Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కేవలం వారంరోజుల్లో శరీరాన్ని డెటాక్స్ చేసే అమేజింగ్ డ్రింక్..!
వంటింట్లో అందుబాటులో ఉండే వాటితోనే.. శరీరంలోని హానికారక టాక్సిన్స్ ని బయటకు తొలగించవచ్చని మీకు తెలుసా ? టాక్సిన్స్ తొలగించడం వల్ల.. మీ శరీరం హెల్తీగా ఉంటుంది.
దుమ్ము, పొల్యూషన్ లో ప్రతిరోజూ తిరుగుతూ ఉంటారా ? బయట ఫుడ్ తింటూ ఉంటారా ? అయితే.. మీ శరీరం మలినాలతో నిండి ఉంటుంది. కాబట్టి.. వెంటనే శరీరాన్ని డెటాక్స్ చేయడం అవసరం. అది కూడా ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ హోం రెమెడీతో టాక్సిన్స్ ని బయటకు పంపవచ్చు.
మనందరికీ తెలుసు వాతావరణంలో.. చాలా మలినాలు ఉంటాయి. పీల్చే గాలి, తాగే నీళ్లు, తినే ఆహారం అన్నింటిలోనూ.. హానికారక మలినాలు ఉంటాయి. కాబట్టి.. అవి శరీరంపై దుష్ర్పభావం చూపుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలి.

ప్రస్తుత జనరేషన్ తో పోల్చితే.. మన పూర్వీకులు చాలా తక్కువగా జబ్బు పడేవాళ్లు. ఎందుకంటే.. అప్పట్లో వాతావరణం ఇంత కాలుష్యంతో కూడి ఉండేది కాదు. అయితే.. టాక్సిన్ లెవెల్స్ ఈ మధ్య చాలా పెరిగాయి. అందుకే రకరకాల వ్యాధులు మనుషులను భయపెడుతూ ఉంటాయి.
వంటింట్లో అందుబాటులో ఉండే వాటితోనే.. శరీరంలోని హానికారక టాక్సిన్స్ ని బయటకు తొలగించవచ్చని మీకు తెలుసా ? టాక్సిన్స్ తొలగించడం వల్ల.. మీ శరీరం హెల్తీగా ఉంటుంది. మరి ఈ రెమెడీ ఎలా మీ శరీరంలోని హానికారక టాక్సిన్స్ ని తొలగిస్తుందో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు
దోసకాయ జ్యూస్ 1 కప్పు
తేనె 1 టేబుల్ స్పూన్
ఈ న్యాచురల్ డెటాక్స్ డ్రింక్ ని దోసకాయ జ్యూస్, తేనెతో తయారు చేస్తాం. ఇది వ్యర్థాలను, హానికారక మలినాలను తొలగగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేసి.. మిమ్మల్ని హెల్తీగా మారుస్తుంది.
అయితే ఈ డ్రింక్ తాగుతూనే హెల్తీ డైట్, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, జంక్ ఫుడ్ కి, పొల్యూషన్ కి దూరంగా ఉండటం మంచిది. అప్పుడే.. ఈ హోం రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

దోసకాయ జ్యూస్, తేనె బ్లడ్ వెజెల్స్, పేగులలో పేరుకున్న మలినాలను తొలగిస్తుంది. అలాగే మీ శరీర వ్యవస్థను క్లెన్స్ చేసి.. హెల్తీగా మారుస్తుంది. ఈ హోంమేడ్ డెటాక్స్ డ్రింక్ కణాలను హైడ్రేట్ ఉంచి.. డీహైడ్రేషన్ ని అరికడుతుంది.
తయారు చేసే విధానం
దోసకాయ జ్యూస్, తేనెను ఒక కప్పులో కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే.. పరకడుపున తీసుకోవాలి. అంతే కేవలం వారం రోజుల్లో మీ శరీరం డెటాక్స్ అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications