Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ఎసిడిటి(అజీర్తి)కి 10 ఇన్ స్టాంట్ ఆయుర్వేదిక్ రెమెడీస్...
మీ బందువుల, లేదా స్నేహితులు ఇచ్చిన విందులో అద్బుతమైన ఆహారంను తిని బాగా ఎంజాయ్ చేశారా ? అద్భుతమైన విందును ఆరగించిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక్క సారిగా మీకు ఇష్టమైన ఆహారాలన్నీ ఎక్కువగా లాగించేస్తే ఎం జరుగుతుంది? ఇంకేముందు ఎసిడిటి(అజీర్తి).
ఎసిడిటి లక్షణాలు పొట్టనొప్పి, అసౌకర్యం , పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఇన్ స్టాంట్ గా రిలీప్ పొందడానికి హెర్బల్ రెమెడీస్ లేదా ఆయుర్వేదిక్ రెమెడీస్ కోసం వెతకడం మొదలెడతాము.
అజీర్ణం మరియు కడుపుబ్బరం సమస్య ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందని మీరు ఎప్పుడైనా తెలుసుకొన్నారా?
పొట్టలో విడుదలయ్యే జీర్ణ రసాలు అజీర్ణానికి గురిచేస్తాయి. కొన్ని సందర్బాల్లో కొంత మందిలో స్టొమక్ బర్నింగ్, వికారంకు గురిచేస్తుంది . పొట్టలో స్రవించే జీర్ణ రసాలు ఆహారం జీర్ణమవ్వడానికి సహాయపడుతాయి. ఈరసాల మీద ప్రభావం చూపినప్పుడు అది అజీర్తికి కారణమవుతుంది.
ఒక్కసారిగా ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ను ఎక్కువగా తిన్నప్పుడు పొట్టలోపలి లేయర్ విడిపోయి, ఓసియోఫాగస్ మరియ బౌల్ డ్యామేజ్ అవుతుంది. జీర్ణ రసాల ప్రభావం కారణంగా పొట్టలో , బౌల్లో టిష్యు లేయర్ విడిపోవడం వల్ల ఓసియోఫాగస్ మరియు బౌల్ కు ఇరిటేషన్ కలిగిస్తుంది. ఈ కారణం చేతనే పొట్ట ఉదరంలో నొప్ని, పొట్ట ఉబ్బరంగా మరియు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగా పొట్ట పైబాగంలో, చాతీక్రింది భాగంలో పొట్ట ఉదరంలో నొప్పిగా ఉంటుంది.
ఎసిడిటి మరియు అజీర్తి సమస్యలను నివారించుకోవడానికి కొన్ని ఆయుర్వేదిక్, హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..ఎసిడిటిని దూరం చేసుకుందాం...

1. అజ్వైన్:
ఎసిడిటి, అజీర్తి సమస్యలకు ఇన్ స్టాంట్ రిలీఫ్ కలిగించే గ్రేట్ హోం రెమెడీ..అజ్వైన్ వాటర్ . . ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ అజ్వైన్ వేసి బాగా మరిగించాలి. బాగా ఉడికిన తర్వాత, నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి.

2. ఆమ్లా:
ఎండిన ఉసిరికాయను తినడం వల్ల ఇన్ స్టాంట్ రిలీఫ్ దొరుకుతుంది. మరియు పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది . ఎండు ఆమ్లా మార్కెట్లో అందుబాటులో ఉంది . లేదా వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకోవాలి. ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి ఉడికించి తర్వాత ఉప్పు కలిపి ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకొన్న ఆమ్లా ముక్కలను ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తింటుండాలి.

3. లవంగాలు:
లవంగాల్లో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి . డైజెస్టివ్ గ్యాస్ ను తగ్గించడంలోసహాయపడుతుంది . దాంతో స్టొమక్ బ్లోటింగ్ తగ్గించుకోవచ్చు . లవంగాలను నేరుగా నమలడం కానీ లేదా రెండు మూడు చుక్కల లవంగాల నూనెను నీటిలో వేసి మిక్స్ చేసి తాగాలి.

4. బ్లాక్ పెప్పర్:
పొట్ట ఉదరంలో బర్నింగ్ సెన్సేషన్ ను నివారించడంలో బ్లాక్ పెప్పర్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అజీర్థి వల్ల కలిగే పొట్టనొప్పి, కడుపు మంటను తగ్గించడం కోసం కొన్ని మిరియాలను పొడి చేసి, మజ్జిగలో మిక్స్ చేసి తాగడం వల్ల ఇన్ స్టాంట్ గా ఉపశమనం కలిగిస్తుంది.

5. అల్లం:
పురాతన కాలం నుండి, జీర్ణ సమస్యలను తగ్గించుకోవడంలో అల్లంను గ్రేట్ రెమెడీగా ఉపయోగిస్తున్నారు. . స్ట్రాంగ్ జింజర్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

6. తులసి ఆకులు:
ఆహారం తిన్న తర్వాత అసౌకర్యంగా ఫీలవుతుంటే, కొన్ని తులిసి ఆకులను నోట్లో వేసుకొని నమలడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు అసిడిక్ రిఫ్లెక్షన్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

7. సోంపు:
జీర్ణ సమస్యలను నివారించడంలో సోంపు గ్రేట్ గా సహాయపడుతుంది. భోజనం తర్వాత కొన్ని సోంపుగింజలను నోట్లో వేసుకొని నలమడం వల్ల పొట్టకు సంబంధించిన జీవక్రియలు చురుకుగా జరుగుతాయి. గ్యాస్ ను నివారిస్తుంది మరియు పొట్టను శుభ్రం చేస్తుంది.

8. ఆర్టిచోక్ లీఫ్:
పొట్ట సమస్యలను నివారించడంలో మరో ఎఫెక్టివ్ హెర్బ్ ఆర్టిచోక్ లీఫ్. ఇది అజీర్తి మరియు కడుపుబ్బరం తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

9. చమోమెలీ టీ:
చమోమెలీ టీలో డైజెస్టీవ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎండిన చామంతి పువ్వుతో టీ తయారుచేసి వేడి వేడిగా తాగితే పొట్ట సమస్యలన్నీ తగ్గిస్తుంది . జీర్ణశక్తి పెరుగుతుంది.

10. పసుపు:
మరో సింపుల్ హెర్బల్ రెమెడీ. ఇది ప్రతి ఇంట్లో ఉండే హెర్బల్ మెడిస్ . పెరుగులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి తాగాలి. ఇది అజీర్తిని మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications