Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
డేంజర్ : డెడ్లీ క్యాన్సర్ కు నమ్మశక్యం కాని అసాధారణ కారణాలు..
ప్రాణాంతకమైన క్యాన్సర్ గురించి మనందరకి ఒక అవగాన ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అంటేనే ఇక జీవితం మీద ఆశ వదిలేయాల్సిందే. ఇంతకూ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ కు మనం ఊహించలేని కొన్ని అసాధారణమైన కారణాలున్నాయన్న విషయం మీకు తెలుసా?
స్మోకింగ్ చేయడం, కొన్ని రకాల కెమికల్స్ కు ఎక్స్ పోజ్ అవ్వడం, అనారోగ్యకరమైన డైట్ ను ఫాలో అవ్వడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని మనం అనుకుంటాము. ఇవి మాత్రమే కాదు , క్యాన్సర్ రావడానికి మనకు తెలియని మరెన్నో కారణాలున్నాయి.?
క్యాన్సర్ అంటే క్యాన్సర్ కణాలు. శరీరంలో ఒక ప్రదేశంలో క్యాన్సర్ ట్యూమర్స్ ఏర్పడితే ఇక వెంటనే క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఆ ప్రదేశం మొత్తం తర్వాత బాడీ మొత్తం విస్తరిస్తాయి. క్యాన్సర్ కణతులు ఏర్పడిన ప్రదేశంలో రక్త కణాలు, అవయవాలు డ్యామేజ్ అవుతాయి. ఈ ప్రాణాంతకరమైన వ్యాధి, వయస్సుతో, లింగభేదంతో సంబంధం లేకండా ఎవరిలో అయినా వస్తుంది. క్యాన్సర్ కు కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని తాత్కాలికంగా క్యాన్సర్ కు గురిచేస్తే, మరికొన్ని శాస్వతంగా అవయవాన్ని తొలగించాల్సి వస్తుంది.
క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి క్యాన్సర్ కు దారితీస్తున్నాయి. అయితే క్యాన్సర్ కు కొన్ని అసాధరణమైన మనం ఊహించని , సర్ ప్రైజింగ్ కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడం వల్ల , ఇటువంటి విషయాలల్లో జాగ్రత్తగా ఉండవచ్చు.

షుగర్:
స్వీట్స్, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల, బ్రెస్ట్ క్యాన్సర్, వచ్చే అవకాశాలు ఎక్కువ, రీసెర్చ్ ప్రకారం , షుగర్ ఎక్కువగా తినడం వల్ల క్యాన్సేరియస్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది.

హాట్ బెవరేజెస్ :
చాలా వేడిగా ద్రవాలు లేదా బెవరేజస్ తీసుకోవడం వల్ల , గొంతు మరియు ఆహార నాళంలో కార్సినోజెనిక్ మార్పులు జరుగుతాయి.ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది.

ప్రొసెస్ చేసిన ఆహారాలు :
రీసెర్చ్ ప్రకారం, ప్రొసెస్డ్ మీట్ తినడం వల్ల కోలన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. ఇది కొంత మందిలో మాత్రమే ఇలా ఉంటుంది.

ఆల్కహాల్:
ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. చెడు బ్యాక్టీరియా శరీరం మొత్తం వ్యాప్తి చెంది ఆరోగ్యాన్ని క్షీనింపచేస్తుంది.

సెడెంట్రీ లైఫ్ స్టైల్ :
వ్యాయామాలకు దూరంగా ఉండటం, రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతుంది. దాంతో క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు ఎక్కువ.

ఎక్కువ బరువు ఉండటం :
ఓవర్ వెయిట్ కూడా క్యాన్సర్ కు దారితీస్తుంది. ఓవర్ వెయిట్ వల్ల శరీరంలో ఫ్యాట్ సెల్స్ అధికమవుతాయి. దాంతో శరీరంలో కార్సినోజెనిక్ ఎఫెక్ట్ పడుతుంది.

ఓరల్ సెక్స్ :
హెచ్ పిఎ, సెక్స్యువల్ ట్రాన్స్ మిటెడ్ డిసీజెస్, సాధారణంగా ఓరల్ సెక్స్ వల్ల వస్తుంది. ఈ వ్యాది నోరు, గొంతు, మెడ భాగాల్లో ఎక్కువగా వస్తుంది.

విటమిన్ సప్లిమెంట్ :
విటమిన్ సప్లిమెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సేరియస్ సెల్స్ పెరుగుతాయి. కాబట్టి, విటమిన్ సప్లిమెంట్ తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించండి.

ఉడ్ డస్ట్ :
ముక్కు మరియు శ్వాసనాళంలో ఉడ్ డస్ట్ వల్ల క్యాన్సర్ కు దారితీస్తుంది.

లిప్ స్టిక్స్ :
కొన్ని రకాల లిప్ స్టిక్స్ లో హానికరమైన కెమికల్స ఉండటం వల్ల క్యాన్సర్ కు దారితీస్తుంది.

ప్లాస్టిక్ బాటిల్స్ :
ప్లాస్టిక్ బాటిల్స్ తో రెగ్యులర్ గా వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ కు దారితీస్తుంది, వీటిలో క్యార్సినోజెన్స్ లేదా క్యాన్సర్ కు కారణమయ్యే ఏజెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

హెర్పస్:
హెర్ప్స్ , మరో లైంగిక సంక్రమణ వ్యాధి,దీని కారణంగా సర్కోమ లేదా బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశఆలు ఎక్కువ.



Click it and Unblock the Notifications











