Latest Updates
-
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు
బాడీ పెయిన్స్ నివారించే 10 నేచురల్ రెమెడీస్
ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపా రస్తులు, డెస్క్ జాబ్ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే వుంటారు. ప్రత్యేకించి వీరికి 30ఏళ్ళు వచ్చాయంటే ఇక అవి క్రమం తప్పకుండా వస్తూనే వుంటాయి. దీనికి కారణం దీర్ఘకాల సమయం వారు ఒకే చోట కూర్చొని వుండటం కూడాను. ఎక్కువ బరువులు ఎత్తడం లేదా అధిక వ్యాయామం చేసే వారిలో బాడీపెయిన్స్ సాధారణంగా ఉంటాయి. కానీ కొన్ని సార్లు, ఒంట్లో నొప్పి ఒక తీవ్రమైన వ్యాధి యొక్క లక్షణాలకు కారణం కావచ్చు.
బాడీపెయిన్స్ కు వయస్సుతో సంబంధం లేదు. ఈ బాడీపెయిన్ అనేవి 18ఏళ్ళ వయస్సు నుండి 80 వయస్సు వారి వరకూ ఎవరికైనా ప్రభావితం చేయవచ్చు. బాడిపెయిన్స్ లో కూడా ప్రత్యేకమైన రకాలు ఉంటాయి. వాటిలో ఎక్కువగా, సాధారణంగా బాధించే శరీర నొప్పులు తలనొప్పి, బ్యాక్ పెయిన్, మరియు మెడనొప్పి, కీళ్ళనొప్పలు మరియు కండరాల నొప్పులు. ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.
బాడీపెయిన్స్ నివారించే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఆపిల్ సైడర్ వెనిగర్:
కండరాల నొప్పుల, ఇతర బాడీపెయిన్స్ తో బాధపడే వారకి ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సమాయపడుతుంది. . ఇది చాలా ఎపెక్టివ్ గా పనిచేసి బాడీ పెయిన్స్ ను నివారిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా బాత్ టబ్ లో గోరువెచ్చని నీటిని ఫిల్ చేసి అందులో రెండు కప్పులు ఆపిల్ సైడర్ వెనిగర్ వేయాలి . బాత్ టబ్ కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అవ్వడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గించుకోవచ్చు.

కోల్డ్ షవర్ లేదా కోల్డ్ కంప్రెసర్:
కోల్డ్ షవర్ లేదా కోల్డ్ కంప్రెసర్ ఎక్కువగా పనిచేయడం వల్ల కండరాల మీద ఒత్తిడి పెరిగి ఒళ్ళు నొప్పులకు దారితీస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కోల్డ్ షవర్ బాత్ గ్రేట్ గా నివారించబడుతుంది. త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. . అలాగే కోల్డ్ కంప్రెసర్ వల్ల కండరాల స్టిఫ్ నెస్ మరియు సోర్ నెస్ తగ్గుతుంది .

అల్లం:
ఇది ఒక మ్యాజికల్ హెర్బ్, ఫ్రెష్ గా లేదా ఎండిన జింజర్ ను మాస్కులర్ మరియు జాయింట్ పెయిన్స్ నివారించడానికి సహాయపడుతాయి. అలాగే వాపులు మరియు స్టిఫ్ బోన్స్ ను నివారిస్తుంది. ఫ్రెష్ గా ఉండే అల్లం ముక్కలను ఒక కాటన్ క్లాత్ లో వేసి బాగా టైట్ గా ముడి వేసి గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. మరిగించిన తర్వాత ఆ క్లాత్ ను నొప్పిఉన్న ప్రదేశంలో ప్రెస్ చేస్తూ కాపడంలా ఒత్తి పెట్టుకోవాలి. ఇలా 15నిముషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు:
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఇది పెయిన్ కిల్లర్ గా కూడా పనిచేస్తుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా పాలు బాగా మరిగించి అందులో ఒక టీస్పూన్ పసుపు వేసి వేడి చేయాలి. తర్వాత ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరంలోపల ఇంటర్నల్ గా నొప్పులను నివారిస్తుంది .

దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క జాయింట్ పెయిన్ నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఆర్ధరైటీస్ పెయిన్ నివారణకు నేచురల్ రెమెడీగా దీన్ని ఉపయోగించుకోవచ్చు . ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాల వల్ల ఒక కప్పు వేడి పాలలో అరటీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్, తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల జాయింట్ పెయిన్ నివారించబడుతుంది.

కెయాన్ పెప్పర్:
కండారల నొప్పులను నివారించడంలో ఇది గ్రేట్ హోం రెమెడీ. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ లక్షణాలు కలిగి ఉంటాయి . దీన్నీ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కండరాల స్టిఫ్ నెస్ తగ్గుతుంది . పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఒక టీస్పూన్ కేయాన్ పెప్పర్ ను రెండు చెంచాలా ఆలివ్ ఆయిల్ లో వేసి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసి, రాత్రంతా అలాగే ుంచి తర్వాత బ్యాండేజ్ కవర్ చేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తుంటే మంచి ఫలిత ఉటుంది.

రోజ్మెర్రీ:
రోజ్మెర్రీ ఫ్రెష్ హెర్బ్ ను ఉపయోగించాలి . లేదా డ్రై గా ఉన్నది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మజిల్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆన్ఫ్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పులును నివారిస్తుంది. రోజ్మెర్రీని 8కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి . తర్వాత ఈ ఆ నీటితో నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం పెట్టుకోవడం లేదా ఆ ప్రదేంలో 15 నిషాలు ఈ నీటిని మర్దన చేయడం చేయాలి.

మస్టర్డ్ ఆయిల్ :
ఆవ నూనె బాడీపెయిన్ నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఇది నేచురల్ రుబుఫేసియంట్ . ఇది బ్లడ్ ఫ్లోను మెరుగుపరుస్తుంది. మజిల్ మరియు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది . దాంతో నొప్పులను నివారిస్తుంది. నొప్పులను తగ్గించడం వేగవంతం చేస్తుంది . 10 వెల్లుల్లి రెబ్బలు మరియు 4 చెంచాలా ఆవనూనె అవసరం అనుకుంటే ఈ నూనెలోకర్పూరం వేసి, నూనె వేడి చేయాలి. చల్లారిన తర్వాత నూనెతో మసాజ్ చేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అరటి:
అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. స్ట్రాంగ్ అండ్ హెల్తీ మజిల్స్ పొందడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . అరటిపండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మజిల్ క్రాంప్స్ మరియు అలసట నుండి ఉపశమనం పొందవచ్చు . పొటాషియం లోపం వల్ల మజిల్ వీక్ నెస్ అవుతాయి అందువల్ల డైలీ డైట్ లో అరటి పండ్లను చేర్చుకోవాలి. అరటిపండ్లను రెగ్యులర్ డౌైట్ చేర్చుకోవడం వల్ల నొప్పులను నివారించుకోవచ్చు.

చెర్రీస్:
గౌట్ పెయిన్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జాయింట్లో వాపులు మరియు రెడ్ నెస్ ను నివారించడానికి చెర్రీస్ గ్రేట్ గా ఉపయోగపడుతాయి . అలాగే బ్లడ్ లో యూరిక్ యాసిడ్స్ పెంచుతుంది . కాబట్టి, నొప్పుల నివారణక ఇది బెస్ట్ నేచురల్ ఫుడ్ .

వెల్లుల్లిని
ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ . వెల్లుల్లిని పచ్చివి తినడం వల్ల స్కిన్ రాషెస్ లేదా నొప్పులను నివారిస్తుంది.వెల్లుల్లి రెబ్బలను ఆలివ్ నూనెలో వేసి వేడి చేసి, గోరువెచ్చని నూనెను జాయింట్ పెయిన్స్ ఉన్న చోట అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications











