Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
దొంగతనం చేసే వ్యాధి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!!
ఏదైనా షాప్ కి వెళ్లినప్పుడు లేదా బస్టాప్స్ లో, రైల్వే స్టేషన్స్ లో.. ఎప్పుడైనా.. మీ వస్తువులు లేదా డబ్బులు దొంగతనానికి గురయ్యాయా ? లేదా ఎవరైనా దొంగతనం చేస్తుండగా.. చూశారా ? అయితే ఇలా దొంగతనం చేయడాన్ని క్లెప్టమానియా అంటారు. ఇదో జబ్బు లాంటిది. మరి దొంగతనం చేసే వ్యాధి గురించి కొన్ని ఆసక్తికర ఫ్యాక్ట్స్ ఉన్నాయి.
మనుషులుగా మనం చాలా వస్తువులను పొందుతుంటాం. కానీ మనకు కావాల్సినవన్నీ పొందలేం. అయితే.. దాదాపు అనేక మంది తమకు ఉన్న వాటితో.. సర్దుకుపోతారు. సంతృప్తి పడుతుంటారు.
మానసిక సమస్యలున్న వాళ్లు.. వాళ్లకు కావాల్సిన పొందలేకపోతే.. తట్టుకోలేకపోతారు. అందుకే.. వాటిని ఎలాగైనా పొందాలనే ఉద్ధేశ్యంతో.. ఆ వస్తువులను డబ్బు లేకపోయినా.. దొంగతనం చేసి పొందుతారు. దొంగతనం చేయాలన్న ఆలోచన నుంచి బయటపడలేకపోతారు.
ఇలా దొంగతనం చేసే వ్యాధిని క్లెప్టాంమానియా అంటారు. ఇది కొద్దిగా తీవ్రమైన వ్యాధిగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఆ వ్యక్తిని చాలా ఒత్తిడికి గురిచేసి.. శిక్ష అనుభవించేలా చేస్తాయి. ఈ దొంగతనం వ్యాధి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

ఫ్యాక్ట్ 1
క్లెప్టోమానియా అనేది మానసిక వ్యాధి. ఈ వ్యాధితో బాధపడేవాళ్లు.. తీవ్రమైన ప్రచోదనాలను, ప్రేరణను ఎదుర్కొంటారు. పరిణామాల గురించి ఆలోచించకుండా.. వస్తువులను దొంగతనం చేస్తుంటారు.

ఫ్యాక్ట్ 2
క్లెప్టోమానియకి గురైన వాళ్లు.. దొంగతనం చేయాలన్న ప్రేరేపణ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. తీవ్ర పరిణామాల గురించి అవగాహన ఉన్నా కూడా.. ఆ ఆలోచన నుంచి బయటపడలేరు.

ఫ్యాక్ట్ 3
చాలా సందర్భాల్లో దొంగతనం వ్యాధితో బాధపడేవాళ్లు.. ఎలాంటి ఉపయోగం, విలువ లేని వస్తువులను దొంగతనం చేస్తుంది. కేవలం వాళ్లకున్న ప్రేరణను సంతృప్తి పరచుకోవడానికి ఇలా చేస్తారు.

ఫ్యాక్ట్ 4
క్లెప్టోమానియాతో బాధపడేవాళ్లు.. ఆ వస్తువులు అవసరం లేకపోయినా.. దొంగతనం చేసి.. వాళ్ల ఆలోచనలను సంతృప్తి పరుస్తారు.

ఫ్యాక్ట్ 5
విజయవంతంగా దొంగతనం చేసిన తర్వాత.. వెంటనే చాలా రిలీఫ్ అవుతారు.

ఫ్యాక్ట్ 6
దొంగతనం చేసే వాళ్ల బ్రెయిన్ లో కెమికల్ చేంజెస్ వల్ల.. రిలీఫ్ పొందుతారు.

ఫ్యాక్ట్ 7
అధ్యయనాల ప్రకారం.. క్లెప్టోమానియా అనే వ్యాధి మగవాళ్లలో కంటే.. ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది.

ఫ్యాక్ట్ 8
క్లెప్టోమానియా లేదా దొంగతనం చేసే వ్యాధితో బాధపడేవాళ్లలో ముఖ్యంగా కనిపించే లక్షణం.. తీవ్రమైన ఆందోళన, టెన్షన్. అది కూడా సక్సెస్ ఫుల్ గా వాళ్లు కావాలి అనుకున్నది దొంగతనం చేసే వరకు.. ఆందోళన ఉంటుంది.

ఫ్యాక్ట్ 9
దొంగతనం చేసే వ్యాధితో బాధపడేవాళ్లలో.. కనిపించే.. మరో లక్షణం.. దొంగతనం చేసిన తర్వాత.. షేమ్ గా ఫీలవడం, తమను తాము అసహ్యించుకోవడం వంటివి కనిపిస్తాయి.

ఫ్యాక్ట్ 10
ఈ వ్యాధితో బాధపడే వాళ్లు కొంతమంది.. వాళ్లు చేయాలనుకున్న దొంగతనం చేసిన తర్వాత.. లైంగిక తృప్తి కూడా పొందుతారు.

ఫ్యాక్ట్ 11
ఈ వ్యాధితో బాధపడేవాళ్లలో చాలా మంది చాలా సంపన్న కుటుంబాలకు చెందిన లేదా మంచి ఉద్యోగంలో ఉన్నవాళ్లు అయి ఉంటారు. అలాగే.. వాటిని దొంగతనం చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

ఫ్యాక్ట్ 12
ఈ వ్యాధిని పూర్తీగా నయం చేయలేం. సైకోథెరపీ ద్వారా ఈ ప్రేరేపణలను.. కొంతవరకు తగ్గించవచ్చు.



Click it and Unblock the Notifications