #4:
గోరువెచ్చని హానీ వాటర్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మరింత బెటర్ గా ఉంటుంది.

5. ప్రయోజనం #5:
తేనెలోని నేచురల్ స్వీట్ గుణం ఉండటం వల్ల బరువు తగ్గించడంతోపాటు, కొద్దిగా తేనె తినడం వల్ల ఆకలి ఎక్కువగా అనిపించదు.

6. ప్రయోజనం #6:
తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హార్ట్ సంబంధిత సమస్యలను నివారిస్తుంది . ఇది ఒక పెద్ద లాభం.

7. ప్రయోజనం #7 :
కొందరు హెల్త్ ఎక్సపర్ట్స్ అభిప్రాయం ప్రకారం శరీరంను నిర్విశీకరణం చేయడానికి మరియు ఎనర్జీ లెవల్స్ పెంచడానికి సహాయపడుతుంది.

8. ప్రయోజనం #8:
తేనెలో ఉండే విటమిన్స్, మినిరల్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది.

9. ప్రయోజనం #9:
తేనె జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. తేనె రెగ్యులర్ గా తినడం వల్ల పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు.

10. ప్రయోజనం #10:
గోరు వెచ్చని హానీ వాటర్ లో తేనె మిక్స్ చేయడం వల్ల చెడు శ్వాసను నివారిస్తుంది. ముఖ్యంగా ఈ మూడింటి మిశ్రమం యొక్క నీరు త్రాగడం వల్ల ఫలితం మరింత బెటర్ గా ఉంటుంది. ముఖ్యంగా బాడ్ బ్రీత్ నివారిస్తుంది. దంతసంరక్షణగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications