Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
మణికట్టు నొప్పి నివారించే న్యాచురల్ అండ్ ఎఫెక్టివ్ రెమిడీస్..
కార్పాల్ టన్నెల్ అంటే.. మణికట్టుని, అరచేతిని కలిపే సన్నని ద్వారం. ఈ ప్రాంతంలో పెియన్, వణికినట్టు ఉండటం, మణికట్టు దగ్గరగా ఉండటాన్ని కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్ అని మెడికల్ టర్మ్ లో పిలుస్తారు. ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ ముందు పనిచేసే వాళ్లు ఈ సమస్యతో బాధపడతారు.
మణికట్టు, నరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఇది కొన్ని సార్లు తీవ్రంగా మారి వాపు, నరాల డ్యామేజ్, బ్లడ్ క్లాటింగ్ సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి సమస్య చాలా అరుదుగా వస్తుంది.
కాబట్టి.. ఈ సమస్య కనిపించగానే.. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. హెల్తీగా ఉండవచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్, వ్యాయామం, విశ్రాంతి చేతులకు చాలా అవసరం. అయితే ఇలాంటి మణికట్టు నొప్పితో బాధపడేవాళ్లకు సింపుల్ రెమిడీస్ పరిచయం చేయబోతున్నాం.
పెయిన్ కిల్లర్ వాడటం కంటే.. ఈ పద్ధతులను ఒకసారి పాటించి చూడండి. ఇవి టెస్ట్ చేసిన, ఫలితాలు పొందిన అత్యంత ఎఫెక్టివ్ న్యాచురల్ రెమిడీస్. అలాగే నొప్పి, వాపు వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. ఒకవేళ ఎక్కువరోజులు నొప్పితే బాధపడితే మాత్రం డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్
నరాల్లో టెన్షన్, నొప్పి నుంచి ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగించడానికి స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు పనిచేస్తాయి. ఈ వ్యాయామాన్ని కొంత సమయం విరామం ఇస్తూ చేస్తూ ఉండండి. ఇంట్లో లేదా, ఆఫీస్ డెస్క్ పై.. ఎక్కడైనా చేయవచ్చు. ఉపశమనం పొందవచ్చు.
ఈ వ్యాయామం చేసేటప్పుడు మరీ ఎక్కువగా పెయిన్ అనిపిస్తే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది. స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్ వల్ల కండరాలు రిలాక్స్ అయి.. నొప్పిని తగ్గిస్తాయి.

ఆలివ్ ఆయిల్ మసాజ్
మణికట్టు నొప్పి తగ్గించుకోవడానికి ఇదో న్యాచురల్ అండ్ ట్రెడిషనల్ పద్ధతి. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ లేదా ఆముదంను తీసుకుని వెచ్చగా చేయాలి. దీన్ని ఎక్కడ నొప్పిగా ఉందో.. ఆ ప్రాంతమంతా పట్టించి.. 15 నుంచి 20 నిమిషాలు మసాజ్ చేయాలి.
ఈ పద్ధతిలో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. అలాగే.. కండరాలు, నరాల్లో నొప్పి, టెన్షన్ తగ్గుతుంది.

ఐస్ ప్యాక్
ఐస్ ప్యాక్ ని అప్లై చేయండి.. తక్షణ ఉపశమనం పొందండి. నొప్పితోపాటు, వాపు కూడా తగ్గుతుంది. ఇలా.. తరచుగా చేస్తూ ఉంటే.. మణికట్టు నొప్పితోపాటు, ఆ లక్షణాలు కూడా మాయమవుతాయి.

గమనిక
ఈ పద్ధతులన్నీ తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. నొప్పి వల్ల వచ్చే అసౌకర్యం నుంచి బయటపడేస్తాయి. ఈ పద్ధతులు పాటిస్తూ లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావడం వల్ల.. వ్రిస్ట్ పెయిన్ ని పూర్తీగా నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications